Podarillu Today Episode September 7th :మాధవ్ నేను అమ్మాయిని పెళ్లి చేసుకునే తీరుతాను నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని అందరితో ఖచ్చితంగా చెప్పడంతో ఎందుకు? అన్నయ్య నువ్వు ఎలా మారిపోయావు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా అని అంటారు. ఇందులో నా స్వార్థం ఏంటి నాకు పెళ్లి కావాలి అని అనుకున్నాను. ఇక జీవితాంతం ఇలానే పెళ్లి లేకుండా ఉండిపొమ్మంటారా అంటూ.. మాతో తన తమ్ములని అలాగే మహాలక్ష్మి బాధ పెట్టేలా మాట్లాడుతాడు కానీ ఇక తన నిర్ణయాన్ని ఎవరు వెనక్కి తీసుకొని లాగా ప్రవర్తించదు అని అనుకుంటారు. ఎవరు ఎంత చెప్పినా సరే మాధవ్ మాత్రం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పేస్తాడు.. అన్నయ్య ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అని అందరూ కూడా ఆలోచనలో పడతారు.
మహాలక్ష్మి మాధవ్ కి ఇంకా ఎంత చెప్పిన తను నిర్ణయం మార్చుకునేలా లేడు అని ఆ విషయం గురించి ఎవరిని అడగద్దు అని చెప్తుంది.. ఇక అందరూ ఎవరి పనులకు వాళ్ళు బిజీగా వెళ్ళిపోతారు. అయితే మహాలక్ష్మి తన స్కూటీ మీద వెళ్లాలని అనుకుంటుంది. చక్రి మాత్రం ఏంటండీ మీరు స్కూటీని తీస్తున్నారు. మీకు ఇంకా లైసెన్స్ రాలేదు కదా అని ఎంత చెబుతున్నా సరే మహాలక్ష్మి నేను ఇకమీదట ఆఫీస్ కి ఈ స్కూటీ మీదనే వెళ్ళిపోతాను.. బస్ స్టాప్ లో ఆ ఘోరాలని చూడలేకపోతున్నాను అని కావాలని చక్కని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది మహాలక్ష్మి. నేను గోపిక లైన్ వేసుకోవడం చూస్తుంటే మహాలక్ష్మి గారికి కోపం ఎక్కువ.. ఇవాళ గోపిక కోసం నేను వెళ్లలేని ఏమో అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు. మీ ఒంటరిగా వెళ్తుంది అని ఆ బండి స్టార్ట్ అవడం లేదని చక్రి కూడా వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు..
మీరేంటి నా వెనకాల వస్తున్నారు.. మీ గోపిక దగ్గరికి వెళ్లలేదా బస్టాండ్ లో మీకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది అని మహాలక్ష్మి చక్రిని ఒక ఆట ఆడుకుంటుంది. నా బండి ఆగిపోయింది కదా ఇప్పుడు నేను ఎలా వెళ్లాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.. మీరు చెయ్యి వేసారు కదా అది కచ్చితంగా ఆగిపోతుందని మహాలక్ష్మి చక్రి పరువు తీసేలా మాట్లాడుతుంది.. ఇక బండిని చక్రీ కేశవ దగ్గరికి తీసుకొని వెళితే వాడు ఏమైందో చూస్తాడు అని అనుకుంటారు. చక్రి కేశవ దగ్గరికి బండిని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడే అక్కడ శైలు ఉంటుంది. అప్పటికే కేశవ శైలుకి వాళ్ళ అన్నయ్యకి పెళ్లి గురించి చెప్తాడు ఆ మాట వినగానే శైలు గాల్లో తేలుతూ ఉంటుంది. నీ పెళ్లి అయిపోయింది అంటే కచ్చితంగా నెక్స్ట్ మన పెళ్లి కదా జరిగేది అని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ కేశవ్ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. అక్కడికొచ్చిన చక్రితో ఏంటి మీ అన్నయ్య పెళ్లి కదా అని అడుగుతుంది శైలు. అయితే మహాలక్ష్మి కూడా ఈ సంబంధం ఖాయం అవ్వకుండా ఉంటే బాగుండు అని బాధ పడిపోతూ ఉంటుంది.
ఆ పెళ్లి ఇప్పట్లో జరగదు అని శైలుతో కేశవ్ అంటాడు కానీ ఎందుకు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆయన పెళ్లయితే మనిద్దరి పెళ్లి అవుతుంది కదా మరి ఆయన పెళ్లి చేసుకుని ఇవ్వచ్చు కదా అని శైలు ఎంత చెప్తున్నారు సరే కేశవ మాత్రం మనది పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. కానీ ఆ అమ్మాయితో మా అన్నయ్య పెళ్లి జరగడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టుకుంటాడు. కానీ శైలు మాత్రం కేశవ మాటతో సీరియస్ అవుతుంది చాలా బాధపడిపోతుంది. అసలు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా మీ అన్నయ్య పెళ్లి జరిగితేనే మనిద్దరి పెళ్లి అన్నావు కదా ఇప్పుడు మీ అన్నయ్య తనంతట తానే పెళ్లికి సిద్ధమైతే నువ్వెందుకు మన పెళ్లి జరగదు అని అంటున్నావ్ అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే నువ్వు మన పెళ్లి జరగదు అని అంటున్నావు అని శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చక్రి మాధవ దగ్గరికి వెళ్లి నువ్వు చాలా బాగున్నవా? నీ ఆరోగ్యం బాగుందా అని తేడాగా అడుగుతాడు. నాకేమైంది రా నేను చాలా బాగున్నాను. ఎందుకలా మాట్లాడుతున్నావు అని చక్రితో మాధవ్ అంటాడు.. కానీ చక్రి ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మొండిగా కూర్చుంటారు. అంటే జయంతి తో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుంటే బెటర్ కదా అని చక్రి జయంతి నెంబరు మాధవ్ ఫోన్లో ఫీడ్ చేస్తాడు. ఇక మహాలక్ష్మి దగ్గరికి వెళ్లిన చక్రిని ఒక ఆట ఆడుకుంటుంది.. మళ్లీ వీళ్లిద్దరు గొడవపడతారు ఇదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఇక తర్వాత మాధవ్ పెళ్లి గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..