Gundeninda GudiGantalu Today episode November 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేష్, బాలు బీరువా కొనడానికి వెళ్తారు. అక్కడ దొంగ సామాన్లు అని పోలీసులు ఎంట్రీ ఇస్తారు.. బాలు రాజేష్ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకుండా వీళ్ళను కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. విచారణలో తేలుతాయి కానీ మీరు రండి అని వాళ్ళని తీసుకొని వస్తారు అక్కడికి ఫర్నిచర్స్ పోగొట్టుకున్న షాప్ ఓనర్లు అందరూ అక్కడికి రావడంతో ఇదంతా మోసమా అని బాలు అనుకుంటాడు. అప్పుడే మనోజ్ రావడం చూసి బాలు షాక్ అవుతాడు అంటే వీడు నగలు అమ్మేసి ఆ ఫర్నిచర్ల డబ్బులను రీప్లేస్ చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అని వీడియో తీస్తాడు. ఇక బాలుని రిలీజ్ చేసిన పోలీసులు అతన్ని ఇంకొకసారి విచారణకు రమ్మంటే రావాలని చెప్తారు. బాలు మనోజ్ పోలీస్ స్టేషన్ సీన్ ని అందరికీ చూపిస్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వీడు నాలుగు లక్షలు ఫర్నిచర్ అమ్మేసి లాభం తెచ్చాను అని సంకలు గుద్దుకుంటున్నాడు. అందులో నిజం లేదు. వీడేంటో మీ అందరికీ తెలియాలి ఈ వీడియో చూడండి అని పోలీస్ ఎస్ఐ తో మనోజ్ మాట్లాడుతున్న వీడియోని బాలు అందరికీ చూపిస్తాడు. ప్రభావతి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. . రోహిణి బాలు మాట విని షాక్ అవుతుంది. వీడి లాంటి చేతకాని వాడే కాబట్టి మోసపోయాడు అని బాలు అంటాడు. ఆ బాలు గాడు మనల్ని ఎక్కడ చంపేస్తాడు అని చాలా కంగారుపడ్డాను. కానీ ఏదో ఒకటి చేసి తప్పించుకున్నామని ప్రభావతి అంటుంది.. నీకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నువ్వు వెళ్లి ఆ నగల ప్లేస్ లో కొత్త నగలను తీసుకొచ్చి పెట్టాలి లేదంటే మాత్రం కచ్చితంగా మీతో పాటు నన్ను కూడా ఇంట్లోంచి బయట గెంటేస్తారు అని ప్రభావతి మనోజ్ కి వార్నింగ్ ఇస్తుంది.
రోహిణి మనోజ్ ని రూమ్ లోకి తీసుకెళ్లి కలిపేసి నిజం ఏంటో కనుక్కోవాలని అడుగుతుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని రోహిణి అడుగుతుంది. నీకు చెప్పాలి అంటే నువ్వు నన్ను చేతకాని వాడివి అని అనుకుంటావని నేను ఏం చెప్పలేకపోయాను. అందరికన్నా ఎక్కువగా నీ గురించి నాకు భయమేసింది అందుకే ఈ విషయాన్ని దాచెను అని అంటాడు. ఎప్పుడూ నీకు సపోర్టుగా ఉన్న మీ అమ్మ కూడా ఇవాళ నేను కొట్టింది అంటే నువ్వు ఆవిడని కూడా మోసం చేస్తావనే కదా అని రోహిణి అంటుంది. ఈ విషయం అమ్మకి ముందే తెలుసు. నేను ఈ విషయాన్ని చెప్పాను అని అంటాడు.
ఇక నీకు ఇంకొక విషయం చెప్పాలి రోహిణి అని మనోజ్ అంటాడు. ఇంకొక షాక్ కూడా ఇస్తావా ఏంటి అని రోహిణి అంటుంది. అలాంటిదే అని మనోజ్ అంటాడు. ఏంటి అని అడిగితే నేను మణికంఠ దగ్గర అప్పు చేయలేదు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని రోహిణి అడుగుతుంది. అమ్మ దగ్గర మీనా నగలు పెట్టింది కదా ఆ నగలని నేను అమ్మేశాను అని అనగానే రోహిణి షాక్ అవుతుంది. ఏంటి ఆ నగలు అమ్మేశావా ఇంత పని చేస్తావని అస్సలు ఊహించలేదు అని మనోజ్ ని కొడుతుంది రోహిణి.. సరేగాని నాకు చెప్పిన విషయాన్ని నువ్వు మీ అమ్మకు చెప్పకుండా ఉండు అనేసి రోహిణి అంటుంది.
