Podarillu Today Episode September 6th :ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నారు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా? ఎందుకు మీరు ఇవన్నీ శుభ్రం చేయాలి అని అడుగుతారు.. అయితే ఇంట్లో పెళ్లిచూపులు జరుగుతున్నాయి అని మహాలక్ష్మి అనగానే ఏంటి నిన్ననే కదా బస్ స్టాప్ లో చూసుకుంది. అప్పుడే పెళ్లిచూపుల ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అడుగుతాడు కన్నా.. అతనికి కాదు పెద్దికి పెద్దినే చెప్పాడు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారని అందుకే ఇల్లంతా శుభ్రం చేయాలి అని మహాలక్ష్మి అంటుంది.. అయినా పెళ్లి సంబంధం చూసుకున్నారట. మా ఆఫీస్ దగ్గరికి వచ్చి పెద్దినే చెప్పారు. అందుకే నేను దీని గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మొత్తం అంతా సిద్ధం చేయాలి అని మహాలక్ష్మి అనగానే చక చక అందరు తల ఒక పని చేస్తారు.. ఇక పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చేస్తున్నారని అంత సిద్ధం చేసేస్తారు.
జయంతి ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జయంతి ప్రవర్తనతో అందరినీ బాధ పెడుతుంది.. అసలు తను ఇలాంటి ప్రవర్తనతో ఉండడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదేంటి ఈవిడ ఇలా ఉంది ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు. అయితే జయంతి ఇంటిని చూడడానికే నేను వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. తన ప్రవర్తన చూసి మహాలక్ష్మి కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనగానే ఏంటి విడాకుల ఎవరికి అని అందరూ అనుమానంతో అడుగుతారు. కానీ విడాకులు నాకే ఈ విషయం గురించి మీ ఇంట్లో వాళ్లకి చెప్పలేదా అని జయంతి అడుగుతుంది ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు.
జయంతి వాళ్ళు వెళ్ళగానే అందరూ మాధవ దగ్గరికి వచ్చి అడుగుతారు విడాకులు తీసుకుపోతున్న అమ్మాయితో పెళ్లి ఏంటి అని అడక్కని మాధవ్ మాత్రం నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరో ఒకరు అమ్మాయి కావాలి అని అనుకున్నాను. నాకు ఈ జయంతి బాగా నచ్చింది అని చెప్తాడు. తనకి విడాకులు రాగానే మేము పెళ్లి చేసుకుంటాము అని మాధవ్ తేల్చి చెప్పేస్తాడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఎంతగా బ్రతిమలాడాలని చూసినా కూడా తను మాత్రం తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని చెప్తాడు. నాకు ఇంకా పెళ్లి అవలేదు అని అందరూ తలా ఒక మాట అంటున్నారు. పెళ్లి కాలేదని సమాజం నన్ను ఎంతగా కించపరిచాలా మాట్లాడుతుందో మీకు తెలియదా అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను అని మాధవ అంటాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్న అన్నయ్య కాకపోతే ఇలా రెండవ సంబంధం చేసుకుంటాడని అస్సలు ఊహించలేదు అని అందరూ అడుగుతారు.
మాధవ్ నేను అమ్మాయిని పెళ్లి చేసుకునే తీరుతాను నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని అందరితో ఖచ్చితంగా చెప్పడంతో ఎందుకు? అన్నయ్య నువ్వు ఎలా మారిపోయావు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా అని అంటారు. ఇందులో నా స్వార్థం ఏంటి నాకు పెళ్లి కావాలి అని అనుకున్నాను. ఇక జీవితాంతం ఇలానే పెళ్లి లేకుండా ఉండిపొమ్మంటారా అంటూ.. మాతో తన తమ్ములని అలాగే మహాలక్ష్మి బాధ పెట్టేలా మాట్లాడుతాడు కానీ ఇక తన నిర్ణయాన్ని ఎవరు వెనక్కి తీసుకొని లాగా ప్రవర్తించదు అని అనుకుంటారు. ఎవరు ఎంత చెప్పినా సరే మాధవ్ మాత్రం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పేస్తాడు.. అన్నయ్య ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అని అందరూ కూడా ఆలోచనలో పడతారు.
మహాలక్ష్మి మాధవ్ కి ఇంకా ఎంత చెప్పిన తను నిర్ణయం మార్చుకునేలా లేడు అని ఆ విషయం గురించి ఎవరిని అడగద్దు అని చెప్తుంది.. ఇక అందరూ ఎవరి పనులకు వాళ్ళు బిజీగా వెళ్ళిపోతారు. అయితే మహాలక్ష్మి తన స్కూటీ మీద వెళ్లాలని అనుకుంటుంది. చక్రి మాత్రం ఏంటండీ మీరు స్కూటీని తీస్తున్నారు. మీకు ఇంకా లైసెన్స్ రాలేదు కదా అని ఎంత చెబుతున్నా సరే మహాలక్ష్మి నేను ఇకమీదట ఆఫీస్ కి ఈ స్కూటీ మీదనే వెళ్ళిపోతాను.. బస్ స్టాప్ లో ఆ ఘోరాలని చూడలేకపోతున్నాను అని కావాలని చక్కని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది మహాలక్ష్మి. నేను గోపిక లైన్ వేసుకోవడం చూస్తుంటే మహాలక్ష్మి గారికి కోపం ఎక్కువ.. ఇవాళ గోపిక కోసం నేను వెళ్లలేని ఏమో అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు.
స్కూటీ సరిగ్గా స్టార్ట్ అవ్వడం లేదు అని మహాలక్ష్మి కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తుంది.. అయితే అక్కడ ఆల్రెడీ శైలు ఉండడంతో ఏంటి మీ అన్నయ్యకు పెళ్ళంట అని చక్రిని అడుగుతుంది శైలు.. ఆ పెళ్లి ఇప్పట్లో జరగదు అని శైలుతో కేశవ్ అంటాడు కానీ ఎందుకు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆయన పెళ్లయితే మనిద్దరి పెళ్లి అవుతుంది కదా మరి ఆయన పెళ్లి చేసుకుని ఇవ్వచ్చు కదా అని శైలు ఎంత చెప్తున్నారు సరే కేశవ మాత్రం మనది పెళ్లి జరగకపోయినా పర్వాలేదు కానీ ఆ అమ్మాయితో మా అన్నయ్య పెళ్లి జరగడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టుకుంటాడు. కానీ శైలు మాత్రం కేశవ మాటతో సీరియస్ అవుతుంది చాలా బాధపడిపోతుంది. అసలు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా మీ అన్నయ్య పెళ్లి జరిగితేనే మనిద్దరి పెళ్లి అన్నావు కదా ఇప్పుడు మీ అన్నయ్య తనంతట తానే పెళ్లికి సిద్ధమైతే నువ్వెందుకు మన పెళ్లి జరగదు అని అంటున్నావ్ అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?