E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్ పెట్టిన సుకన్య.. ఆస్తి కోసం ప్రతాప్ రచ్చ.. రామరాజు గుండెలు పగిలే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్ పెట్టిన సుకన్య.. ఆస్తి కోసం ప్రతాప్ రచ్చ.. రామరాజు గుండెలు పగిలే సీన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 21st: శ్రీవల్లి భాగ్యం అలాగే ఆనందరావు సుకన్య గదిలో తలుపు వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. దేవుడనే వాడు ఉన్నాడు అందుకే నా మొర ఆలకించాడు అని శ్రీవల్లి ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది.. మనలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడని నువ్వు చెప్పావు కదా నేను నమ్మలేదు ఇప్పుడు అది నిజమే అని నాకు అర్థం అవుతుంది అని శ్రీవల్లి అంటుంది.. ఆ సాగర్ ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి నేనే కారణమని భాగ్యం అంటుంది. రావు తో మాట్లాడిన మాటలు గురించి చెప్పడంతో శ్రీవల్లిని బుర్రె బుర్రమ్మ నువ్వు చేయడంవల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఏది ఏమైనా సరే సాగర్ వెళ్ళిపోతున్నాడు అని శ్రీవల్లి నర్మదా బయటకు పోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది..

శ్రీవల్లి కి దిమ్మతిరిగే షాక్..

భాగ్యం చెప్పిన మాట విన్న శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. శకుని కన్నా గొప్ప దానివే.. కానాలో గనక నువ్వు ఉంటే కచ్చితంగా ఎన్నో యుద్ధాలు జరిగేవి అని తన తల్లిని గొప్పగా పొగిడేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఏది ఏమైనా కూడా నువ్వు చేసిన ఈ పనికి నా కడుపు బయటపడకుండా జరిగిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని శ్రీవల్లి గంతులు వేస్తూ సంతోషంలో మునిగి తేలుతుంది.. ఏడ్చినట్టే ఉంది నీ యవ్వారం. నర్మదా నీ శత్రువు కదా ఎక్కడికో వెళ్లి ఉండడం కంటే నీ కళ్ళముందు ఉండడమే మంచిది కదా అని సుకన్య అంటుంది.. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.. మంచి ఇల్లు కొనుక్కొని హోటల్లో భోజనం తింటూ సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు ఏదో ఒక విధంగా పుల్లలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు కదా అని సుకన్య చెప్పగానే శ్రీవల్లి ఆలోచిస్తుంది.

కన్నీళ్లు తెప్పించిన ప్రేమ..

Advertisement

సాగర్ నర్మదని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు.. వేదవతి బ్రతిమలాడుతూ సాగర్ ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఎందుకురా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. వెళ్ళిపోతే నేను తట్టుకోలేను రా కనీసం ఈ అమ్మ కోసమైనా ఆగిపోరా అని వేదవతి బ్రతిమలాడుతున్న సరే సాగర్ మాత్రం నాటకాలు వద్దమ్మా అని అంటాడు.. అప్పుడే ఇంట్లోకి ధీరజ్ ప్రేమ వస్తారు… నిన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోనివ్వకుండా చేయాలని నేను 500000 కట్టి వెళ్ళు అని అన్నానురా అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని ఎంత చెప్తున్నా సరే సాగర్ మాత్రం మాట వినడు.. నర్మదతో ప్రేమ నాకు అమ్మ లాంటి నువ్వు దూరం అయిపోతావ్ అంటే నాకు చాలా భయంగా ఉంది అక్కని ఎమోషనల్ డైలాగులతో అందరినీ ఏడిపించేస్తుంది.. కానీ సాగర్ మాత్రం నర్మదా మనం వెళ్లాల్సిందే అని కఠినంగా ఉంటాడు.

ప్రసాద్ ఎంట్రీ తో రచ్చ రచ్చ..

నర్మదా మనం ఇప్పుడు బయటికి వెళ్లాల్సిందే నువ్వు వస్తావా రావా అని సాగర్ నర్మదని ప్రేమతో మాట్లాడి ఇవ్వకుండా తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు.. రామరాజు తన కొడుకు వెళ్ళిపోతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆగు రామరాజు అంటూ ప్రసాద్ రావు మాట వినపడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. నీ కొడుకుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా గుమ్మం దాటే ప్రసక్తే లేదు.. లాయర్ని కూడా తీసుకొని వచ్చాను నా అల్లుడికి రావాల్సిన ఆస్తిని రాయించి ఆ తర్వాత ఇంట్లోంచి పంపించు అని ప్రసాద్ రావు అడ్డుపడతాడు. ఆ మాట వినగానే రామరాజు ఇదంతా జరగడానికి కారణం నువ్వే అంటూ రెచ్చిపోతాడు. ప్రసాద్ ఇంకా రెచ్చగొట్టడంతో రామరాజు అతని కొడతాడు..

