Rythu Panduga Sabha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఈసారి నాలుగో విడతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మూడు లక్షల మందికి రుణమాఫీ చేయనుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన శనివారం కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
రైతు భరోసా సభ లైవ్‌ను ఇక్కడ చూడండి
ఈ ఏడాది తెలంగాణ రైతులకు స్వర్ణయుగమనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత సొంతం చేసుకుంది. ఇందిరమ్మ రాజ్యమంటే మాటలు కాదు చేతులతో చేసి నిరూపించింది.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసింది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది.
శనివారం నాలుగో విడతగా మూడు లక్షల మంది రైతులకు 3 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది ప్రభుత్వం. వీరిలో చాలామందికి రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాతాల సమస్య, ఆధార్ కార్డుల్లో సమస్యలు, ఇతర సాంకేతిక సమస్యలతో మరో మూడు లక్షల మందికి రుణమాఫీ జరగలేదని గుర్తించారు అధికారులు.
ALSO READ: చివరి అంకానికి సమగ్ర కుటుంబ సర్వే.. జీహెచ్ఎంసీ మినహా 99 శాతం కులగణన పూర్తి
ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ రైతు పండగ సభ ముగింపు సందర్భంగా ఆయా రుణాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రైతులందరికీ రుణమాఫీ చేయడం ఇదో రికార్డుగా చెబుతున్నారు అధికారులు.
ఒక్క ఏడాదిలో రైతులకు దాదాపు 54 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రేవంత్ సర్కార్. అందులో రైతు పెట్టుబడి సహాయం కింద 7,625 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 10,444 కోట్లు ఉన్నాయి.
ఇక ధాన్యం కొనుగోలు కోసం 10, 547 కోట్ల రూపాయలు, వరదల వల్ల పంట నష్టం కింద ఎకరాకి 10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసింది. తెలంగాణలో 42 లక్షల మంది రైతులకు భీమా కవరేజ్ నిమిత్తం 1433 కోట్ల రూపాయలను ప్రీమియం కింద చెల్లింపు చేసింది.
ఇవికాకుండా పచ్చి రొట్టె ఎరువు తయారీ, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు చెల్లింపులు, మార్క్ ఫెడ్ ద్వారా ధాన్యం సేకరణ, వ్యవసాయ సంబంధిత నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, హార్టికల్చర్, ఆయిల్ పామ్ సాగు సబ్సిడీ, వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రజా ప్రభుత్వం.