Samantha: సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. నటిగా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత (Samantha)తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు. అయితే తిరిగి ఈమె ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్నారు. అలాగే పలు వ్యాపారాలను కూడా ప్రారంభించి దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం (Maa Inti Bangaram)అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సమంత నిర్మాణంలోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా తన వర్కౌట్స్(Work outs) కి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేశారు. తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఈమె దిగిన ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో పట్ల ఎన్నో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ..”ఎక్కువ వ్యాయామం మంచిది కాదు అంటూ” సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇలా సదరు నెటిజన్ సమంత ఫోటోపై ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడంతో సమంత ఈ కామెంట్ కు స్పందిస్తూ..” మీ సలహా అవసరం అయినప్పుడు అడుగుతాను” అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఆ అభిమాని సమంత మంచి కోసమే చెప్పారు గతంలో కూడా ఈమె ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్లే అనారోగ్య సమస్యలకు గురి అయ్యారని కొంతమంది ఈ కామెంట్లపై స్పందించగా మరి కొంతమంది సమంతకు మద్దతుగా కామెంట్లో చేస్తున్నారు. అయితే మరొక అభిమాని ఏదైనా సినిమాలలో నటించడం కోసమే ఇలా చేస్తున్నారా అంటూ కూడా ప్రశ్న వేయడంతో సమంత షాక్ అవుతున్న ఎమోజిని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా రవితేజ(Raviteja) హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో సమంత నటించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు షూటింగ్ పనులను కూడా జరుపుకోబోతోంది. ఇలా ఈ సినిమాతో పాటు ఈమె రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు. వీటితోపాటు క్లాతింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. అలాగే పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి కూడా సమంత అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా నటిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా సమంత ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Ramgopal Varma: ఐ బొమ్మ రవి పై వర్మ కామెంట్స్.. రాబిన్ హుడ్ రవి అంటూ !