E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Today Episode : మనోజ్ కోసం బిల్డప్ ఇచ్చిన ప్రభావతి.. రోహిణికి మొదలైన అనుమానం..

Gundeninda Gudigantalu Today Episode : మనోజ్ కోసం బిల్డప్ ఇచ్చిన ప్రభావతి.. రోహిణికి మొదలైన అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలును స్నానం చేసి వస్తాడు. మీనా ఊహల్లో ఎంజాయ్ చేస్తుంది. బాలు వచ్చి ఏంటి ఊహల్లో తేలుతున్నావు అని అడిగితే ఏమి లేదు అంటుంది. ఇక బాలుకి ఒక షర్ట్ తీసుకొచ్చి ఇస్తుంది. చేసేటప్పుడు షర్టు మీద మరకలు పడతాయి ఇంత కొత్తదేం అవసరం లేదని పాత చొక్కా వేసుకొని వెళ్తాడు. పక్కింటి ఆవిడొచ్చి మీనా మీ ఆయన మా ఆయన పనిచేస్తున్న అపార్ట్మెంట్లో కార్లు క్లీన్ చేస్తున్నాడట నీకు తెలుసా అని చెప్తుంది. బాలు ఎక్కడ పని చేస్తున్నాడని వెళ్లాలనుకుంటుంది. ఇక ప్రభావతికి కామాక్షి ఫోన్ చేస్తుంది. అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. రవిని ఒప్పించి తీసుకొచ్చే పని చెయ్యాలని ప్లాన్ చేస్తారు. ఇక ప్రభావతి తోడుగా రమ్మని కామాక్షిని రిక్వెస్ట్ చేస్తుంది. బాలు క్లినర్ పనిచేస్తున్నాడా అని మీనా చూడటానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి బాలు కార్లను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఓ కారు ఓనర్ వచ్చి తన కారులో ఫోను కనిపించడం లేదని, ఫోన్ తీసావా? అంటూ బాలుని నిలదీస్తాడు. ఫోన్ గ్రౌండ్ లో మర్చిపోయారని ఓ వ్యక్తి ఫోన్ ఇవ్వగానే అందరు మౌనంగా వెళ్ళిపోతారు. మీనా బాలుకు జరిగిన అవమానం చూసి అదే తలచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి, శృతిలు తమ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే శృతికి ఫ్రెండ్ ఫోన్ చేసి హనీమూన్ కి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేం. రోజురోజుకు బరువులు, బాధ్యతలు పెరుగుతాయని సలహాయిస్తుంది. దీంతో హానీమూన్ కి వెళ్లాదనీ రవిని శృతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే మన రెండు ఫ్యామిలీలు హ్యాపీగా లేరు మనం ఎలా ఇలా అంటాడు. మనం వెళ్ళిపోయినా బాధ వారి మొహాల్లో లేదు. ఉంటే మన కోసం ఒక్కరైనా వచ్చేవారు. అప్పుడు మనం వాళ్ల కోసం ఆలోచిస్తూ అన్ని ఆశలు వదిలేసుకోవడం అవసరమా అని శృతి అంటుంది. ఇక శృతి ఫీల్ అవుతుందని రవికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకుంటాడు. దాంతో శృతి ఫుల్లుగా హ్యాపీ అవుతుంది. ఇక ఎక్కడికి వెళదామని ప్లాన్ చేస్తుంటారు.

Advertisement

బాలు నేను ఎక్కడ బాధ పడతానో అని అబద్దం చెప్పాడు. అని ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక ఇలా ఏదోకటి అని జాయిన్ అయ్యాడని అనుకుంటుంది. బాలు కష్టం తలచుకొని, తనని దొంగా అన్నారని అనుకుంటూ బాధ పడుతుంది. ఇలా అవమానాలు పడుతూ అక్కడ జాబ్ చెయ్యాల్సిన పని లేదు అని చెప్పాలని ఫిక్స్ అవుతుంది. ఇక ప్రభావతి తన ముద్దుల కొడుకు మనోజ్ కు లేని జాబ్ గురించి తెగ బిల్డప్ ఇస్తుంది ప్రభావతి. జాబుకు వెళ్లడం కోసం కంపెనీలో చెప్పి కారు తీసుకోమని తండ్రి సత్యం చెప్పడంతో .. ప్రభావతి కూడా మనోజ్ కు సపోర్టుగా మాట్లాడుతుంది. మామయ్య కారు కొనుకొమంటున్నాడని, దానికి వాడు మొహమాటపడుతున్నాడని రోహిణికి చెబుతుంది ప్రభావతి.. ఇక అంతేకాదు మనోజ్ తో కలిసి నువ్వే వాడి వెంట వెళ్లి కారు తీసుకుని రండి అని ప్రభావతి చెబుతుంది. ఆ మాట విన్న మనోజ్ మోహంలో టెన్షన్ మొదలవుతుంది.

ఇక రోహిణి కూడా మనోజ్ గొప్పలు చెప్పడంలో రెచ్చిపోతుంది. మనోజ్ ను కారు తీసుకోమని బలవంతపు పెడుతుంది. ఈనెల మనోజ్ 15 కార్లు అమ్మాడంటూ ప్రభావతికి రోహిణి చెబుతోంది. మనోజ్ కు పడుకోవడానికి ఏసీ క్యాబిన్ కూడా ఇచ్చారంటూ ప్రభావతి చెబుతోంది. దీంతో మీకు ఎలా తెలుసు అత్తమ్మ అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోజ్ కంగారు పడతాడు.. అమ్మ ఎందుకు నన్ను అడ్డంగా ఇరికించేసింది అని ఆలోచిస్తాడు. అమ్మ ఎందుకు నన్ను అడ్డంగా ఇరికించేసింది అని ఆలోచిస్తాడు. ఏమి చెప్పలేక మౌనంగా ఉంటాడు. రోహిణి కారును ఎప్పుడు కొందామని అడుగుతుంది. వీళ్ళను చూస్తూ సత్యం ఉంటాడు. అప్పుడే మీనా ఇంట్లోకి వస్తుంది. మీనా ఎక్కడకు వెళ్ళావు అనగానే ప్రభావతి ఎవరి కొంపలు కూల్చి కొంప మీదకు తీసుకొని వస్తున్నావు అంటుంది. దానికి సత్యం ఎప్పుడు మీనాను అనడమే పనిగా పెట్టుకున్నావా అని అంటాడు. మీనా మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది అంటూ బాధ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలును జాబ్ మానెయ్యమని మీనా చెబుతుంది. కానీ బాలు నాకేం కాలేదు అని అంటాడు. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×