E-Paper
Advertisement

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. గుజరాత్‌లో ఘటనపై

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. గుజరాత్‌లో ఘటనపై
Advertisement

Gujarat: ఈ మధ్యకాలంలో కీలక కేసు నిందితులపై పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారు. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పేరుతో పబ్లిక్‌లో చావబాదుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటన గుజరాత్‌లోని భావనగర్‌లో వెలుగు చూసింది. దాదాపు ఏడు నిమిషాల నిడవి గల వీడియో బయటకు వచ్చింది. పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు తీవ్రమయ్యాయి. అసలు ఈ కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

హత్య కేసు నిందితుడ్ని పబ్లిక్ చావబాదిన గుజరాత్ పోలీసులు

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ బస్ స్టాండ్ వద్ద సెప్టెంబర్ 3న తన సహజీవన భాగస్వామి కాజల్‌ను హత్య చేశారనే ఆరోపణలకు సంబంధించి నిందితుడు ఫైజల్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడికి నిందితుడ్ని తీసుకొచ్చారు. నేర స్థలాన్ని పునర్నిర్మించే క్రమంలో నీలాంబాగ్‌ పోలీసులు డీపీ ఉనద్కత్ సుమారు 10 నిమిషాలపాటు తన లాఠీకి పని చెప్పారు. నిందితుడి రెండు చేతులు చాపి వాటిని తాళ్లతో ఇద్దరు పోలీసులు కట్టేసి గట్టిగా పట్టుకున్నారు. నిందితుడ్ని లాఠీతో 107 సార్లు పైఅధికారి కొట్టారు.

భావనగర్ బస్టాండులో ఘటన, వీడియో వైరల్

Advertisement

పట్టపగలు బస్టాండ్ దగ్గర ఈ తతంగం జరగడంతో అక్కడ ఓ వ్యక్తి ఈ సన్నివేశాలను చిత్రీకరించిన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. మొదటి నాలుగు నిమిషాల్లో 48 దెబ్బలు కొట్టిన పోలీసులు, ఆ తర్వాత నిందితుడ్ని కింద పడుకోబెట్టి, ఆ తర్వాత ఓ స్తంభానికి కట్టేసి కొట్టినట్టు సమాచారం. ఈ ఘటన కాస్త పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. నిందితులను పోలీసులు బహిరంగంగా కొట్టడం, దాడి చేయడం వంటివి చేయకూడదని శిక్ష విధించడం కోర్టుల బాధ్యతని గతేడాది ఓ కేసులో న్యాయస్థానం వెల్లడించిందని గుర్తు చేస్తున్నారు.

పోలీసుల తీరుపై విమర్శలు

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ బస్ స్టాండ్ వద్ద తన ప్రియురాల్ని కొట్టి చంపాడు ఫైజల్‌ అలియాస్ ఖట్కీ లఖానీ. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. అందులో భావనగర్‌లోని బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు ఫైసల్.. తన ప్రియురాలు కాజల్‌పై సుమారు ఏడు నిమిషాల పాటు దాడి చేశాడు. ఈ దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ఇరుగుపొరుగువారు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కాజల్-ఫైసల్ సుమారు ఏడేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు తరచుగా గొడవలు పడుతుండేవారు.

Advertisement

ALSO READ: కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

ఫైజల్‌ తన స్నేహితుడు రవితో కాజల్‌కు అక్రమ సంబంధం ఉందని అనుమానించేవాడు. అదే ఆ ముగ్గురి మధ్య వివాదానికి కారణమని వెల్లడైంది. ఈ కేసులో ఫైసల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని చెప్పారు పోలీసులు. గతంలో దోపిడీలు, దాడి వంటి ఘటనల్లో కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఓ కేసులో ఫైజల్ జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కాజల్-రవిల మధ్య ఉన్న సంబంధం గురించి తెలియడంతో హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు నిమిత్తం నిందితుడిని అరెస్టు చేసి బస్ స్టాండ్‌కు తీసుకొచ్చి ఘటనను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పేరుతో పబ్లిక్‌లో చావబాదారు.

 

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×