E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పార్వతిని అవమానించిన ప్రభావతి.. సత్యం, సుశీల క్లాస్.. శోభకు మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: పార్వతిని అవమానించిన ప్రభావతి.. సత్యం, సుశీల క్లాస్.. శోభకు మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరిపిస్తారు. ఈ వేడుకలకి బాలు లేకపోవడం తీరని లోటు అనే చెప్పాలి. అయితే సుశీల మాత్రం మీనా పై ఎనలేని అభిమానాన్ని ప్రేమను చూపిస్తుంది. ప్రభావతి అద్ద తెచ్చిన గిఫ్ట్ నీ తానే కొట్టేయాలని టీవీ ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే కొత్త టీవీ అని కలరింగ్ ఇస్తూ పాత టీవీని కామాక్షి చేత ఇంటికి తెప్పించుకుంటుంది. కామాక్షి ఇంటికొచ్చి రాగానే ఈటీవీ మోసుకొని రావడానికి నేను చాలా కష్టపడ్డాను.. ఇప్పుడు నీకోసం తీసుకొచ్చాను అని అంటుంది. మొత్తం దులిపేసి కడిగి మరి ప్యాకింగ్ చేసుకొని వచ్చానని కామాక్షి చెప్పడంతో నువ్వు చాలా మంచి పని చేశావని ప్రభావతి పొగిడేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సుశీల మీనాని బాలు ఎక్కడికెళ్లాడమ్మా ఇంకా కనిపించలేదా వాడు ఫోన్ ఎత్తలేదా అని అడుగుతుంది. లేదు అమ్మమ్మ గారు ఎక్కడున్నాడో తెలియట్లేదు అని మీనా అంటుంది. ఏంటి ఇలా ఉన్నావ్ వెళ్లి తయారయిరా అని సుశీల అంటుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా నగలు లేకుండా బోసి మెడతో ఉన్నావ్ ఆ ఎవరూ పుట్టింటి నుంచి తెచ్చినవి కాదు. నేను నా సొంత డబ్బులతో చేయించాను అని సుశీల అంటుంది. మీనా నగలను వేసుకొని పట్టు చీర కట్టుకుని కిందకి వస్తుంది. సుశీల చాలా లక్షణంగా ఉందని మీనాని పొగిడేస్తుంది.

Advertisement

మీనా కిందికి రాగానే పార్వతి రావడం చూసి ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. సుశీల అందరూ బాగున్నారా అని అడుగుతుంది. ఈ అమ్మాయి కూడా పెళ్లి సంబంధం చూస్తున్నారా అని సుశీల పలకరింపులు తర్వాత అడుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పెళ్లి కావాలంటే మరొకరు ఎవరో ఒకరు పోవాలి అని ప్రభావతి టక్కున నోరు జారేస్తుంది. ఆ మాట అనగానే అందరూ ప్రభావతిని దారుణంగా తిడతారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ తెలుసా ఎవరు చావాలని అనుకుంటున్నావు అని అందరూ ప్రభావతికి క్లాస్ పీకుతారు..

ఏదో నోరు జారీ మాట్లాడను వదిలేయండి అని ప్రభావతి అంటుంది. పిల్లలు పుట్టారు కాబట్టి నేను భరిస్తున్నాను లేదంటే నిన్ను ఎప్పుడో భరించే వాడిని అని సత్యం తిడతాడు. దాంతో ప్రభావతి ఇంట్లో ఇంకా మూలలే లెవా ఏదో ఒక మూల ఉంటాను పద కామాక్షి అని వెళ్తారు.. పార్వతిని నువ్వేమీ బాధపడకమ్మా దాని గురించి తెలిసిందే కదా అనేసి సత్యం అంటాడు. ఇక అందరికీ మీనా రోస్ మిల్క్ తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. ప్రభావతి నాకు కూడా కావాలి అని అమాయకంగా అడుగుతుంది. మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను అత్తయ్య తీసుకోండి అని అంటుంది మీనా…

Advertisement

సత్యం పార్వతి తో నువ్వేం బాధపడకమ్మా నేను కూడా నాకు తెలిసిన వాళ్ళతో చెప్పి పెట్టాను మంచి సంబంధం చూసి చేద్దామని అంటారు. ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని మీనా అంటుంది. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన శోభా ఇంట్లో ఎలాగైనా సరే గొడవలు పెట్టాలని అనుకుంటుంది. కానీ తన ప్లాన్ రివర్స్ అవుతుంది శృతి శోభాను వెళ్ళిపొమ్మని బయటకు తీసుకొస్తుంది.

Also Read:గర్ల్ ఫ్రెండ్ కి వెళ్తే హెల్మెట్ తీసుకెళ్లండి… అబ్బాయిలకు నిర్మాత వార్నింగ్..

అటు సంజయ్ మౌనిక ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. స్వరాజ్యం దగ్గరికి వెళ్లి అమ్మ నువ్వు నాకు నిజం చెప్పు మౌనిక నిజంగానే గుడికి వెళ్లిందా అయితే ఏ గుడికి వెళ్ళింది అని అడుగుతాడు.  స్వరాజ్యం దగ్గరికి వెళ్లి అమ్మ నువ్వు నాకు నిజం చెప్పు మౌనిక నిజంగానే గుడికి వెళ్లిందా అయితే ఏ గుడికి వెళ్ళింది అని అడుగుతాను అడుగుతాడు.. పూజలో ఉండి ఉంటుంది లేరా వస్తుందిలే అని ఎంత చెప్పినా సరే సంజయ్ మాత్రం ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి స్వరాజ్యం సంజయ్ కి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి పంపిస్తుంది. ఇక మౌనిక సంజయ్ ఫోన్ చేయడం చూసి నేను వెళ్తాను మా ఆయన నేను భోజనం పెట్టకపోతే తినడు అని అంటుంది. ఇక మౌనిక నేను వెళ్తాను అని అంటే మీనా ఆపుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు సుశీలకు అదిరిపోయే సర్ప్రైజ్ని ఇస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×