E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు క్లాస్ పీకిన మీనా.. బాలు గెలిచాడు.. రోహిణి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు క్లాస్ పీకిన మీనా.. బాలు గెలిచాడు.. రోహిణి దొరుకుతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 22 nd : అరుణ్ ఆ కారుని తీసుకురమ్మని కానిస్టేబుల్ కి చెప్తాడు. అయితే ఆ కానిస్టేబుల్ కారుని తీసుకొచ్చేందుకు వెళ్తాడు. అయితే అరుణ్ ఫోన్ మాట్లాడుతూ బయటికి రావడంతో ఆ కారులో నుంచి కానిస్టేబుల్ గాయాలతో బయటకు రావడంతో అది చూసిన అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటయ్యా ఈ గాయాలంటే అని అడుగుతాడు. ఆ గాయాలు ఆ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే నాకు అయ్యాయి. సార్ అని అతను జరిగిన విషయాన్ని చెప్తాడు. అయితే ఇది బయటికి వస్తే పరువు పోతుంది అని అరుణ్ దీన్ని బయటికి చెప్పొద్దు అని చెప్తాడు కానీ అతను మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు.. ఆ తర్వాత అరుణ్ అతని కారు చీజ్ చేసి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేద్దాం ఆ తర్వాత అతని మన దారికి వస్తాడు అని అంటాడు.

మీనా దెబ్బకు బాలు ఫీల్..

రాత్రి అవ్వగానే ఏంటండి కారు లేదని బాధ పడిపోతున్నారా అని నేను అడుగుతుంది.. నాకు మనూస్ లాగా బిజినెస్ లేదు రవి లాగా వంటలు రావు నాకు వచ్చింది ఒక డ్రైవింగ్ అదే ఇప్పుడు లేదు అంటే నాకు చాలా బాధగా ఉంది మీ నాని బాలు బాధపడిపోతూ ఉంటాడు. అయితే బాలు అలా బాధ పడిపోవడం చూసిన మేన మీరు ఎంత చెప్పినా వినరు. అది దేవుడు ఇలా చేశాడు అని మీనా అంటుంది. అయితే మీనా మాటలు విన్న బాలు ఫీల్ అవుతాడు కానీ మీనా మాత్రం దేవుడి కంకణం కట్టాలి అని కడుతుంది. అటు రోహిణి గుణ కి ఫోన్ చేసి బాలుని చంపాలని చూస్తావా నువ్వు ఇలా చేస్తే నా కాపురం నిలబడతది అనుకోలేదు ఒక ప్రాణం పోతుంది అని రోహిణి చాలా బాధపడిపోతూ ఉంటుంది.

అయ్యో ప్రభా..

Advertisement

మీనా వంట గదిలో వంట చేస్తూ ఉండగా ప్రభావతి ఒక్కసారిగా కేకలు వేస్తూ పిలుస్తుంది. ఏంటి అత్తయ్య ఏం కావాలి మీకు అని అంటుంది. ఏం చేస్తున్నావు అని అంటే వంటగదిలో పూలు కడుతున్నాను అత్తయ్య మీకేం కావాలో చెప్పండి అని అంటుంది ఏంటి ఆ సమాధానం తల తిక్క సమాధానం చెప్తున్నావు అని ప్రభావతి సీరియస్ అవుతుంది. వంటగదిలో ఎవరైనా ఏం చేస్తారు ? వంట చేస్తారు అని ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా మీనా సమాధానం చెబుతుంది. ఆ మాట వినగానే ప్రభావతి ఇవాళ నాకు కరివేపాకు పచ్చడి తినాలనిపిస్తుంది. కరివేపాకు పచ్చడి చేయు అని అడుగుతుంది అయితే ఇంట్లో కరివేపాకు లేదు అని చెప్పగానే.. అదేంటి ఇంట్లో కరివేపాకే లేదా ఎక్కడికి పోయింది పక్కింట్లో ఉంది కదా పెరట్లో ఉంది కదా అని ఎంత చెప్పినా సరే.. ఎక్కడా లేదు మీరు వెళ్లి తీసుకొని వస్తే నేను పచ్చడి చేస్తాను అని మీనా అంటుంది.

బాలుకు ఘోర అవమానం..

