E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బోనులో నిలబడ్డ మనోజ్.. రోహిణికి స్ట్రాంగ్ వార్నింగ్..కల్పన ఎంట్రీతో మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: బోనులో నిలబడ్డ మనోజ్.. రోహిణికి స్ట్రాంగ్ వార్నింగ్..కల్పన ఎంట్రీతో మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May8th: ఇంటికొచ్చిన బాలు మొత్తం హడావిడి చేసి కోర్టు బోను ని ఏర్పాటు చేస్తాడు.. అందులో మనోజ్ ని నిలుచోబెట్టి. ఈయన గారు ప్రేమించిన అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్న విషయం ఎవరికీ చెప్పలేదు అని అంటాడు. మాట వినగానే ప్రభావతి సత్యం ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈయన ఏం మాట్లాడుతున్నారండి మీరు డబ్బులు తీసుకున్నాడా అని అడుగుతుంది. అదేవిధంగా రోహిణి కూడా ఇందులో బాగా ఉంది అని చెప్పగానే దిమ్మతిరిగిపోయే షాక్ అవుతుంది. రోహిణి ఇద్దరు కూడా ఈ విషయం వీడికి ఎలా తెలుసు అని ఆలోచిస్తారు..

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి డబ్బులు తీసుకున్నారు. ఆ కల్పనని ఈ నిజం నాకు చెప్పింది అని బాలు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి.. మనోజ్ అడ్డంగా దొరికిపోయాను అని కంగారు పడిపోతూ ఉంటాడు.. ఇప్పుడు ఎటు తప్పించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటారు. మాటలు అంటే సరిపోదు అసలు మేము ఆ కల్పన దగ్గర డబ్బులు తీసుకున్నాము అన్నదానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అని రోహిణి అడుగుతుంది. పోలీస్ స్టేషన్లో మీరిద్దరూ బాండ్ మీద సంతకాలు పెట్టించుకున్నారు కదా ఆ కాపీ నా దగ్గర ఉంది. మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పగానే రోహిణికి నోట మాట రాలేదు. నిజంగానే కల్పనా బాలుకి దొరికిందా? మొత్తం నిజం చెప్పేసిందా ఇప్పుడు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

నిజం చెప్పిన కల్పన..

Advertisement

ఈవిడ ఎవరు గుర్తు ఉందా రా లక్షల మింగినోడా అని బాలు మనోజ్ ని అడుగుతాడు. నీ మాజీ ప్రియురాలు అదే నాన్న జీవితాంతం కష్టపడ్డ కష్టార్జితాన్ని తీసుకొని వెళ్లి ఇచ్చిన నీ గర్ల్ ఫ్రెండు ఈవిడే కదా అని బాలు అంటాడు.. ఎలా గుర్తుంటది బాలు డబ్బులు తీసుకున్నాడు కదా ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పింది గుర్తుంటుంది అని కల్పనా అంటుంది. అసలు ఆ డబ్బులు తీసుకొని ఏం చేశావు అని బాలు అడుగుతాడు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని మనోజ్ అప్పటికి బుకా ఇస్తాడు.. నేను మీ అబ్బాయికి 40 లక్షలు కాదు వడ్డీతో సహా కలిపి 45 లక్షలు ఇచ్చాను ఇదిగోండి ప్రూఫ్ అని చూపిస్తుంది కల్పన.. మీ అబ్బాయి అమాయకుడే.. మీ కోడలు కంత్రి వడ్డీని కూడా రాబట్టింది నా దగ్గర నుంచి అని కల్పన చెప్పగానే ప్రభావతి సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను అని కల్పనా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మనోజ్ ను కొట్టిన ప్రభావతి…

కల్పన వెళ్లగానే మనోజ్ ని ఈడ్చుకొని వస్తుంది ప్రభావతి. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు రా ఎన్ని ఏళ్ళు ఇలానే తప్పులు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతావు.. నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా..? నీ కన్న తండ్రి జీవితాంతం డ్రైవర్ గా పనిచేసే సంపాదించిన డబ్బులు తీసుకొని ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని ప్రభావతి మనోజ్ ని దారుణంగా కొట్టేస్తుంది.. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఇంట్లో ఇద్దామని నేను చెప్పానమ్మా.. కానీ రోహిణి వినకుండా బిజినెస్ చేద్దామని నాకు ఐడియా ఇచ్చింది అని మనోజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రభావతి ఇంకాస్త రెచ్చిపోతుంది..

రోహిణిని ప్రభావతి గెంటేస్తుందా..?

Advertisement

రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం మాట వినకుండా ఉంటుంది. ఆ డబ్బులు మా నాన్న ఇచ్చాడు అని కోతలు కోసావు కదా ఎవరి డబ్బులు అవి.. ఎందుకు నన్ను ఇంతగా మోసం చేశావు అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. ఆ డబ్బులతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నావా? అసలు ఎక్కడ మీ నాన్న అని అడుగుతుంది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశావు.. నన్ను తలదించుకునేలా చేసావు.. ఆ భర్త ముందర నన్ను ఒక దోషిని చేసావు అని చెంపలు పగలగొడుతుంది ప్రభావతి.. మరి రోహిణి తన నిజ స్వరూపాన్ని బయటపెడుతుందా..? ప్రభావతి దెబ్బకి ఇంట్లోంచి పారిపోతుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ ఫ్యామిలీని పంపేందుకు ఆది ప్లాన్.. వెనక్కి తగ్గని మహా.. పోటీలో ట్విస్ట్..

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×