E-Paper
Advertisement

Raksha Gowda : గుప్పెడంత మనసు వసుధార మళ్ళీ వచ్చేస్తుంది.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

Raksha Gowda : గుప్పెడంత మనసు వసుధార మళ్ళీ వచ్చేస్తుంది.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..
Advertisement

Raksha Gowda : బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్లలో కన్నడ ముద్దుగుమ్మల ఎంట్రీ కామన్ అయిపోయింది.. ముఖ్యంగా స్టార్ మా లో ఏ సీరియల్ ప్రసారమైన అందులో కచ్చితంగా కర్ణాటక హీరోయిన్ లే ఎక్కువగా కనిపిస్తున్నారు. తెలుగులో మంచి టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నా సరే కన్నడ భామలపై ఫోకస్ పెట్టారు తెలుగు డైరెక్టర్లు.. కొత్త సీరియల్స్ తో పాటుగా పాత సీరియల్లో కూడా కన్నడ హీరోయిన్లను దింపుతున్నారు.. గతంలో స్టార్ మా లో సూపర్ హిట్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధార మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం వసూ ఎంట్రీ తో మరో ట్విస్ట్ ఎదురయింది.. మరి ఆ సీరియల్ పేరేంటి? ఆ స్టోరీ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

చిన్ని సీరియల్ తో ఎంట్రీ..

ఈమధ్య స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో చిన్ని సీరియల్ కూడా ఒకటి.. చిన్ని సీరియల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆడియన్స్‌కి అసలు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ సీరియల్ మొదట్లో బాగుండేది. కానీ ఈమధ్య కొన్ని మార్పులు చేయడంతో ఆ సీరియలు కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటికే ఇందులో ఎంతో మంది హీరోయిన్లను మార్చినట్లు తెలుస్తుంది.. ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ ని ఎంట్రీ ఇప్పించినట్లు తెలుస్తుంది.. ఫేస్ సర్జరీ జరిగిన తర్వాత హీరోయిన్ ముఖము వసధారలాగా మారిపోయిందని కవర్ చేసారు.. అంటే ఈ సీరియల్ లో రక్ష గౌడ హీరోయిన్గా నటిస్తుంది అని అర్థం.. మొత్తానికి యూత్ క్రష్ గా మారిన రక్ష గోడ మరోసారి మరో సీరియల్ తో రావడంతో బుల్లితెర ఆడియన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

Advertisement

Also Read :ఐదుగురితో బ్రేకప్.. కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యను..

స్టార్ మాలో రక్షా రెండో సీరియల్.. 

గతంలో స్టార్ మా లో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ లో స్టూడెంట్ పాత్రలో నటించిన వసుధార తనదైన స్టైల్ లో నటనతో తెలుగు ఆడియోస్ కి బాగా దగ్గరయింది.. ఆ సీరియల్ ద్వారా ఆమె క్రేజ్ కూడా పెరిగింది.. మొదటి సీరియల్ అయినా కూడా అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ సీరియల్ కి సీక్వెల్ గా మరో సీరియల్ రాబోతుంది అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటివరకు మాత్రం దాని గురించి ఎక్కడ మరోసారి ప్రస్తావన రాలేదు. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్ లో ఆమె నటించడంతో ఇక ఈ సీరియల్ ఆమె నటించబోతున్న కొత్త సీరియల్ ఏమో అని నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి స్టార్ మా ఛానల్ లోనే ఆమె రెండో సీరియల్ స్టార్ట్ అవడం విశేషం. ఇకముందు ఈ అమ్మడు ఎలాంటి సీరియల్లలో నటిస్తుందో చూడాలి. ఇక రక్షగౌడ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్లకు మతిపోగొట్టేలా ఉంటాయి.

Advertisement

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×