E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. ఓనర్ గా సత్యం.. ముకేష్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. ఓనర్ గా సత్యం.. ముకేష్ ఎంట్రీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May18th: మా నాన్న జీవితాంతం కష్టపడిన ఆ డబ్బులు ఇలా వాడు రెండోసారి కూడా లక్షలు మింగేసి మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఆ నిజం బయటపడింది కాబట్టి వీడి బండారం కూడా బయటపడింది. దాంతో వీడిని ఏం చేసినా పాపం లేదు. కానీ మా అమ్మ మొహం చూసి వదిలేస్తున్నాము అని బాలు అంటాడు.. మనోజు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ప్రభావతి వీడు చెప్పింది కరెక్టే. ఆయన గారే ఈ షాప్ కి ఓనరు అని అంటుంది. ఇక ప్రభావతి మాట విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అమ్మ ఈమధ్య మన మాటకి సపోర్ట్ గా నిలుస్తుంది అని బాలు కూడా అవాక్కవుతాడు.

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

గదిలోకి వెళ్లిన మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్లి నువ్వు మళ్ళీ ఇంటికి వస్తావని నేను అస్సలు ఊహించలేదు రోహిణి. ఎక్కడికైనా వెళ్ళిపోయావేమో అని నేను చాలా బాధపడ్డాను అని అంటాడు. నీకు కొంచమైన బుద్ధుందా మనోజ్ నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. కానీ మీ అమ్మ నన్ను తిడుతున్న కూడా, కొడుతున్న నువ్వు పట్టించుకోలేదు. నీకు ఎంత చెప్పినా కూడా ఇంతే.. నీ నుంచి నేను సారీ ఎక్స్పెక్ట్ చేశాను అది కూడా లేదు నేను ఫోన్ చేసిన కూడా నువ్వు ఫోన్ తీయడం లేదు అని రోహిణి మనోజ్ నితిడుతుంది. అలా బాధపడుతుంది అని మనోజ్ కూడా చాలా బాధపడిపోతాడు.. ఇద్దరు ఎడ మొహం పెడ మొహం లాగా కూర్చోవడం చూసినా ప్రభావతి గదిలోకి వస్తుంది.. అమ్మ రోహిణి నువ్వు ఈ సమస్య నుంచి బయట పడేయాలి అని ప్రభావతి అంటుంది. కోట్లకు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా పాతిక లక్షలు ఇస్తే ఏమీ పోదు కదా అని ప్రభావతి అంటుంది. ఈవిడ అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరికిస్తుంది అని రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది.. చెప్పిన సరే ప్రభావతి మాత్రం వినకుండా నా మాటని నిలబెట్టు అని రోహిణి కి చెప్పి వెళ్తుంది..

బాలు ప్లాన్.. ప్రభా షాక్..

Advertisement

నాన్న ఏంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావ్ కదా రెడీ అయ్యిరా వెళ్దామని బాలు అంటాడు.. ఎక్కడికి వెళ్దాం రా.. ఏం మాట్లాడుతున్నావ్ రా కొంచమైనా ఉందా నీకు అని అనగానే ఇవాళ నేను ఓనర్ని చేయాల్సిన బాధ్యత నాది అందుకే నువ్వు రెడీ అయ్యారా వెళ్దామని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం వాడు ఇప్పటికే చచ్చిపోయాడు రా ఇంకా ఎందుకురా అవన్నీ బాధ పెడతావని అంటుంది. వాడు బాధపడతాడు అని కాదు నువ్వు బాధ పడిపోతున్నావే మా నాన్న కష్టార్జితం అది ఈరోజు ఎలాగైనా సరే మా నాన్న ఓనరు అని బాలు ప్రభావతిని కూడా రెడీ అయ్యి రమ్మని చెప్తాడు.

మనోజ్ రోహిణి పై శృతి సెటైర్..

