Podarillu Today Episode October 18th : నారాయణ మహాలక్ష్మికి నిజం చెప్పమని ఎంతగా అడిగినా కూడా పాము తెచ్చి ఇంట్లో పెట్టావు ఏదో ఒక రోజు కాటేయకుండా ఉంటుందా..? అయితే నేను తప్పు చేశాను అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని మహాలక్ష్మి ఎంత అడిగినా కూడా నారాయణ మాత్రం సమాధానం చెప్పడు. చెప్పడం ఎందుకు మీరే తెలుసుకుంటారు కదా అనేసి అంటుంది. ఏదో దాస్తున్నాడని నాకు అర్థం అయిపోయింది అదేంటో నాకు అర్థం కావడం లేదు నారాయణ నిజం చెప్తే బాగుంటుంది అని మహాలక్ష్మి అనుకుంటుంది. మహాలక్ష్మికి కూడా నారాయణ నిజం చెప్పకపోవడంతో ఏదో ఉంది అని అనుమానం అయితే ఉంటుంది.
కేశవ కి షాపు వచ్చేసిందని ఆనందం తట్టుకోలేక తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. అయితే అక్కడికి రాగానే ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు ఏం జరిగింది అని శైలు అడుగుతుంది నేను ఈ షాప్ కి ఓనర్ అయ్యాను అని చెప్పగానే అంతేనా దానికోసం ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలిచావా ఇదేదో పెద్ద విశేషం లాగా చెప్పుకుంటున్నావే అని శైలు అనగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే నేను మెకానిక్ గా పని చేయడం దీనికి ఇష్టం లేదు అందుకే ఇలా మాట్లాడుతుంది అని కేశవ చాలా బాధపడిపోతాడు. కానీ శైలు ఎంత చెప్పిన కూడా కూడా వినకుండా కేశవ చాలా ఫీల్ అయిపోతాడు.. తనకు షాప్ వచ్చిందని సంతోషం కన్నా బాధ ఎక్కువగా ఉందని కేశవ ఫీల్ అవుతాడు.
జమున ఇంటికి తన భర్త రావడంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు తాగుబోతు చచ్చినట్టు చూస్తే నిన్ను చంపేస్తాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే వాడు నిన్ను నన్ను ఇబ్బంది చంపేస్తాడు. వెళ్ళిపోదాం పద అని జమున భయపడుతూ తన భర్తకి చెప్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చిందానికి ఏమైనా గిట్టుబాటు జరిగిందా ? మనం అప్పులు తీరే పని ఏమైనా చేశారా.. నేను ఇంటికి వచ్చినందుకు చాలా డబ్బులు దొరికాయి అయితే వెళ్ళు అవి ఎక్కడున్నాయి తీసుకురా వెళ్ళిపోదామని అతను అనగానే జమున అలానే అని అంటుంది అప్పుడే ఇంటికి వచ్చిన నారాయణ జమున తో మాట్లాడుతున్న తన భర్తను చూసి కోపంతో రగిలిపోతాడు. రేయ్ నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావురా నా ఇంటిని అంటూ ఆవేశంతో ఊగిపోతాడు అంతేకాదు ఇవాళ నేను చంపేస్తాను రా అని అతని తరుముకుంటూ వెళ్తాడు నారాయణ.. కానీ అతను తప్పించుకొని పారిపోతాడు.
అయితే అతను తప్పించుకొని పారిపోవడంతో జమునని పిలుస్తాడు రావే బయటికి నా ఇంటికి ఏం చేయడానికి వచ్చావు.. ఎందుకు మళ్ళీ వాడితో కలిసి నా ఇంట్లో కాలు పెట్టావు అని అడుగుతూ ఉండదా.. జమున ఏం సమాధానం చెప్పకపోవడంతో నారాయణ కర్ర తీసుకొని తన వెంట పడతాడు. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన కన్నా అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మా అమ్మ నదులు మమ్మల్ని ఎందుకు కొట్టాలి అనుకుంటున్నావు చంపేస్తావా ఏంటి అని సీరియస్ అవుతాడు. కానీ నారాయణ మాత్రం అసలు వినకుండా ఉంటాడు కన్నా అడ్డుపడడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
జమున అసలు ఏమైందో చెప్పకుండానే నారాయణ నన్ను చంపేస్తాడు నేను వెళ్ళిపోతాను అందుకే నేను ఇక్కడికి రానున్నాను అని నాటకం మొదలు పెడుతుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆమె చెప్పింది నిజం అని నమ్ముతారు. అయితే అప్పుడు ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది ఆ మాట వినగానే మా అమ్మ నీ నారాయణ కొట్టబోయాడు అని కన్నా నిజం చెప్తాడు. ఆయన ఎప్పుడూ ఆలోచించే మనిషి అలాంటి మనిషి తన భార్యని ఎలా చంపాడు అని నాకు ఇప్పటికీ అనుమానం ఉంది ఇప్పుడు మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది మహాలక్ష్మి కానీ జమున మాత్రం పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో తనపై అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆ సస్పెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది సోమవారం ఎపిసోడ్లో మాత్రం నారాయణ నిజం చెప్తాడు ఏమో చూడాలి..