E-Paper
Advertisement

విమానంలో మహువాకు వేధింపులు.. టీఎంసీ చోర్ చోర్ అంటూ నినాదాలు, వీడియో బయటపెట్టిన ఎంపీ

విమానంలో మహువాకు వేధింపులు.. టీఎంసీ చోర్ చోర్ అంటూ నినాదాలు, వీడియో  బయటపెట్టిన ఎంపీ
Advertisement

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఏకంగా ఆమెని విమానంలో కొందరు వ్యక్తులు వేధించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆమె షాకయ్యారు. వేధింపుల తతంగం వీడియోను ఆమె బయటపెట్టారు. అదే సమయంలో బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అసలు విమానంలో ఏం జరిగింది?

విమానంలో టీఎంసీ ఎం మహువాకు  కొందరి నుంచి వేధింపులు

Advertisement

టీఎంసీ ఫైర్ బ్రాండ్ అనగా మమతా తర్వాత మహువా మొయిత్రా గుర్తుకు వస్తారు. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కారు సదరు ఎంపీ. ఆమెను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి టీఎంసీ చోర్ చోర్ అంటూ నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది.

తాను అధికారిక పని మీద రక్షణపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్తున్నాను. ఇండిగోకు చెందిన 6E 719 విమానంలో 1F సీటులో ఉన్నాను. ఆ సమయంలో అరడజను వ్యక్తులు గుంపుగా విమానం ఎక్కారు. తన వైపు అసభ్యంగా చూసి, టీఎంసీ చోర్ చోర్ అంటూ వెకిలి చేష్టలు చేశారు. ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్ అయి దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

టీఎంసీ చోర్ చోర్ అంటూ నినాదాలు చేసిన కొందరు వ్యక్తులు

దీనికి సంబంధించి తీసిన వీడియో ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది పౌర ఆగ్రహం కాదని, ముమ్మాటికీ వేధింపులను రాసుకొచ్చారు. విమానంలో నా భద్రతను ఉల్లంఘించడమేనని, విమానం లోపల ఇలాంటి వేధింపులకు పాల్పడిన పోకిరీలు ఏమాత్రం తప్పించుకోలేరని ప్రస్తావించారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇది బీజేపీ సంస్కృతా అంటూ మండిపడ్డారు. తొలి ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా ఆన్‌లైన్‌లో వీడియో చూసిన తర్వాత రియాక్ట్ కావాలని డిసైడ్ అయినట్టు చెప్పారు.

ALSO READ: తమిళనాట రాజకీయాలు మరో మలుపు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన టీవీకే పార్టీ

ఆ వీడియోతోపాటు ఇండిగో సంస్థ, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం స్టాలిన్‌కు ట్యాగ్ చేశారు. వారి పేర్లను బయటపెట్టి, నో ఫ్లై లిస్ట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం క్యాబిన్ సిబ్బంది నినాదాలు ఆపాలని ప్రయాణికులను కోరారు. ఆ తర్వాత ప్రయాణికులు వెంటనే ఆపినట్టు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.

 

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×