మనోజ్ దగ్గరికి వెళ్లి అరే మనోజ్ వీడి చివర కూరగాయలు కొట్టు దగ్గరికి వెళ్లి నాకు కరివేపాకు తీసుకొచ్చి ఇవ్వరా కరివేపాకు పచ్చడి తినాలనిపిస్తుంది అని ప్రభావతి అడుగుతుంది. నేను ఒక బిజినెస్ మాన్ అమ్మ నేను ఎలా వెళ్లి కరివేపాకు తెస్తాను ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలువు వాళ్ళు తెచ్చిస్తారు అని అంటాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన బాలుని చూసిన మనోజ్ వీడు ఖాళీగానే ఉన్నాడు కదా వీడిచేత కరివేపాకు తెప్పించుకొని అంటాడు. ఆ మాట వినగానే మీనా కూడా వస్తుంది అయితే ప్రభావతి ఏంటే వాడు చేత కరివేపాకు తెప్పించుకుంటే కత్తితో పొడుస్తావా ఏంటి అని అడుగుతుంది. కత్తితో నేనేమి పొడవట్లేదు అత్తయ్య అని మీనా అంటుంది కానీ బాలు ఖాళీగానే ఉన్నాడు కదా వాడు తెస్తాడులే అని ప్రభావతి అనగానే నేను ఎక్కడికి వెళ్లలేనమ్మ నన్ను వదిలేయని బాలు బాధ పడిపోతాడు.

కారు కోసం బాలు ఎమోషనల్..

Advertisement

కారు కోసమని బాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని అనుకుంటాడు. అయితే బాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లేందుకు మీనా ఇద్దరు కలిసి వెళ్లాలని అనుకుంటారు. అక్కడ బాలు తన కారును చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. కారుని కడుగుతూ తనకోసం ఆరాట పడిపోతూ ఉంటాడు. అది చూసిన మీనా మీకు కార్ అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది అండి అని అంటుంది. అయితే అప్పుడే ఒక ఆవిడ కింద పడిపోతూ ఉండగా చూసిన మీనా ఆవిడని పట్టుకుంటుంది. ఏమైంది ఎందుకు మీరలా కింద పడిపోతున్నారు ఎవరి కోసం వచ్చారు అని నేను అడుగుతుంది. అతను నా భర్త కారుని తీసుకొని వచ్చారని చాలా బాధపడిపోతున్నారు అతని కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని మీనా చెప్తుంది. ఇక ఎస్సై రాదని మీనా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది.

అరుణ్ కు మైండ్ బ్లాక్..

అరుణ్ ఎస్ఐ గారు రాగానే బాలు అక్కడికి వస్తాడని తెలిసి ముందే ఎస్ఐకి తన గురించి చెప్తూ ఉంటాడు.. వీడికి నేనంటే కోపం సార్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా నాకు ఏదో ఒక నష్టం చేస్తూనే ఉన్నాడు.. ఇప్పుడు కూడా కావాలని చేశాడు అని అరుణ్ చెప్పగానే అప్పుడు అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ నిజం చెప్పాలని అనుకుంటాడు.. కానీ అరుణ్ వద్దని అంటాడు. ఇక ఆ కానిస్టేబుల్ కూతురు వచ్చి అసలు నిజం చెప్పగానే బాలు గ్రేట్ అని అందరూ అనుకుంటారు ఇక బాలు కారునివ్వడంతో పాటుగా తన లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు. అరుణ్ కి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కేశవకు షాక్.. మహా ప్లాన్ అదుర్స్.. ఫ్యామిలీ పార్టీ..

Related News

కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Podarillu Today Episode : కేశవకు షాక్.. మహా ప్లాన్ అదుర్స్.. ఫ్యామిలీ పార్టీ..

Karthika Deepam 2 Serial Today Episode October 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రతో చాలెంజ్ చేసి ఆఫీసుకు వెళ్లిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై చందు సీరియస్.. చివర్లో భద్ర ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అయ్యే సీన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కన్నీళ్లు.. భానుమతికి స్ట్రాంగ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు ప్రాణగండం –  రేఖ కొత్త ప్లాన్‌  

Nindu Noorella Saavasam Serial Today Episode October 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: విడిపోయిన అమర్, మిస్సమ్మలను పిల్లలు కలుపుతారా..?    

Big Stories

Advertisement
×