E-Paper
Advertisement

Sivajyothi : వివాదంలో శివజ్యోతి.. తిరుపతి ప్రసాదంపై కామెంట్స్.. హిందూ సంఘాలు ఫైర్..

Sivajyothi : వివాదంలో శివజ్యోతి.. తిరుపతి ప్రసాదంపై కామెంట్స్.. హిందూ సంఘాలు ఫైర్..
Advertisement

Sivajyothi : ఒకప్పుడు టీవీ షాలతో బిజీగా ఉన్న శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. తీన్మార్ సావిత్రిగా అందరి మనసులు దోచుకుంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఈమె చెప్పే వార్తలు.. బిత్తిరి సత్తితో చెప్పే ముచ్చట్లకి ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అలా పాపులర్ అయ్యిన ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా కనిపించలేదు. స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తూ వస్తుంది. ఈమధ్య శివ జ్యోతి నిత్యం ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఈమె చిక్కుకుంది.. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం పై కామెంట్స్ చేసింది.. ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసినా హిందువులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం కూడా బుద్ధి లేకుండా ప్రసాదం ను అవమానించేలా మాట్లాడిందంటూ మండిపడుతున్నారు. అస్సలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతి..

తీన్మార్ యాంకర్ శివ జ్యోతి ఈ మధ్య నిత్యం ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. ఇప్పటికే ఆమె చాలామందిని అవమానించింది అంటూ గతంలో వార్తలు కూడా వినిపించాయి.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ తన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్న శివ జ్యోతి ఓ వీడియోని షేర్ చేసింది.. ఆ వీడియోని చూసిన హిందువులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం క్యూలో ఉన్నప్పుడు వీడియోను రికార్డు చేసినట్లు కనిపిస్తుంది. తన ఫ్రెండ్ సోని అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాదం తీసుకున్నాడు. దాన్ని వీడియో రికార్డు చేసింది. సోనీ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు అంటూ కామెంట్లు చేసింది.. ఆ వీడియోను తన అకౌంట్ లో పోస్ట్ చేసింది.. అదే ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని చూసిన వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. కొంచెం కూడా బుద్ధి లేదా దేవుడి అన్న ప్రసాదం అంటే అంత చులకన అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే పలువురు ఆమెపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఈ ఘటనపై శివ జ్యోతి ఎలా స్పందిస్తారో చూడాలి..

Advertisement

Also Read :దేవుడే లేడు అనేవాళ్ళు రాక్షసులు..మనుషులే కాదు.. రాజమౌళికి స్ట్రాంగ్ కౌంటర్..

శివజ్యోతి సీమంతం వేడుక..

యాంకర్ శివ జ్యోతి ఇటీవలే తల్లికాబోతుందని ప్రకటించింది. ఇటీవలే సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా శివ జ్యోతి దంపతులకు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.. త్వరలోనే ఓ పాప ఓ బాబు బాబు పుట్టబోతున్నారు.. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న శివ జ్యోతి ఆ తర్వాత పెద్దగా స్క్రీన్ మీద కనిపించలేదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ వస్తుంది.. అంతే కాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీడియో చేసి షేర్ చేస్తూ వస్తుంది..హీరోయిన్ కన్న ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కొన్నిసార్లు తెలిసో, తెలియక వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇప్పుడు కూడా వివాదంలో చిక్కుకుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి..

Advertisement

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×