The GirlFriend : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈవెంట్ కి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు. సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు. మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నామంటూ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఎక్కువమంది ఈ సినిమాలో రష్మిక మందన్న డేర్ చేసిందంటూ మాట్లాడటం విశేషం.. అలాగే ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ రావడంతో సందడి కాస్త పెరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్ కి వచ్చిన నిర్మాత బన్నీ వాసు సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఆయన మాట్లాడుతూ హెల్మెట్లు తప్పనిసరి అని అన్నారు. బన్నీ వాసు స్పీచ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ముందుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై ప్రశంశాలు కురిపించారు.. విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ బ్యానర్ కి బంగారు కొండ అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు నిర్మాత బన్నీ వాసు.. ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ రవీంద్ర ను అభినందించారు.. చివరగా రష్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి గురించి మాట్లాడారు. ఆ తర్వాత సినిమా ట్రైలర్ లో ఏదైతే చూపించారో సినిమాలో అదే చూపించారు. అమ్మాయిలు మీరు మీ బాయ్ ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళమని అడగండి వాళ్ళు కనుక ఏమి మాట్లాడకుండా సరే అంటే మంచి బాయ్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి అని మొదలుపెట్టాడు బన్నీ వాసు. నేను మా ఆవిడతో కలిసి సినిమాకి వెళ్లాను నేను మంచి భర్తనే అనుకోండి అని మాట్లాడుతూ.. అబ్బాయిలు అమ్మాయిలతో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్తే మాత్రం కచ్చితంగా హెల్మెట్లు కొనుక్కొని వెళ్ళండి అంటూ టంగ్ స్లిప్ అయ్యి నిజం మాట్లాడేసాడు. మళ్లీ ఆ మాటను మార్చేసి హెల్మెట్లు తలకి పెట్టుకునేవి అని అన్నాడు. ఏదో కవర్ చేశాడు కానీ ముందు అన్న మాటకే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారింది.
Also Read :టాలీవుడ్ మదర్స్ రియల్ ఏజ్.. అందరికన్నా చిన్నది ఆమె..?
నిర్మాత బన్నీ వాసు తన మనసులో ఏది దాచుకోకుండా బయటికి చెప్పేస్తుంటాడు.. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ లో ఆయన హెల్మెట్ల గురించి మాట్లాడిన మాట ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.. సినిమా చూసేదానికి వెళ్లే వారికి హెల్మెట్ లో అవసరం లేదు కదా.. థియేటర్లలో అలాంటివి కుదరవు కదా మరి నిర్మాత ఎలా మాట్లాడాడు అంటూ నెట్టింట కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాలేదేమో.. లేదా కావాలని మాట్లాడాడేమో అంటూ బన్నీ వాసును ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై బన్నీ వాసు ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికొస్తే..డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ సినిమాతో రష్మిక మందన్న ఖాతాలో మరో హిట్ పడిపోయినట్లే.. ఇకపోతే ప్రస్తుతం ఓ రెండు మూడు భారీ ప్రాజెక్టులలో రష్మిక మందన్న నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..