E-Paper
Advertisement

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి
Advertisement

Kadapa: రాయలసీమలోని కడప జిల్లాలో ఏం జరుగుతోంది? మేయర్, మున్సిపాలిటీలకు నామినేషన్లు ముగిసినా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయా? తాజాగా మంగళవారం తెల్లవారుజామున కడప మేయర్ వైసీపీ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది?

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాయలసీమలో కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. సందట్లే సండేమియా అన్నట్లు పగలు, ప్రతీకారాలకు కొందరు పూనుకుంటున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కడప వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది. బ్లాక్ స్కార్పియోలో వచ్చిన వచ్చిన ఆరుగురు దుండగులు, బీరు సీసాలతో ఇంటిపై దాడి చేశారు.

బీర్ బాటిళ్లతో ఇంటిపై దాడి, బెదిరిపోయిన దీప్తి ఫ్యామిలీ

Advertisement

ఈ ఘటనలో ఇంటి అద్దాలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. మేయర్ అభ్యర్థిని పంచి బూతులు తిట్టినట్టు సమాచారం. నిందితులు నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చినట్టు తెలుస్తోంది. ముఖాలకు ముసుగు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బెదిరిపోయిన దీప్తి కుటుంబ సభ్యులు తమకు సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రత్యర్థుల పనేనని అంటున్నారు.

తెల్లవారుజామున పోలీసులకు దీప్తి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఘటన జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీప్తి.. నామినేషన్ పరిశీలన పూర్తయిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడడం భయభ్రాంతులకు గురి చేయడమేనని అంటున్నారు. ఈ విధంగా ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడమేనని అన్నారు.

Advertisement

ALSO READ: విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజామున నుంచే భక్తుల దర్శనం

తాము బరిలో లేకుండా చేయాలని ఉద్దేశంతో కూటమి నేతలు ఈ విధంగా చేస్తున్నారన్నది ఆమె ఆరోపణ. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు విచారణ చేపట్టారు. సిటీలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

Tags

Related News

విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజామున నుంచే భక్తుల దర్శనం

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు, విద్యార్థులు ఫుల్‌ఖుషీ

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేనలో కీలక మార్పులు, పలుచోట్ల ఇన్‌ఛార్జీల మార్పులు

నగరి మున్సిపల్ పీఠం ఏకగ్రీవం.. హైకోర్టుకు వెళ్తానన్న రోజా!

చంద్రబాబుకు గెలుపుపై నమ్మకం లేదు.. అందుకే నామినేషన్ల అడ్డుకట్ట: సజ్జల

పశ్చాత్తాపపడినా వదిలిపెట్టం.. అధికారులకు చెవిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×