E-Paper
Advertisement

Bigg Boss: దొంగగా మారిన స్ట్రాంగ్ కంటెస్టెంట్.. కంటెస్టెంట్స్ మదిలో గుబులు..!

Bigg Boss: దొంగగా మారిన స్ట్రాంగ్ కంటెస్టెంట్.. కంటెస్టెంట్స్ మదిలో గుబులు..!
Advertisement

Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 8వ సీజన్ 6 వారం చివరి దశకు చేరుకుంది. రేపు, ఎల్లుండి జరగబోయే ఎపిసోడ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ అటు కంటెస్టెంట్స్ లో ఇటు ఆడియన్స్ లో కూడా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. ఇకపోతే 14 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో 6 మంది ఎలిమినేట్ అయ్యారు. మరో 8 మందిని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ క్లాన్ గా విభజించగా, వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన మరో ఎనిమిది మందిని రాయల్ క్లాన్ గా బిగ్ బాస్ విభజించారు.

టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన మణికంఠ..

Advertisement

బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వీరితో తాజా ఎపిసోడ్ లో టాస్క్ లతో హోరెత్తించారు. అటు హోటల్ టాస్క్ లో కామెడీ పండిస్తూనే.. మధ్యలో సీరియస్ టాస్క్లతో హీట్ కూడా పెంచేశారు. మరో టాస్క్ లో మణికంఠ అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించగా.. నిఖిల్ – మణికంఠకు మధ్య పోటీ కూడా నడిచింది.. ఈ టాస్క్ లో మణికంఠ విజయం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక మణికంఠ పెట్టిన ఎఫర్ట్స్ కి అంతా కూడా ఫిదా అయిపోయారు. ఒంటి కాలు మీద నిలబడి రెండు వాటర్ గ్లాసులు.. అది కూడా గాజు గ్లాస్ లను బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. ఈ మధ్య లో మిగతా కంటెస్టెంట్స్ నుంచి కిల్లికజ్జాలు కూడా వినిపించాయి. టీంలో ప్రేరణ హోటల్ మేనేజర్ కాగా ఆమె మాట ఎవరు వినడం లేదని అసహనం వ్యక్తం చేసింది ప్రేరణ. అంతేకాదు డబ్బులు విషయంలో కూడా ఓజీ టీం లో గొడవలు వినిపించాయి. అటు ప్రేరణ , సీత మధ్య వాగ్వాదం బాగా ముదిరింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో తాజా ఎపిసోడ్ మరింత ఉత్కంఠ గా సాగిందని చెప్పవచ్చు.

గట్టి పోటీ ఇచ్చిన ఓజీ క్లాన్..

Advertisement

ఇకపోతే ఈ హోరా హోరీ పోటీలో కొన్ని గెలుపులు, ఓటములు కూడా తప్పలేదు. మరొకవైపు సేవ్ వాటర్ టాస్క్ లో ఓజీ టీమ్ గెలుపొంది, రూ .25000 బహుమతిగా గెలుపొందింది. అంతేకాదు ఈరోజు జరిగిన టాస్క్లలో కూడా యష్మీ , మణికంఠ, నబీల్ , నిఖిల్ అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించి ఓజీ టీం రాయల్ క్లాన్ నుంచి స్టార్స్ కూడా సొంతం చేసుకున్నారు.

దొంగగా మారిన సీత.. అయినా ఫలితం లేదు..

అయితే అంతకుముందు సీత బిగ్ బి హోటల్ టాస్క్ కి ముందు దొంగతనం చేయడంతో రాయల్ క్లాన్ సభ్యులకు డబ్బులు కాస్త తక్కువగా వచ్చాయి. దీంతో సీత తను చేసింది ఒప్పుకోక తప్పలేదు. చివరికి ఆ డబ్బు ఇవ్వడానికి సీత నిరాకరించింది. దీంతో కంటెస్టెంట్స్ మధ్యలో గుబులు మొదలైంది. కానీ ఓజీ క్లాన్ సభ్యులు , మెగా చీఫ్ నబీల్ కూడా ప్రెషర్ పెట్టడంతో ఆ డబ్బు ఆమె తిరిగి ఇచ్చేసింది. దాంతో రాయల్ క్లాన్ కాస్త గెలిచింది. ఒకవేళ స్ట్రాటజీ ప్రకారం సీతా గనుక డబ్బు ఇవ్వకుండా ఉండి ఉంటే కచ్చితంగా గెలిచేవారేమో మొత్తానికి అయితే టీం ను గెలిపించుకోవాలని సీతా ఆఖరికి దొంగగా మారిన చివరికి ఓడిపోక తప్పలేదు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×