Gundeninda GudiGantalu Today episode October 20th : బాలు మీనా ఇద్దరు బయటికి వెళ్లాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా సరే శృతి వచ్చి తను చేసే వంటకి ఏదో ఒకటి కావాలని అడ్డుపడుతూనే ఉంటుంది. అసలు శృతి ఏం చేస్తుంది అని ప్రభావతితోపాటు ఇంట్లోని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అసలు ఏం జరుగుతుందో తెలియక మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కానీ బాలు మీనా మాత్రం మనం ఎల్లం పదా ఇక్కడ ఉంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు అని అనుకుంటుంది. అయితే అప్పుడే గుణ తన మనుషులకి ఫోన్ చేసి ఏంట్రా ఆ బాలు గాడు వచ్చేసాడా కార్ ఎక్కడ ఈరోజుతో బాలు గాడి పని పోవాలి అని అంటారు. బ్రేక్ ఫెయిల్ అయ్యి వాడికి వాడే చచ్చిపోతాడు లేదంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి పెద్ద గొడవ జరుగుతుంది మీరు వాడి వెనకాల ఫాలో అవ్వండి అని గుణ తన ప్లాన్ గురించి చెప్తాడు. రోహిణి మాత్రం ఈ గుణ ఏం చేస్తున్నాడు. అయితే బాలు వచ్చి అంత చెక్ చేస్తూ ఉంటాడు.
ఇక మీనా పువ్వులు ఇచ్చేసాం కదా వెళ్లి టిఫిన్ చేసి వెళ్దాం పదండి అని బాలుని లోపలికి పెట్టుకొని వెళ్తుంది.. లోపలికి వెళ్ళగానే మీనా టిఫిన్ చేసుకొని వస్తాను అని చెప్పగానే వంటగదిలో స్తుతి చేస్తున్న వంటకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఉప్మా చేశాను అని చెప్పగానే మీనా కూడా షాక్ అవుతుంది. అయితే శృతి ఉప్మా చేస్తుంది అని అనగానే బాలుతో పాటు రవి కూడా ఒకసారి షాక్ అవుతాడు. రవి వెంటనే మంట గదిలోకి వెళ్లి నువ్వు ఎందుకు శృతి అంటే ప్రయోగాలు చేస్తున్నావ్ మా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ నువ్వు ఇలా చేస్తే మా ఇంట్లో వద్దు బాధపడిపోతూ ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు బాగుండాలని నేను ఎప్పటికీ కోరుకుంటూ ఉంటాను కానీ నువ్వు చేస్తే నా పనికి మా ఇంట్లో వాళ్ళ వల్ల ఏమన్నా అవుతుందేమో అని భయపడుతున్నాను అని రవి అంటాడు.
అందరిని పిలుచుకురమని రవితో చెప్తుంది అయితే అందరూ తిన్న తర్వాత నేను తింటాను అని బాలు అనడంతో అంతే కదా అందరికీ పెట్టిన తర్వాతే నీకు పెడతాను అని శృతి అంటుంది. అందరూ రాదని ఏంటిది అంటే శృతి ఈ రోజు మీకోసం టిఫిన్ చేసింది అని మీనా అంటుంది. ఓ రెస్టారెంట్ కి వెళుతుంది కదా అక్కడ చూసి నేర్చుకున్నట్లు ఉంది బాగానే చేసి ఉంటుంది అని ప్రభావతి అంటుంది. అయితే శృతి తీసుకొచ్చిన టిఫిన్ నుంచి గరిటను తీయడానికే చాలా కష్టపడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ ఆ ఉప్మాని ఉప్పు ఎక్కువగా ఉన్నా కూడా అందరూ శృతి మొదటిసారి వంట చేసిందని తింటారు. శృతి ఇకమీదట ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని ప్రభావతి చెప్తున్న సరె, శృతి చేస్తాను అనడంతో ఆ మాటకు ప్రభావతి షాక్ అవుతుంది. ఏది ఏమైనా కూడా శృతి బాధపడిపోతుంది అని అందరూ ఆ ఉప్మాని చాలా జాగ్రత్తగా తింటారు.
బాలు మీనా ఇద్దరు బయలుదేరుతుండగా మే నాకు ఫోన్ రావడంతో బాలు నేను అటు వెళ్తాను నువ్వు ఇటు వెళ్ళు అని వెళ్ళిపోతారు. అయితే గుణ పంపించిన రౌడీలు బాలుని రెచ్చగొట్టి ఇంకాస్త స్పీడ్ గా కారుని తీసుకెళ్లి ఎలా చేస్తారు. అయితే వాళ్ల వల్ల బాలు ఇంకాస్త స్పీడ్ పెంచి ఒక తల్లి బిడ్డను తప్పించబోయి అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ బైక్ ని గుద్దేసి ఆగిపోతాడు. అది చూసిన అరుణ్ నువ్వు ఎందుకురా ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తూ ఉంటావు అని ఆ కారు చేసి పోలీస్ స్టేషన్ కి బాలుని తీసుకొని వెళ్తాడు. అయితే బాలు మాత్రం ఆ కారుకి బ్రేకులు లేవని ఎంత చెప్తున్నా సరే అరుణ్ మాత్రం అస్సలు వినకుండా బాలుని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళిపోతారు.
ఈయన చింటూ నీ కలిసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతానని వెళ్ళాడు కదా అక్కడికి వెళ్లడో లేదో అని మీనా బాలుకు ఫోన్ చేస్తుంది. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్లో మీ ఆయన ఉన్నాడని చెప్పగానే మీనా కంగారు పడిపోతూ పోలీస్ స్టేషన్కు వస్తుంది. అయితే బాలు జరిగిన విషయం అంత చెప్పినా కూడా మీనా మాత్రం కానిస్టేబుల్ తో ఎంతగా మాట్లాడిన సరే కారుని సీజ్ చేసాం వెళ్లిపోండి అని పంపిస్తారు బాలు చాలా ఫీల్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి బాలుని అవమానించేలా మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..