E-Paper
Advertisement

OTT Movie : కలల దేవుడికి కబురు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కోసం అక్కాతమ్ముళ్ల అడ్వెంచర్… కొత్త యానిమేషన్ ఫాంటసీ మూవీ

OTT Movie : కలల దేవుడికి కబురు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కోసం అక్కాతమ్ముళ్ల అడ్వెంచర్… కొత్త యానిమేషన్ ఫాంటసీ మూవీ
Advertisement

OTT Movie : యానిమేషన్ పేరు వింటేనే చిన్న పిల్లలకి చెక్కెర పోసినట్లు ఉంటుంది. ఇక వీటిని చూస్తూ కడకుండానే కూర్చుంటారు. పిల్లల కోసం ఎన్నో యానిమేషన్ సినిమాలు వస్తున్నాయి. వీటిని ఫ్యామిలీలతో ఎంచక్కా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పిల్లలు వీటిని చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక యానిమేషన్ సినిమా ఆసక్తికరమైన కథనంతో వచ్చింది. తల్లి దండ్రులు విడిపోకూడదని, ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని, కలలో ఒక మ్యాజిక్ పర్సన్ ని కలవడానికి పిల్లలు ఒక అడ్వెంచర్ ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణం చాలా ఆసక్తిగా ఉంటుంది. పిల్లలతో పాటు, పెద్దలు కూడా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమీటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఎలా ఉంటుంది ?అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు

‘ఇన్ యువర్ డ్రీమ్స్’ (In your dreams) 2025లో విడుదలైన అమెరికన్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ సినిమా. ఇది ఆలెక్స్ వూ డైరెక్ట్ చేసిన సినిమా. నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్ ప్రొడక్షన్, సోనీ పిక్చర్స్ ఇమేజ్‌వర్క్స్ యానిమేషన్ దీనిని నిర్మించాయి. ఈ సినిమా 2025 నవంబర్ 7న థియేటర్స్‌లో, 2025 నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 1 గంట 35 నిమిషాల రన్‌టైమ్ తో ఐయండిబిలో 6.5/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్టీవీ అనే 10 ఏళ్ల అమ్మాయి తన తమ్ముడు ఎలియట్‌తో కలిసి సంతోషంగా ఉంటుంది. వాళ్ల పేరెంట్స్ ఇద్దరూ మ్యూజిక్ ఆర్టిస్టులు. కానీ ఇటీవల వాళ్ల మధ్య గొడవలు ఎక్కువైపోయాయి. తల్లి కొత్త జాబ్ కోసం ఒక చిన్న టౌన్‌కి మొత్తం ఫ్యామిలీని తరలించాలని నిర్ణయించుకుంటుంది. నాన్న మాత్రం వద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. వీళ్ళ గొడవ ఇలా పీక్స్ కి వెళ్తుంటే. స్టీవీకి ఇది భరించలేక పోతుంది. ఫ్యామిలీ విడిపోతుందని భయపడి రాత్రిళ్లు నిద్రపోతూ కలల్లోనే పాత సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తుకి తెచ్చుకుని ఏడుస్తుంది. ఒక రోజు ఆమెకి పాత పుస్తకం దొరుకుతుంది. అందులో “సాండ్‌మ్యాన్” అనే మ్యాజికల్ పర్సన్ గురించి ఉంటుంది. ఎవరైనా కలల్లో అతన్ని కలిస్తే ఏ కోరికైనా నెరవేరుస్తాడట. స్టీవీ, ఎలియట్ ఇద్దరూ రాత్రి కలల్లోకి దూకేస్తారు. అక్కడి నుంచి వాళ్ల అద్భుతమైన డ్రీమ్ అడ్వెంచర్ మొదలవుతుంది.

Read Also : పెళ్ళాం మిస్సింగ్… పక్కింటోడిపై కన్ను… ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులోనే

కలల ప్రపంచం రంగురంగుల, పిచ్చి పిచ్చి జీవులతో నిండి ఉంటుంది అక్కడ స్టీవీ, ఎలియట్ ఒకరికొకరు ఎప్పుడూ గొడవ పడుతూ, ఒకరినొకరు రక్షించుకుంటూ సాండ్‌మ్యాన్‌ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తారు. చివరికి మేఘాల మీద సాండ్‌మ్యాన్‌ని కలుస్తారు. అతను “మీ తల్లిదండ్రుల మధ్య ప్రేమ తిరిగి వచ్చేలా చేస్తాను” అని కోరిక నెరవేరుస్తానని చెబుతాడు. అయితే ముందు కొన్ని టెస్ట్స్ పాస్ కావాలని చెప్తాడు. చివరికి వీళ్ళు ఆ పరీక్షల్లో పాసావుతారా ? ఫ్యామిలీ కలసి ఉంటుందా ? ఆ చిన్నారులు ఆనందంగా జీవిస్తారా ? అనే విషయాలను, ఈ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×