E-Paper
Advertisement

Telangana Govt Bumper Offer: మూసీ నిర్వాసితులకు బంపరాఫర్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు..

Telangana Govt Bumper Offer: మూసీ నిర్వాసితులకు బంపరాఫర్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు..
Advertisement

Telangana Govt Bumper Offer: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. మూసీ కాలువ వెంబడి మరో రెండేళ్లలో మంచి నీరు ప్రవహించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇప్పటికే చెప్పింది. అన్నట్లుగా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పిల్లలకు విద్యా సంవత్సం నష్టపోకుండా ఉండేందుకు సమీపంలోని పాఠశాలలో సీట్లు ఇవ్వనుంది. తాజాగా బాధిత కుటుంబాలకు రూ. 25000 వేల ప్రోత్సాహకం అందించనుంది. దీనివల్ల ఆయా ఫ్యామిలీలకు కొంత సమస్యలు తొలుగుతాయని భావిస్తోంది.

Advertisement

ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటి వరకు 40 శాతం మంది ఖాళీ చేశారు. మరో 40 శాతం మరో ప్రాంతానికి వెళ్లేందుకు ముందుకొచ్చారు. కేవలం 20 శాతం మాత్రమే ఇష్టపడటం లేదన్నది అంతర్గత సమాచారం.

ఇళ్లు ఖాళీ చేయనివారిలో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తొలగిస్తారన్నది అధికారుల మాట.

Advertisement

ALSO READ: సురేఖ Vs కేటీఆర్ కామెంట్స్.. అధిష్టానం నెక్ట్స్ ఏంటి?

ఇదిలావుండగా మూసీ నదికి త్వరలో మాస్టర్‌ప్లాన్‌ రాబోతుంది. అందుకు సర్వే చేపట్టేందుకు (మూసీ నది అభివృద్ధి సంస్థ) సింగపూర్‌ సంస్థను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సర్వే ప్రారంభిస్తామన్నది అధికారులు చెబుతున్నారు. సంస్థ ప్రతినిధులు, నిపుణుల బృందాలు అనేక అంశాల్లో నదిని సర్వే చేస్తారని అంటున్నారు. రెండు రకాల (పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక)లను రూపొందించనున్నట్లు యంత్రాంగం చెబుతోంది.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×