Gundeninda GudiGantalu Today episode September 6th: మా అత్తయ్య నన్ను వ్రతంలో కూర్చోవద్దు అని చెప్పింది. మనోజ్ తో కలిసి కూర్చొని నేను ఈ వ్రతం చేసుకోవాలి. ఏదో ఒకటి చేసిన సరే ఈ వ్రతంలో కూర్చోవాలి దాని కోసం నేను మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను అని రోహిణి అంటుంది. నువ్వు ఇలా చేసినందుకే మీ అత్తయ్య వ్రతంలో కూర్చోవద్దని చెప్పింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోతే మాత్రం నేను ఇంట్లో కూడా ఉండనివ్వరు అని బిజీ ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాటని ఎలాగైనా సరే తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని రోహిణి ప్లాన్లు మీద ప్లాన్ వేస్తుంది.. రోహిణి ఏదో ఒకటి చేసి మళ్లీ నేను వ్రతంలో కూర్చుని మా అత్తయ్య మనసులో మంచి దానివి అని అనిపించుకోవాలి అని ప్లాన్ చేస్తుంది అనుకున్నట్లుగానే తన ప్లాన్ ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తుంది..
కామాక్షి ప్రభావతి ఉంటారని తెలిసి ఒక సోదావిడ కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే కామాక్షి మాత్రం ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని ఎంత చెప్తున్నా సరే.. వినకుండా నేను సోది చెప్తాను మీ గురించి మొత్తం నిజం చెప్తాను అని అంటుంది. అయితే ఆవిడ చెప్పినట్లుగానే రోహిణి పూజలో కూర్చుంటే అదృష్టం కలిసి వస్తుంది అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ కొడుకుకు అదృష్టం పట్టేలా చేయడానికి నీ కోడలు ఎప్పుడూ ముందుంటుంది తన చేత ఈ పూజ చేయించు అప్పుడే నీకు అంత మంచి జరుగుతుంది అని రోహిణి ప్లాంట్ ప్రకారం ఆ సోదావిడ నిజం చెప్తుంది. కానీ అక్కడ ప్రభావతి మాత్రం నమ్మినట్లే కనిపిస్తుంది. మరి రోహిణి నీ పూజలో కూర్చొనిస్తున్న లేదా అన్నది ఎపిసోడ్లో సస్పెన్స్ గా మారింది.
రోహిణి ఎలాగైనా సరే వ్రతంలో కూర్చోవాలి అని ప్రభావతికి టెన్షన్ పెట్టైనా సరే ఈ వ్రతంలో తన భర్తతో కూర్చొని ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది. నేరుగా వెళ్లి అడిగితే ప్రభావతి అస్సలు ఒప్పుకోదు అని ఫిక్స్ అయినా రోహిణి ఎలాగైనా సరే తన మనసు మార్చుకొని మళ్లీ తనని తానే పూజలు కూర్చొని చేయాలని అనుకుంటుంది. రోహిణి ఒకవైపు ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా ఏదో ఒకటి చేస్తాను నా పంతం నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతాను ఏదైనా చేస్తాను అంటూ రోహిణి శబదం చేస్తుంది. నువ్వు ఇంత చేసిన కూడా మీ అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెడ పట్టుకుని బయటికి గెంటకుండా నిన్ను ఉంచుకున్నారు కాబట్టి నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మళ్లీ నీకు కాపురం మీద ఎఫెక్ట్ పడుతుందని ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం అదంతా నేను చూసుకుంటాను నేను పూజలో కూర్చోవాల్సిందే దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాను అని అంటుంది.. ఇక రోహిణి ఆ మాట అనగానే విద్య నీకు ఎంత చెప్పినా వినవు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని పెద్ద ప్రయోజనం ఉండదు అంటూ చెబుతుంది..
ఉదయం లేవగానే అందరూ వరలక్ష్మీ వ్రతం కాబట్టి అన్ని సిద్ధం చేసి పెడతారు. అయితే రోహిణి మాత్రం వరలక్ష్మీ వ్రతంలో తనని కూడా కూర్చోనిస్తుంది అని అనుకుంటుంది. కానీ రోహిణి ప్లాను వర్కౌట్ అవదు ప్రభావతి నువ్వు వ్రతంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. వెల్లు నీ గదిలోకి అని చెప్తుంది. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన గదిలోకి వెళ్ళగానే మనోజ్ ని నేను కూడా ఈ పూజలో కూర్చుంటున్నాను అని ఎంతగా అడిగినా సరే మనోజ్ మాత్రం మా అమ్మ మాటే ఫైనల్ అని అంటాడు.
రోహిణిని పూజలు కూర్చోవద అని చెప్పిన ప్రభావతి పై సీరియస్ అవుతుంది..రోహిణిని పూజలు కూర్చోవద్దు అని చెప్పిన ప్రభావతి పై సీరియస్ అవుతుంది.. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పూజకు వస్తున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళు నీ గదిలోకి అని ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం అలానే ఉంటుంది. ఇక మనోజ్ బలవంతంగా రోహిణి పైన తన గదిలోకి తీసుకొని వెళ్తాడు.. నీ మంచి కోసం చేయాలనుకున్న పూజని మీ అమ్మ అడ్డుకుంటుంది.. ఈ వ్రతం చేస్తే నువ్వు చాలా బాగుంటావు అని రోహిణి మనోజ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది కానీ అతను మాత్రం మా అమ్మ మాటే ఫైనల్ అని అంటాడు. అన్ని మీ అమ్మలాగే వినాలి అని అంటే అసలు కుదరదు నువ్వు కూడా కొంచెం ఆలోచించు అని పెద్దకోడల్ని నన్ను కూర్చుని ఇవ్వరా..? ఈ పూజ లోకి నేను కూర్చోవాలి అంటే అమ్మమ్మ ఖచ్చితంగా రావాలి అని సుశీల అని పిలిచే ప్రయత్నం చేస్తుంది రోహిణి.. మరోవైపు మేన కూడా రోహిణిని పూజలు కూర్చొని ఇవ్వండి అని ఎంత చెప్తున్నా సరే అసలు వినదు ప్రభావతి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో రోహిణి కోరిక తీరుతుందా? తను కూడా తన భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నా లేదా అన్నది చూడాలి..
Also Read :Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..