BigTV English

Gundeninda GudiGantalu Today Episode : సత్యంకు సురేంద్ర వార్నింగ్‌.. రవి, శృతిల పెళ్లి పెద్దగా సుమతి.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్…

Gundeninda GudiGantalu Today Episode : సత్యంకు సురేంద్ర వార్నింగ్‌.. రవి, శృతిల పెళ్లి పెద్దగా సుమతి.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్…

Gundeninda GudiGantalu Today Episode October3rd : నిన్నటి ఎపిసోడ్ లో ప్రభావతి దగ్గరకు మనోజ్ వచ్చి డ్యూటీకి వెళ్తున్న అన్నాడు. డ్యూటీ వెతుక్కోడానికి వెళ్తున్నా అని చెప్పు. ఇంకా ఎన్ని రోజులురా. నీకెప్పుడు జాబ్ వస్తుందిరా అని ప్రభావతి అంటుంది. ఇక సత్యం దగ్గర డబ్బులు తీసుకొని బయటకు వెళ్తాడు. మీనా బాలును ప్రేమ గురించి క్లాస్ పీకుతుంది. అందులో ఒక వంద నోటు బాలు దగ్గరకు వస్తుంది. దీనిపై ఆరా తీస్తూ పార్క్ లోకి వెళ్తాడు. తృటిలో మనోజ్ తప్పించుకున్నాడు. సత్యం లవ్ స్టోరీని బయటపెట్టి ప్రభావతికి షాక్ ఇస్తాడు..ఇంట్లో జీతం ఇవ్వాలి. వడ్డీకి పదివేలు ఇవ్వమని మనోజ్ అడుగుతాడు. ఇంటి అడ్రస్, పార్క్ అడ్రస్, మీ ఆవిడ పార్లర్ అడ్రస్ అన్ని దీంట్లో రాసి ఇవ్వమని అతను చెబుతాడు..దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. ఖర్చులకు ఇబ్బంది కావడంతో వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు మనోజ్‌. వడ్డీ ఇచ్చే అతడు మనోజ్‌ను ఇన్‌సల్ట్ చేస్తాడు. మనోజ్ ఆధార్ కార్డ్‌తో పాటు ఫోన్‌లో మనోజ్ ఫొటోలు తీసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు అని మనోజ్ అడిగితే… జాబ్ చేస్తున్నానంటూ కట్టుకున్న పెళ్లాన్ని, తల్లిని మోసం చేసిన నువ్వు నన్ను మోసం చేయవని గ్యారెంటీ లేదని చెప్తాడు. అప్పుగా తీసుకున్న పదివేలతో కొన్నాళ్లు వంద, రెండు వందల కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. ఇక పిజ్జాలు అవి ఆన్ లైన్లో ఆర్డర్ చేసుకొని తింటాను అని ఇంటికి వెళ్తాడు. మనోజ్ కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడే బాలు వస్తాడు. ఈ నోటు పార్క్ లోకి ఎలా వచ్చిందని అడుగుతాడు. మనోజ్ తీసుకున్న విషయం తెలిసిందే.. నేను టీ తాగాను అక్కడ పోయింది అంటాడు. ఇక మనోజ్ జేబులోంచి పదివేలు కింద పడుతుంది. అది నాది కాదు అని కవర్ చేశాడు. అవి తన డబ్బులు అని, మీ నాన్న పెన్షన్ డబ్బుల నుంచి తీసుకున్నానని ప్రభావతి అబద్ధం ఆడుతుంది. పెన్షన్ డబ్బులు నీకు దొరక్కుండా బ్యాంకులో దాచానని ప్రభావతి అబద్ధాన్ని బయటపెడతాడు సత్యం. ఇక బాలు నాదే అని తీసుకుంటాడు..

ఇక అప్పుడే సత్యంకు సురేంద్ర ఫోన్ చేసి మాట్లాడాలని రమ్మని పిలుస్తాడు. సత్యాన్ని కలుస్తాడు శృతి తండ్రి సురేంద్ర. శృతికి పెళ్లి ఫిక్సయిందని, అయినా వినకుండా మీ అబ్బాయి రవి తన కూతురితో మాట్లాడుతున్నాడని, ఇంకోసారి మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు. నీ కొడుకు వల్ల నా కూతురి పెళ్లి ఆగిపోతే ఊరుకోనని సత్యాన్ని హెచ్చరిస్తాడు. నీ కూతురు పెళ్లి మీరు చేసుకోండి. పెళ్లి పనులు చూసుకోమని సురేంద్రకు మాటిస్తాడు సత్యం. రవి తన మాట జవదాటి ఎలాంటి తప్పు చేయడని సురేంద్రకు చెబుతాడు. ఇక సత్యం ఇంటికి వెళ్తాడు. మీనా బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సత్యం వస్తాడు.. సురేంద్ర వార్నింగ్ ఇచ్చిన విషయం బాలుతో చెబుతాడు. మీరు కంగారు పడకండి అంటూ అని సత్యంకు చెబుతాడు.


ఇక మీనా, రవిలా మధ్య దీనిపై చర్చలు జరుగుతాయి. శృతిని రవి ప్రేమిస్తున్నాడు కావచ్చునని, ఒకవేళ వారిని విడదీస్తే జీవితాంతం ఇద్దరు బాధపడతారని బాలుకు సర్ధిచెప్పబోతుంది మీనా. శృతితో తాను మాట్లాడి మన కుటుంబ పరిస్థితి వివరిస్తానని మీనా అంటుంది. శృతితో మాట్లాడాలసిన అవసరం లేదని బాలు అంటాడు.. సుమతిని రవికి ఇచ్చి పెళ్లిచేస్తే ఈ గొడవలన్నీ ముగిసిపోయేవని, కానీ మీ అమ్మే ఒప్పుకోలేదని మీనాపై సెటైర్లు వేస్తాడు. ఇక మీనా నేను ఎవరికీ చెప్పాను అని కోపంగా వెళ్తుంది.

ఇక రవి శృతి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడతాడు.. ఇక సుమతికి రవి ఫోన్ చేస్తాడు. తమ పెళ్లి సజావుగా జరగడానికి మీనా చెల్లెలు సుమతి సాయం తీసుకోవాలని రవి అనుకుంటాడు. సుమతిని కలిసి తన ప్రేమ విషయం మొత్తం చెప్పేస్తాడు. శృతితో తన పెళ్లికి బాలు అడ్డుచెబుతున్న సంగతి కూడా సుమతికి వివరిస్తాడు రవి.. శృతి, తాను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు, ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే చేయాలని సుమతిని రిక్వెస్ట్ చేస్తాడు రవి. సుమతి భయపడుతూనే అందుకు ఒప్పుకుంటుంది. బాలు ఆవేశం గుర్తొచ్చి కంగారు పడుతుంది. రవి, శృతిల పెళ్లి తాను జరిపిస్తే అక్క కాపురానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో శృతి, రవి పెళ్లికి సుమతి సాయం చేస్తుంది. రేపు గుడిలో పెళ్లి చేసుకుంటారా? బాలు పెళ్లిని ఆపుతాడా? అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×