E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనవ్యవహారాలు కలసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం

వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం

దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు.

కర్కాటకం

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

సింహం

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో మందకోడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

కన్య

విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

 దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

వృశ్చికం

నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూవివాదాలు తీర ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

ధనుస్సు

ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహరాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకరం

నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి.

కుంభం

వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు.

మీనం

కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంభందించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×