ఇక శృతి రవికి నేను మన ఇంటి కథని సీరియల్ తీయాలని అనుకుంటున్నాను అందుకే స్టోరీ రాస్తున్నాను అని అంటుంది. నువ్వు డబ్బింగ్ కదా చెప్పేది మరి ఇప్పుడేంటి ఇలా సీరియల్ రాస్తానంటున్నావు అని అంటాడు. డబ్బింగ్ చెప్తాను అలాగే సీరియల్స్ రాస్తాను ఇప్పుడు ఏమైంది అందులో అనేసి శృతి అంటుంది. అయితే గాని నువ్వు ఈ సీరియల్ కి ఏమైనా టైటిల్ పెట్టావు అని రవి అడుగుతాడు. గయ్యాళి గంగావతి అని పెట్టాను.. ఇది గనక మా అమ్మ వింటే ఈ ఇంట్లో మనిద్దరమే కాస్త పద్ధతిగా ఉన్నాం. ఇప్పుడు ఈ సీరియల్ కనుక రాస్తున్నావని చెప్తే ఇక అంతే మన పని అని రవి భయపడుతూ ఉంటాడు.
తర్వాత రోజు ఉదయం ప్రభావతి పాటలు పాడుకుంటూ కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు పెట్టేందుకు ఒత్తులను తయారు చేస్తుంది.. పాట చాలా బాగా పాడుతున్నారు. సరేగాని ఇవెందుకు అత్తయ్య గారు అని రోహిణి అడుగుతుంది. కార్తీక పౌర్ణమి కదమ్మా మనం ఈ వత్తులను గుడిలో వెలిగించాలి అని అంటుంది. ఈ కార్తీక పౌర్ణమి ఎందుకు చేస్తారు అని శ్రుతి అడుగుతుంది.. ప్రభావతి మాత్రం ఏం చెప్పాలో తెలియక నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మీనా నేను చెప్తాను అని అంటుంది..
కార్తీక పౌర్ణమి గురించి చాలా గొప్పగా చెప్తుంది.. అది విన్న శృతి చాలా సంతోషంగా ఉంటుంది. సాయంత్రం మనందరం గుడికి వెళ్ళాలి రెడీ అవ్వండి అని ప్రభావతి అంటుంది. మౌనిక పట్టుచీర కట్టుకొని చాలా సంతోషంగా బయటికి వస్తుంది. కానీ సంజయ్ మాత్రం ఎక్కడికి పట్టుచీర మల్లెపూలు పెట్టుకొని వెళ్తున్నావు అని అడుగుతాడు. గుడి కండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు రండి వెళ్దామని మౌనిక అంటుంది. నిజంగానే గుడికి వెళ్తున్నావా లేదా మీ పుట్టింటి వాళ్ళని కలుసుకోవడానికి వెళ్తున్నావా అని అంటాడు. అంటే నచ్చదు కదరా అందుకే వెళ్ళదులే అనేసి వాళ్ళ అమ్మ చెబుతున్న సరే సంజయ్ మాత్రం నమ్మడు.. ఇంట్లోనే పూజ చేసుకోనేసి అంటాడు..
Also Read :ఇంటింటి రామాయణం పరిస్థితి దారుణం..కార్తీక దీపం రేటింగ్ ఊహించలేదు..
ఇక పూజల కోసం అందరూ గుడికి వెళ్లాలని రెడీ అవుతుంటారు… ప్రభావతిని చూసి సత్యం మురిసిపోతూ ఉంటాడు. సత్యం చాలా అందంగా రెడీ అయ్యాడు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోడల్ని చూసి సత్యం ప్రశంసలు కురిపిస్తాడు. ఇక అందరూ రాగానే తమ భర్తలు చాలా అందంగా ఉన్నారంటూ ముగ్గురు కోడలు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..