రామారాజుకు అవమానం..

Advertisement

నా కొడుకుని నాకు కాకుండా లేనిపోనివి చెప్పి తన మనసుని చెడగొట్టావు. ఇదంతా నీవల్లే వచ్చింది నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళు అని ప్రసాద్ రావు ని రామరాజు కొడతాడు.. ఆస్తిలో వాటా లేదు ఏమి లేదు ఇకనుంచి వెళ్ళిపో నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా అని రామరాజు సీరియస్ అవుతాడు. నా అల్లుడికి వాటా ఇచ్చేంతవరకు ఇకనుంచి నేను కదలను అని రామరాజుతో ఛాలెంజ్ చేస్తాడు ప్రసాద్ రావు.. వాట్ అనేది ఏమీ లేదు అని రామరాజు ఇంకాస్త రెచ్చిపోయి గొడవకు దిగుతాడు.. ఇద్దరు కలిసి కొట్టుకునే వరకు వెళ్లడంతో మధ్యలో వచ్చిన సాగర్ రామరాజు ని కిందకు నెట్టేస్తాడు. ఇది రామ రాజుకి అవమానమే..

గుండెల్ని పిండి చేసే సీన్..

రామరాజు ని సాగర్ మా మామయ్య మీదే చెయ్ చేసుకుంటావని నెట్టడంతో పోయి కింద పడతాడు. అందరూ రామరాజును పట్టుకొని ఏడుస్తూ ఉంటారు కానీ రామరాజు మాత్రం తన కొడుకుతో గడిపిన క్షణాలని గుర్తుచేసుకొని బాధపడిపోతూ ఉంటాడు. కానీ ప్రసాద్ రావు మాత్రం ఆస్తి ఇవ్వాల్సిందేనని మొండిగా మాట్లాడతాడు. తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచే ఈ ఆస్తి గొడవ సీను ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. సాగర్ ఎందుకిలా మారిపోయాడు అని అందరూ బాధపడిపోతూ ఉంటారు. తిలో వాటలేదు ఏమీ లేదు ఇది మా సమస్య మీరు వెళ్ళండి అని వేదవతి మర్యాదగా ప్రసాద్ రావుకి చెబుతుంది.

ప్రసాద్ రావుకు ధీరజ్ వార్నింగ్..

మా ఇంట్లోకి మీరు వచ్చి గొడవలు పెడుతున్నారా అని ధీరజ్ అడుగుతాడు.. మధు కూడా నువ్వు వెళ్ళిపో నాన్న ఇంట్లో ఆస్తి గొడవలు అని తీసుకురావద్దు అని ఎంత చెప్తున్నా సరే ప్రసాదరావు మాత్రం నా అల్లుడికి ఆస్తి ఇచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కాదన్న అని అంటాడు.. ఆస్తి గురించి మాట్లాడే అధికారం మీకు లేదు.. మీరు ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు అని ధీరజ్ ప్రసాద్ రావుకి వార్నింగ్ ఇస్తాడు. నువ్వెవరివి నాకు వార్నింగ్ ఇవ్వడానికి నా అల్లుడికి ఆస్తి ఇచ్చేంతవరకు ఇకనుంచి కదలను.. లాయర్ ని కూడా నా వెంట తీసుకొని వచ్చాను మీరు ఆస్తి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అని ప్రసాద్ రావు ధీరజ్ని రెచ్చగొట్టేలా మాట్లాడడంతో అతని కొట్టడానికి ముందుకు వస్తాడు ధీరజ్.. కానీ రామరాజు ఆపుతాడు.

ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను..

ఆస్తి ఆస్తి అని అంటున్నావు కదా ఈ ఆస్తి ఈ ఇండ్లు అంత నా కష్టార్జితమే.. రక్తాన్ని దారి పోసి మరి నేను ఇంటిని కట్టుకున్నాను.. ఇది నేను సంపాదించుకున్న ఆస్తి రూపాయి రూపాయి పోగేసుకొని ఈరోజు ఇంతగా సంపాదించుకున్నాను అని రామరాజు అంటాడు. నేను సంపాదించుకున్న ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పేస్తాడు రామరాజు.. ఆ మాట వినగానే ప్రసాద్ రావు నువ్వు ఇలా మాట్లాడతావని తెలిసే నేను లాయర్ ని తీసుకొని వచ్చాను.. రూల్స్ ప్రకారం కన్నబిడ్డలకి కన్నతండ్రి ఆస్తి వస్తుంది. లాయరు మాట ప్రకారం మీరు ఆస్తి పంచాల్సిందే అని ప్రసాద్ రావు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహా నాది.. భూషణ్ కు చక్రీ వార్నింగ్..చక్రీకి ప్రతాప్ ఛాలెంజ్.. ఇదే ట్విస్ట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×