E-Paper
Advertisement

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ
Advertisement

Telangana Tehsildars transfer: ఎట్టకేలకు రాష్ట్రంలో తహసీల్దార్ల ఎన్నికల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు తమ సొంత జిల్లాలకే తిరిగి వెళ్లిపోయే విధంగా అవకాశం కల్పించాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ మొదటి నుంచి చేసిన కృషికి ఫలితం దక్కింది. దీంతో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న చూపులకు తెర పడింది.

అయితే, ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ వంటి ఉన్నతాధికారులను టీజీటీఏ అధికారులు ఇప్పటికే కలిశారు. ఇందులో భాగంగానే ఎన్నికల బదిలీలపై వినతిపత్రాలను సైతం అందజేశారు. అలాగే ఇదే విషయంపై ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖి సమావేశంలో చర్చించారు. దీంతో ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. అనంతరం బదిలీలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీజీటీఏ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మహిళా అధ్యక్షురాలు రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్,సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్ లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హత, అవకాశం, ఆసక్తి ఉన్న ప్రతి తహసీల్దార్ కు ట్రాన్స్ ఫర్ అవకాశం కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు.

Also Read:  ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

Advertisement

అయితే, ఎన్నికల బదిలీల విషయంలో చాలా ఆలస్యం జరిగిందని, బదిలీ అయిన ప్రతీ తహసీల్దార్ కు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. అదే విధంగా ప్రతీ తహసీల్దార్ కు బదిలీ అవకాశం కల్పించేందుకు టీజీటీఏ కృషి చేస్తుందని వెల్లడించారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×