E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today Episode : సత్యంను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీనా మెడకు చుట్టుకున్న రవి పెళ్లి..

Gundeninda GudiGantalu Today Episode : సత్యంను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీనా మెడకు చుట్టుకున్న రవి పెళ్లి..
Advertisement

Gundeninda GudiGantalu Today Episode 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, శృతిలు పెళ్లి చేసుకోవడం పై మీనా పెద్ద గొడవ చేస్తుంది. నన్ను ఇంత మోసం చేస్తావా అని మీనా కోపంగా ఉంటుంది. రవి, శృతిలను ఆశీర్వదించకుండా కోపంగా గుడి నుంచి బయటకు వస్తుంది. అప్పుడే మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. ఏంటి పూల గంప ఫోన్ చేస్తా అని ఇప్పటివరకు చెయ్యలేదు. సరే నేను ఏదోకటి తీసుకున్న అని చెప్తాడు. అతడికి రవి పెళ్లి గురించి చెప్పబోతుంది. ఛార్జింగ్ అయిపోవడంతో బాలుతో చెప్పలేకపోయింది. ఇంటికొచ్చి పెళ్లి గురించి మీరే సమాధానం చెప్పుకోమని కోపంగా రవితో చెప్పి గుడి దగ్గర నుంచి మీనా వెళ్లిపోతుంది.. శృతి కోసం గుడికి వస్తాడు సంజు.. కానీ అక్కడ లేకపోవడంతో మళ్లీ శృతి ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నను నిలదీస్తాడు.. మనం బయపడినట్లే జరిగింది అంటూ సురేంద్ర అంటాడు. సత్యం పై పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. సురేంద్ర వాళ్ల ఇంటికి వెళ్లి వార్ణింగ్ ఇస్తాడు. పోలీసులు సత్యం ను అరెస్ట్ చేస్తారు.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి అందరిని అన్నం తినడానికి పిలుస్తుంది. అందరు కూర్చోంటారు. అప్పుడే సురేంద్ర అక్కడకు వస్తాడు. ఒరేయ్ సత్యం అని అరుస్తాడు.. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని సురేంద్రను సత్యం అడుగుతాడు. ఏంటి నీకు ఇచ్చేది బోడి మర్యాద నా కూతురు ఎక్కడ దాచావో చెప్పు అంటాడు. నీ కూతురును నేను దాచడమెంటి అంటూ నాకేం తెలుసు అంటాడు. నువ్వే దాచిపెట్టావు అంటాడు. ఇద్దరి మధ్య కాసేపు వాధన జరుగుతుంది. ఆ తర్వాత మీ రవి నే నా కూతురును కిడ్నాప్ చేశాడు. వాళ్లిద్దరూ కనిపించలేదు. నీకు ముందే చెప్పాను. నా కూతురుకు పెళ్లి అని కానీ ఇలా చేస్తావా.. ఎక్కడ దాచావు నా కూతురును అని గట్టిగా అడుగుతాడు. అంతలోకే ఇద్దరు కూడా కాలర్ పట్టుకొని గొడవకు దిగుతారు.

Advertisement

అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. సార్ ఏంటి ఇది కంప్లైంట్ ఇచ్చారుగా మేము చేసుకుంటాము అని అంటారు. ఇక పోలీసులు మీరు తప్పు చేస్తున్నారు. వీళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేశారని మీ మీద కేసు పెట్టారు. మీరు స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అంటాడు. పోలీసుల మాటలకు సత్యం నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు అంటాడు. మీ కొడుకు ఎక్కడ అంటే రెస్టారెంట్ కు వెళ్లాడు.. వాడికి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యట్లేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది అంటారు. ఇక పోలీసులు చిన్న ఎంకి్వైరి ఉంది చిన్న స్టేట్మెంట్ ఇచ్చి మళ్లీ రావొచ్చు అంటారు. సత్యం పదండీ అంటాడు. కానీ మనోజ్ మాత్రం మేము తీసుకొని వస్తాము అంటాడు. రూల్స్ ఒప్పుకోవు అండి అని అంటాడు. ఇక మేము రావొచ్చునా అని అడుగుతాడు. ఇక అందరు ఆటోలో కూర్చొని వెళ్తారు.

మీనా పోలీసులు రావడం చూసి షాక్ అవుతుంది. అన్న ఏమైంది అని అడుగుతుంది. ఎవరినో అమ్మాయిని కిడ్నాప్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతాడు. మా మామయ్యా ఏమి చెయ్యలేదు. అని వెళ్తుంది. లోపల అప్పటికే పెద్ద సీన్ జరిగిపోతుంది. సత్యంను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మీ అబ్బాయి వచ్చిన తర్వాతనే మిమ్మల్ని విడిచి పెడతాము అని అంటారు. ఇక ప్రభావతి మనోజ్ తో గొడవ పడుతుంది. ముగ్గురు కొడుకులు ఉన్నా ఆయన కోసం ఒక్కరు విడిపించే ప్రయత్నాలు చెయ్యలేదు అని ఏడుస్తుంది. ఇక మీనా మామయ్యను అరెస్ట్ చేశాడు అని చెబుతుంది. నేను వస్తున్నా అని పెట్టేస్తాడు. మీనా సత్యం దగ్గరకు వెళ్తుంది. మీరు తప్పు చేశారని అంటే నేను నమ్మను అంటుంది. ఎస్ఐ వచ్చి ఎవరని అడుగుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో గుడిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిపోయినట్లు బాలుకు తెలిసిపోతుంది. మీనా సాక్షి సంతకం పెట్టిన విషయం తెలిసిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×