Gundeninda GudiGantalu Today episode November 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు బామ్మ చివరి కోరికను నెరవేర్చి పుట్టినరోజు నాడు ఎవరు ఊహించలేని విధంగా గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటుంది. బామ్మ స్నేహితురాలైన సత్య కూడా ఎవరు ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఇస్తుంది. బామ్మ లవర్ గోపాలం ను బర్త్డే పార్టీకి తీసుకువస్తుంది.. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని సుశీల ఫ్రెండ్ సత్య బయటపెట్టేస్తుంది. ఈ వయసులో ప్రేమ వ్యవహారాన్ని గుర్తు చేసుకొని సిగ్గు పడుతుంది.. ఆమె సిగ్గు పడటం చూసి అందరు నవ్వుతారు.. వీళ్ళ ఇద్దరిని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా మీ వయసులో కూడా మీరు ఇంతగా మెలికలు తిరుగుతున్నారా అని అంటారు.. ముగ్గురు స్నేహితులు కలిసి ఆట పట్టిస్తారు. మొత్తానికి సుశీల కోరికను బాలు తన పుట్టినరోజు నాడు తీర్చడంతో చాలా సంతోషంగా ఉంటుంది. బామ్మ సంతోషాన్ని చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషపడతారు.. ఇక అందరూ కలిసి సుశీల పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన బాలుకే నేను ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అంటుంది. నా చిన్ననాటి స్నేహితులందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాడు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కారణం వాడే ఇది బాలు మీనాకే చెందుతుంది అని ఒక నెక్లెస్ బాక్స్ ఇస్తుంది.. తరాలుగా వస్తున్నా కుటుంబ మర్యాద.. అందుకే ఇది చాలా స్పెషల్ అని అన్నాను. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లిళ్లు చేసుకునే విడిపోయిన నా స్నేహితులని మళ్ళీ నాకు దగ్గర చేసిన బాలుగే గిఫ్ట్ చెందుతుంది అని సుశీల అంటుంది. నువ్వు నాకు ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేశావని సుశీల ఆ గిఫ్ట్ ని బాలుకు ఇస్తుంది.. ఇది తరాలుగా మన వంశపారపర్యంగా వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. పోగొట్టుకోకూడదు.
ప్రతి ఏడాది మన కులదైవం గుడికి వచ్చి దీనికి పూజ చేయించాలి అని సుశీల అంటుంది.. ఎట్టి పరిస్థితులను పోగొట్టుకోకూడదని సుశీల పదేపదే చెప్పడంతో బాలు అలాగే బామ్మ అంటారు.. ఇక సుశీల ఇచ్చిన ఆ నగని మీనా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అయితే బాలు అప్పుడే వచ్చి నీకు బంగారం అంటే ఇష్టం లేదనుకున్నాను కానీ ఇంతగా బంగారం చూస్తే మురిసిపోతున్నావా అని అడుగుతాడు.. నేను బంగారాన్ని చూడట్లేదు తరతరాలుగా వచ్చిన ఈ వస్తువుని బామ్మ మనకి ఇచ్చారు కదా అందుకే చూస్తున్నాను. నీకు చాలా పెద్ద చరిత్ర ఉంది అని మీనా అంటుంది..
ఇదంతా కాదు నీ బంగారాన్ని గిల్టుగా మార్చిన దొంగలు ఎవరో పట్టుకోవాలి రేపు భామ వెళ్ళిన తర్వాత వాళ్ళ అంతు చూస్తాను.. రేపు నానమ్మ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళ సంగతి చూసి అటు ఇటు తేల్చేస్తాను అని బాలు అంటాడు. మౌనిక ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతుంది. సంజయ్ మౌనిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మౌనిక ఎక్కడికి వెళ్లి వచ్చావు నువ్వు ఎంతసేపు గుడిలోనే ఉన్నావా లేదా ఎక్కడికైనా వెళ్ళావా అని అడుగుతాడు.. అమ్మ నాకు అంత చెప్పేసింది. నువ్వు ఎక్కడికి వెళ్లావు నిజం చెప్పు అనేసి సంజు అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సువర్ణ నేనేం చెప్పలేదు నువ్వు అనవసరంగా దొరికిపోవద్దు అని అంటుంది.
పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య ఇంటికి రమ్మని నన్ను అడిగింది. నేను పూజ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేలోగా ఈ టైం అయింది అని మౌనిక అంటుంది. మీకు ఇంకా అనుమానం తీరలేదా అని మౌనిక అడుగుతుంది. అటు సువర్ణ కూడా నీకు ఇంకా అనుమానం తీరలేదా అని అంటే నిన్ను ప్రతిసారి దేవుడు కాపాడుతున్నాడు. ఏదో ఒక రోజు నాకు నిజం తెలిసిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేవు అని సంజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. సుశీలను బాలు దగ్గరుండి బస్ స్టాప్ కి తీసుకుని వెళ్తాడు. మీరిద్దరేమైనా గొడవపడ్డారా ఎందుకు నువ్వు అలా ఉన్నావు అంటే ఏమీ లేదు మా ఇద్దరి మధ్య గొడవలు ఏమీ లేవు అని సుశీలను బస్సు ఎక్కించి ఇంటికి వస్తాడు బాలు.
ఇంటికి వచ్చాక గేటుకి తాళం వేసేస్తాడు. మనోజ్ రోహిణి బయటకు వెళ్తుంటే ఆపుతాడు.. లక్షలు మింగినట్టు బంగారం మింగావేమో నువ్వు ఒక దొంగది అని మనోజ్ ని ఆపుతాడు. నేను దొంగతనం చేయడమేంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా అని మనోజ్ అంటాడు. ఇంట్లోనే వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. సత్యం ఏమైందిరా ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు.. ఆగు నాన్న నీకు చెప్తా ఆ రాజమాత ఎక్కడ అని ప్రభావతిని పిలుస్తాడు..
వచ్చింది గ్యాంగ్ లీడర్ అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది.. నేను ఈ భయంకరమైన నిజాన్ని రెండు రోజుల నుంచి నా మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నాను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నానని బాలు అంటాడు. ఏమైందిరా అని సత్యము అడుగుతాడు. ఆగు నాన్న కాసేపు నీకే తెలిసిపోతుంది అని అంటాడు. మీనా వెళ్లి నగలను తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. చిన్నప్పుడు బంగారు నగలుగా ఉన్నవి ఇప్పుడు గిల్టు నగలుగా మారిపోయాయి. కచ్చితంగా వీళ్ళిద్దరే దొంగతనం చేశారు అని బాలు అడుగుతాడు. ఆ మాట వినగానే మనోజ్ ప్రభావతి చెంత చేరుతాడు..
ఏంట్రా లక్షలు మింగినోడా దొంగగా మారి పెళ్ళాం పక్కన నుంచి తల్లి పక్కకు చేరావా అని అంటాడు బాలు. గిల్టు నగల గురించి నాకు ఈ మొన్నే తెలిసింది నాన్న కానీ నేను నా మనసులోని దాచుకున్నాను అని బాలు అంటాడు.. నేనే వద్దన్నాను మామయ్య అమ్మమ్మగారి పుట్టినరోజుని బాగా చేయాలని అనుకున్నాము. ఇప్పుడు అలాంటివి ఎందుకు మాట్లాడడమని వద్దని చెప్పాను అని నేను అంటుంది.. మేము అమ్మమ్మకి చైన్ కొందామని షాప్ కి వెళ్తే అక్కడ వాళ్ళు మమ్మల్ని దొంగలు అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడారు.. మా ఇద్దరికీ తల తీసేసినంత పని అయింది.. వచ్చినప్పుడు బంగారంగా ఉన్నవి ఇప్పుడు ఎలా గిల్టువయ్యాయి అని బాలు అడుగుతాడు.
Also Read :సినిమాకు మించిన ట్విస్ట్.. హీరోతో గొడవ..హీరోయిన్ పరిస్థితి దారుణం..
ప్రభావతి ప్లేటు ఫిరాయిస్తుంది.. నువ్వు గిల్టు నగలు కాబట్టే మాకు అంత ఈజీగా ఒలిచి ఇచ్చావు అనుకుంటా ఆడవాళ్ళకి బంగారు మీద మోజు ఉండకుండా ఉండదు అని రివర్స్ అవుతుంది.. ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా మాట్లాడండి మా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని మీనా అంటుంది. నువ్వే కావాలని ఆ నగలని మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు గిల్టు నగలు ఇక్కడ పెట్టావేమో నాకేం తెలుసు అని ప్రభావతి అంటుంది. మీనా ఎంత చెప్పినా ప్రభావతి వినదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో బాలు రవి కలిసి అసలు దొంగని పట్టుకోబోతారు.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…