షాప్ లో వర్కర్ ని మనోజ్ తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఎందుకు అతను అలా తిడుతున్నావు. కొంచెం కూడా బుద్ధి లేదా అని అరుస్తుంది. వల్ల అలా తిడితేనే పడుంటారు లేదంటే మాత్రం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అని మనోజ్ అంటాడు. అప్పుడే రవి, శృతి రావడం చూసి ఏంటి మీరు ఎలా వచ్చారు ఏదైనా ఫర్నిచర్ కొనాలని రోహిణి అడుగుతుంది. బాలు మీనా ఇక్కడికి రమ్మని చెప్పారు అని అనగానే మనోజ్ రోహిణి ఇద్దరు షాక్ అవుతారు. వాళ్లు ఎందుకు రమ్మన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అని రోహిణి అడుగుతుంది. కాసేపట్లో మీకే తెలుస్తుంది కదా ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని రవి అంటాడు..

మనోజ్ కు షాక్..

Advertisement

ప్రభావతి సత్యంతో పాటు మీనా బాలు కూడా షాప్ కి రావడంతో ఏంటి మీరందరూ ఇలా వచ్చారు అని మనోజ్ అడుగుతాడు. ఇవాళ నిన్ను గద్దె దించి నాన్నని ఓనర్ సీట్లు కూర్చోబెట్టాలని వచ్చాను అని బాలు అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అని మనోజ్ ఎంతగా అడుగుతున్నా సరే బాలు మాత్రం ఇవాల్టి నుంచి ఓనర్ మానాన్నే అని అంటాడు. ఏంటమ్మా నువ్వు కూడా వీళ్ళ పార్టీలో చేరిపోయావా అని మనోజ్ ప్రభావతిని అడుగుతాడు. మీరిద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేశారు. మా నమ్మకాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి నేను కూడా ఆయనే ఓనర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ప్రభావతి అనగానే మనోజ్ షాక్ అవుతాడు. ఇక బాలు ప్లాన్ సక్సెస్ అవ్వడంతో సత్యంని ఓనర్గా చేసేందుకు సిద్ధం చేస్తాడు..

ఓనర్ గా సత్యం..

బాలు సత్యం ఎంత చెప్తున్నా కూడా వినకుండా మీరు ఓనర్ సీట్లో కూర్చోవాల్సిందే నాన్న అని అంటాడు. ఏంటమ్మా నువ్వు కూడా నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అని మనోజ్ అడుగుతాడు. నీ జీవితాన్ని అమ్మ ఎక్కడ నాశనం చేసింది రా నీ వల్లే మేము నాశనం అయిపోయాము. నాకైతే డబ్బు మీద ఎటువంటి ఆశ లేదు. రవి మాత్రం రెస్టారెంట్ పెట్టాలన్న కలకి నువ్వే అడ్డుపడ్డావు. వాడిని ఎక్కడో హోటల్లో పనిచేసేలా చేసావు. వాడిని ఎదుగుదలని నువ్వే ఆపేసావు నువ్వు నీ భార్య స్వార్థం చూసుకున్నారు అని మనోజ్ పై బాలు సీరియస్ అవుతాడు. నాన్న ఇక మాటల అనవసరం మీరు వెళ్లి ఆ సీట్లో కూర్చొండి అని బాలు ప్రభావతి సత్యములకు పూలమాలలు వేసి సత్కరిస్తాడు.

బాలు వల్ల క్షమించిన ముకేష్..

మనోజ్ బయటికి వెళ్లి చూడగానే అక్కడ ఉన్న కొంతమంది డీలర్స్ షాప్ లోకి రావడంతో నాన్న మీరు ఒకసారి ఆ సీట్లోంచి లేవండి అని మనోజ్ అంటాడు. ఇప్పుడే కూర్చోబెట్టి అప్పుడే దించేస్తావా ఎందుకురా లేవాల్సిన అవసరం లేదు అని బాలు అంటాడు. వి ల్ల డీలర్స్ ఇచ్చిన డబ్బులు తోనే కొనాలి అనుకున్నాను ఆ 30 లక్షలు వాళ్ళు మోసం చేశారు ఇప్పుడు డీలర్స్ వస్తున్నారు అని మనోజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. ఆ డీలర్స్ మనోజ్ డబ్బులు తీసుకున్నాడని పెద్దగా రచ్చ చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన ముంబై ముఖేష్ బాలు సత్యం ముఖం చూసి మరోసారి మనోజ్ నీకు క్షమిస్తాడు.. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు.. షాప్ లో ఓనర్ గా తీసేసినందుకు మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ రొమాన్స్.. అమూల్యకు టెన్షన్.. నర్మద అనుమానమే నిజమా..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×