Judge Bribe | కోర్టులో అందరూ చూస్తుండగా ఒక వ్యక్తి నేరుగా నడుచుకుంటూ వచ్చి జడ్జి గారికి ఒక కవర్ డబ్బులు పెట్టి లంచంగా ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జరీచేశారు. కానీ నిందితుడు తనకేమీ తెలియదని అంతా ఒకరు చెబితే తాను అలా చేశానని చెప్పాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని పంచ్ మహల్ జిల్లా గోద్రా నగర సివిల్ కోర్టులో శుక్రవారం నవంబర్ 29, 2024న న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎ మాకా ఒక కేసు విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో మహిసాగర్ జిల్లాకు చెందిన బాపు సొలంకి అనే వ్యక్తి కోర్టు రూమ్ లో నేరుగా వచ్చి న్యాయమూర్తి టేబుల్ పై ఒక సీల్డ్ కవర్ పెట్టాడు.
అది చూసిన జస్టిస్ హెఎ మాకా కోర్టు సిబ్బందిని ఆ కవర్ లో ఏముందో చూడమని చెప్పారు. కోర్టు సిబ్బంది కవర్ తెరిచి చూడగా.. అందులో రూ.35,000 నగదు ఉంది. ఇదేంటని అడిగితే.. సొలంకి సమాధానమిస్తూ.. “జడ్జిగారు అడిగారని ఒక వ్యక్తి తనకు ఇచ్చాడు. అందుకే తీసుకొని వచ్చాను” అని చెప్పాడు. ఇదంతా విని ఆగ్రహం చెందిన న్యాయమూర్తి వెంటనే సొలంకిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
గోద్రా డివిజన్ ఏసిబి (అవినీతి నిరోధక శాఖ) ఇన్‌పెక్టర్ ఆర్‌బి ప్రజాపతి.. న్యాయమూర్తి ఆదేశాలపై సొలంకిని అరెస్ట్ చేసి.. అవినీతి నిరోధక చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
Also Read: 69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే
సొలంకిని అరెస్ట్ చేసిన తరువాత అతడిని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి విచారణ చేసినా అతను ఏదీ స్పష్టంగా చెప్పడం లేదని ఇన్‌పెక్టర్ ఆర్‌బి ప్రజాపతి అన్నారు. “సొలంకి కి సంబంధించిన ఒక కేసు కూడా కోర్టులో విచారణ జరుగతూ ఉన్నట్లు తెలిసింది. కానీ ఈ రోజు ఆ కేసు విచారణ జరగలేదు. తనకు బయటి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ కవర్ ఇచ్చాడని సొలంకి చెబుతున్నాడు. కానీ ఆ వ్యక్తి పేరు తాను మరిచిపోయానని సొలంకి చెబుతున్నాడు. అయినా విచారణ కొనసాగిస్తున్నాం. ” అని ఇన్‌పెక్టర్ ఆర్‌బి ప్రజాపతి తెలిపారు.
ఐఫోన్ 16 ప్రో లంచంగా తీసుకున్న పోలీస్ అధికారి అరెస్ట్
ఒక పెట్రోల్ డీలర్ వద్ద నుంచి లంచంగా ఐఫోన్ 16 ప్రో లంచం తీసుకుంటుండగా.. ఒక వ్యక్తిని అరెస్టు చేశామని గుజరాత్ ఎసిబి అధికారులు తెలిపారు. ఆ ఐఫోన్ 16 ప్రో ధర రూ.1.44 లక్షలు అని వెల్లండించారు.
గుజరాత్ లోని నవసారి జిల్లా ధొలాయి సముద్ర పోర్ట్ వద్ద ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే దినేష్ కుబావత్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్.. పోర్టులో పడవలకు డీజిల్ ఆయిల్ విక్రయిస్తున్న ఒక డీలర్‌ని వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నాడు. పోర్టులో డిజిల్ విక్రయించేందుకు అతని వద్ద ఉన్న లైసెన్స్ చూపించాలని చెప్పాడు. కానీ లైసెన్స్ ఎక్స్‌పైర్ కావడంతో తనకు లంచం ఇవ్వాలని లేకపోతే బిజెనెస్ మూసుకోవాల్సి వస్తుందని బెదిరించాడు. దీంతో ఆ డీజిల్ వ్యాపారి ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఎసిబి అధికారులు.. పోలీస్ ఇన్‌స్పెక్టర్ దినేష్ కుబావత్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశారు. అందుకే డీజిల్ వ్యాపారి చేత ఐఫోన్ 16 లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ దినేష్ కుబావత్ ని పట్టుకున్నారు.