Gundeninda GudiGantalu Today episode September 7th: రోహిణిని పూజలు కూర్చోవద్దు అని చెప్పిన ప్రభావతి పై సీరియస్ అవుతుంది.. రోహిణిని పూజలు కూర్చోవద్దు అని చెప్పిన ప్రభావతి పై సీరియస్ అవుతుంది.. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా.. ఈ పూజకు వస్తున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళు నీ గదిలోకి అని ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం అలానే ఉంటుంది. ఇక మనోజ్ బలవంతంగా రోహిణి పైన తన గదిలోకి తీసుకొని వెళ్తాడు.. నీ మంచి కోసం చేయాలనుకున్న పూజని మీ అమ్మ అడ్డుకుంటుంది.. ఈ వ్రతం చేస్తే నువ్వు చాలా బాగుంటావు అని రోహిణి మనోజ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది కానీ అతను మాత్రం మా అమ్మ మాటే ఫైనల్ అని అంటాడు. అన్ని మీ అమ్మలాగే వినాలి అని అంటే అసలు కుదరదు నువ్వు కూడా కొంచెం ఆలోచించు అని పెద్దకోడల్ని నన్ను కూర్చుని ఇవ్వరా..? ఈ పూజ లోకి నేను కూర్చోవాలి అంటే అమ్మమ్మ ఖచ్చితంగా రావాలి అని సుశీల అని పిలిచే ప్రయత్నం చేస్తుంది రోహిణి.. మరోవైపు మేన కూడా రోహిణిని పూజలు కూర్చొని ఇవ్వండి అని ఎంత చెప్తున్నా సరే అసలు వినదు..
తన భర్త కోసం వ్రతం చేస్తున్న రోహిణిని గతంలో కూర్చోవద్దు అని అత్తయ్య గారు అన్నారు కదా.. పాపం కదండీ తన భర్త కోసమే కదా ఇదంతా చేస్తుంది అని మీనా కూడా చాలా జాలి పడిపోతూ ఉంటుంది. అంతేకాదు మధ్యాహ్నం శృతి అన్నమాట పట్టుకొని కడుపులో కాలినట్టు ఉంది అందుకే నాకు ఆకలిగా లేదు అని వెళ్ళిపోయింది. నువ్వు అంతగా ఏమన్నావు అని శృతిని బాలు అడుగుతాడు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే రోహిణి గురించి ఎలాగైనా సరే మనం ఆలోచించాలి అని మీనా తో పాటు మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు. మా అమ్మని ఎలా అయితే కంట్రోల్లో పెట్టాలో నాకు బాగా తెలుసు.. మా అమ్మ సంగతి నేను చూసుకుంటాను మిగిలిన సంగతి మీరు చూసుకోండి అని బాలు అంటాడు..
ప్రభావతి ఇంకా రాలేదు.. రోహిణి వ్రతం గురించి మాట్లాడుతూ బాధ పడిపోతూ ఉంటుంది. రోహిణి చాతి ఎలాగైనా సరే వ్రతం చేయించాలి అని మీనా శృతి ఇద్దరు కూడా అనుకుంటారు. అయితే సత్యంతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటారు. అత్తయ్య ఎంతగా చెప్పిన కూడా ఒప్పుకోవడం లేదు అని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు.. కానీ అత్తయ్య ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు మావయ్య గారు అని మీనా కూడా సత్యం నీ రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రభావతిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ శృతి కూడా అత్తయ్య మీరు రోహిణి కోసం ఒప్పుకోవాల్సిందే అని మాట్లాడడంతో తను ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. నువ్వు నాకు చెప్పే దానివయ్యావా? నిన్ను కూడా దాని లాగే చూస్తాను అంటూ సీరియస్ అవుతుంది.. ఆ మాట వినగానే శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..
శృతి ని అరవడంతో తను భయపడిపోతూ ఉండగా బాలు ఇక ఎవరేం చెప్పినా అమ్మ వినదు అని తన ప్లాన్ ను వర్కౌట్ చేస్తాడు. శీల డార్లింగ్ పూజ ముగ్గురు కోడలతో అలాగే అమ్మ కూడా చేస్తుంది.. అంటూ ఫోన్ రాకపోయినా సరే వచ్చినట్లుగా బాలు మాట్లాడుతూ కిందకి వస్తాడు. ఇక చేసేదేమీ లేక ప్రభావతి ఒప్పుకుంటుంది.. ఇక ఆ తర్వాత ప్రభావతి వీళ్ళ వల్ల నేను ఒప్పుకున్నాను నా పరువును కాపాడాడు బాలు అంటూ తనపై ప్రశంసలు కురిపిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. వరలక్ష్మీ వ్రతం రోజున మనోజ్ తనని దగ్గరకు తీసుకున్నాడని రోహిణి కల కంటుంది. మొత్తానికి రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది ప్రభావతి.
గుణ కలెక్షన్స్ కోసమని వెళ్తాడు అయితే అక్కడ తనకి కలెక్షన్స్ సరిగ్గా రాకపోవడంతో శివ గాడు ఉంటే మనకి కలెక్షన్స్ బాగా వచ్చేవి. కానీ కలెక్షన్లు రాలేదు అంటే శివ గాడు లేడు అని బాధపడిపోతూ ఉంటాడు. ఆ బాలు గాడి వల్ల నా బిజినెస్ అంతా లాస్ అయ్యేలా ఉంది. ఇప్పుడు నేను అర్జెంటుగా రెండు లక్షలు కావాలి అంటే ఎక్కడికి వెళ్లాలి ఎవరిని అడగాలి అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు గుణ.. అప్పుడే దినేష్ కాల్ చేసి నేను త్వరలోనే వస్తాను మళ్ళీ నీకు డబ్బులు వచ్చేలా చేస్తాను అని అంటాడు కానీ రోహిణి సీక్రెట్ మాత్రం అస్సలు చెప్పడు.. ఇక రోహిణి బెదిరించి ఎలాగైనా సరే డబ్బులు తీసుకోలేని గుణ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రోహిణి చాలా తెలివిగా గుణకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : చక్రిని ఆడుకున్న మహా.. శైలు ఫుల్ హ్యాపీ.. పెద్ది పెళ్లి జరుగుతుందా..?