Podarillu Today Episode October 22nd: కన్న వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు.. వాడి ఇంటికి వస్తే ఎంత బాధ పడిపోతాడు అని మాధవ్ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే కన్నా అమ్మ అంటూ లోపలికి రావడంతో మహాలక్ష్మి తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతారు. అమ్మ ఇంకా రాలేదా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు అయితే అమ్మ కనిపించలేదు అని బయటికి వెళ్లి మరి వెతుకుతూ ఏడుస్తూ ఉంటాడు మా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి పోయింది నాకు అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. నారాయణ అప్పుడే ఇంటికి రావడంతో మా అమ్మని ఏం చేసావు నువ్వే చంపేసావా అని నారాయణ కాలర్ పట్టుకుని కన్నా అడుగుతాడు. కానీ నారాయణ నాకేం తెలియదు అని చెప్తున్నా సరే వినకపోవడంతో మహాలక్ష్మి ఆయనకేం తెలీదు ఆయన వదలండి అని అంటుంది.
కన్నా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అని ఇంట్లోకి వెళ్లి వాళ్ళ అమ్మ బొమ్మని చూస్తూ అతకలేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి వాళ్ళు కన్నా బాధను చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే కన్నా నీ నవ్వించే ప్రయత్నం చేయాలి అని మహాలక్ష్మి చక్రి లోపలికి వెళ్లి ఏదో ప్రయోగం చేస్తారు.. కానీ అది పెద్దగా సక్సెస్ అవదు. మొత్తానికి కన్నాను. నవ్వించేయడానికి చేసిన ప్రయత్నం అయితే కాస్త వర్కోట ఎలా కనిపిస్తుంది.. ప్లాన్ వర్క్ అవుతుంది కానీ. మాత్రం నవ్వకపోవడంతో అందరూ కూడా చాలా ఫీల్ అవుతారు. మీరు ఇలాంటి పని చేస్తారని నేను అసలు ఊహించలేదండి మీరు నన్ను ఇంతగా ఆడుకుంటారా అని అంటాడు దానితో కన్నా కూడా కాసేపు నవ్వుకుంటాడు.. అయితే కేశవ మాత్రం ఇలా అనడంతో అందరూ కూడా నవ్వుకుంటారు మొత్తానికి ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే కన్న నవ్వాడు అని అందరూ సంతోషంగా ఉండడంతో పాటుగా ఐస్క్రీం తినిపించాలని మహాలక్ష్మి అడుగుతుంది.
చక్రి ఐస్ క్రీమ్ కానీ అందరిని తీసుకొని వెళ్లగానే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత అందరిని పరిగెత్తాలని చెప్తాడు. అయితే అందరూ ఏమైందో తెలియకుండానే అక్కడి నుంచి పరిగెత్తడంతో మహాలక్ష్మి ఎందుకు పరిగెత్తుతున్నారు ఏం జరిగింది అసలు అని అడుగుతుంది. ఐస్ క్రీమ్ వాడికి డబ్బులు ఇవ్వకుండా నేనెలా సేవ్ చేసానో చూశారా అని చెక్రి అనగానే ఏడ్చినట్టు మీ తెలివి నేను ఆల్రెడీ వాడికి 500 ఇచ్చాను. ముందు వెళ్లి చిల్లర తీసుకురా పొండి అని మహాలక్ష్మి అంటుంది ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీరు చేసిన ఈ పని వల్ల ఎంత లాస్ అయిందో తెలుసా అని చక్రిని మహాలక్ష్మి బాగా తిట్టేస్తుంది ఇక పోనీలే అమ్మ ఏదో ఒకటి జరిగిపోయింది కదా అని మాధవ్ అడ్డుపడతారు. ఇకపోతే అక్కడ పానిపురి తింటున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి చక్రి మీరు శ్రీదేవి లాగా ఉన్నారు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి చూసారా మీ అన్నయ్య అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కార్చుకుంటూ వెళ్లిపోతాడు. ఎలా ఫ్లట్ చేస్తున్నారో కదా అని మహాలక్ష్మి అంటుంది.
అమ్మాయిలు కనిపిస్తే ఇలా వెళ్ళిపోతాడు ఏంట్రా అస్సలు ఊహించలేదు ఈ మనిషి ఇలాంటి వాడు అని మహాలక్ష్మి కన్నత చెప్తుంది అవును వదిన అన్నయ్య ఇలా ఉంటాడని నేను కూడా అసలు ఊహించలేదు అని కన్నా అంటాడు. అయితే మీ అన్నయ్య మీ ఇంటికి వెళ్లే వరకు నోరు మూసుకొని ఉండేలా నేను చేస్తాను చూడు అని కన్నా కడ్చిఫ్ తీసుకుని రూపాయి కాయిన్ కింద వేసి చక్రిని తీసుకోమని చెప్తుంది మహాలక్ష్మి.. చక్రి ప్యాంటు నిజంగానే చిరిగింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత చక్రి ఇక ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోతాడు అమ్మాయిలు దగ్గర చక్రి పరువు పోయేలా మహాలక్ష్మి చేస్తుంది. ఇకపోతే చక్రి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి అడిగిన కూడా చేతులు తీయకపోవడంతో అందరూ పళ్ళు ను నవ్వుతారు.
కేశవ షాప్ కి ఓనర్ అవ్వడానికి అడ్వాన్స్ ఇవ్వాలని అందరూ కూడా ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. షాప్ ఓనర్ రాగానే మాధవ చేతుల మీదుగా ఆ డబ్బులు ని ఇస్తారు. అయితే ఆ దగ్గరలో శైలు వచ్చి నేను షాప్ కొనేటప్పుడు లేకుండానే తను కొనేసుకున్నాడు వాళ్ల వాళ్లంటేనే తనకి ఇష్టం లేదంటే అసలు ఇష్టం లేదు కదా అని బాధ పడిపోతూ ఉంటుంది ఇక చక్రి షాప్ కి ఓనర్ అయ్యాడు కాబట్టి కచ్చితంగా మాకు పార్టీ ఇవ్వాలని అంటారు.. అందరూ కూడా రెస్టారెంట్లో చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటారు. నారాయణకు కూడా బిర్యానీ తీసుకుని వెళ్లి మహాలక్ష్మి ఇవ్వాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…