E-Paper
Advertisement

Paripurnanda Swami : దేవుడే లేడు అనేవాళ్ళు రాక్షసులు..మనుషులే కాదు.. రాజమౌళికి స్ట్రాంగ్ కౌంటర్..

Paripurnanda Swami : దేవుడే లేడు అనేవాళ్ళు రాక్షసులు..మనుషులే కాదు.. రాజమౌళికి స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Paripurnanda Swami : దర్శకుధీరుడు రాజమౌళి హనుమంతుడి పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎంత పెద్ద దుమారం రేపాయో అందరికీ తెలుసు.. ఇప్పటికే రాజమౌళి పై పలు ఏరియాలో కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే.. హిందూ సంఘాలు హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ఆయన పై కేసులు పెట్టారు.. రాజమౌళికి సీని ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ పెరుగుతుంది. అటు హిందూ దేవుళ్లను ఆరాధించే ప్రముఖులు మాత్రం ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. తాజాగా ప్రముఖ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి కూడా రాజమౌళి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజమౌళి లాంటి వాళ్లు చేసేది తప్పు అంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం..

రాజమౌళికి పరిపూర్ణానంద స్వామి స్ట్రాంగ్ కౌంటర్..

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ చాలా హైలైట్ గా నిలిచింది.. గతంలో ఎన్నడు లేని విధంగా, ఏ సినిమాకు జరగని విధంగా భారీ ఎత్తున ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర యూనిట్.. టైటిల్ ని అనౌన్స్ చేసిన తర్వాత రాజమౌళి మాట్లాడుతూ హనుమంతుడి పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రీయ వానర సంఘ సభ్యులు ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ మండిపడుతూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.. దాంతోపాటుగా మరో రెండు, మూడు కేసులు రాజమౌళి పై నమోదయ్యాయి.. తాజాగా ప్రముఖ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి రాజమౌళి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ దేవుడు లేడు అనే వాళ్ళు రాక్షసులు… మనకు కక్కు వస్తే మొహం పైకెత్తి కక్కితే అది మన మీదే పడుతుంది. దేవుడి మీద సినిమాలు చేస్తూ దేవుడు లేడు అనడం తప్పు అన్నట్లుగా ఇండైరెక్టుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. అలాంటి వాళ్ళని మనుషులు అనరు రాక్షసులు అంటారు అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన మాట్లాడిన మాటలు రాజమౌళికి స్ట్రాంగ్ కౌంటర్ అని నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. రాజమౌళి ఈ వీడియో పై ఎలా స్పందిస్తారో చూడాలి..

Advertisement

Also Read :కమల్ దెబ్బకు పల్లవికి షాక్.. మీనాక్షికి కన్నీళ్లు..అవనికి గుడ్ న్యూస్..

రాజమౌళి ఏం అన్నాడంటే..? 

మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వారణాసి రాబోతుంది. భారీ బడ్జెట్ తో పాటు భారీ కథనంతో దొరికేకుతున్న ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందని మహేష్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో రాజమౌళి ట్రాక్ రికార్డు అలా ఉంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఇక టైటిల్ ని అనౌన్స్ చేసిన తర్వాత సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడు ఎప్పుడు చూస్తామని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. టైటిల్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. అని అనడం తో పాటుగా.. మా ఆవిడ హనుమంతుడిని నమ్ముతుంది కానీ నాకు ఆవిడ అలా చేయడం చాలా కోపంగా అనిపిస్తుంది అని ఆయన అనడంతో హిందువులు, వానర సంఘం సభ్యులు మా మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. మరి ఇప్పటికైనా రాజమౌళి స్పందించి క్లారిటీ ఇస్తారా? లేదా క్షమాపణలు చెప్తారా? అన్నది ఆసక్తిగా మారింది..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×