E-Paper
Advertisement

Illu illaalu pillalu Serial : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ నటీనటులు.. ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు..?

Illu illaalu pillalu Serial : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ నటీనటులు.. ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు..?
Advertisement

Illu illaalu pillalu Serial : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్స్ ఎన్నో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఒక్కో సీరియల్ ఒక్కో డిఫరెంట్ స్టోరీ తో రావడంతో ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్ చూసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్ ను జనాలు ఎగబడి మరీ చూస్తున్నారు.. అలాంటి సీరియస్లలో ముందు వరుసలో కార్తీకదీపం ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతుంది. ఈ సీరియల్ కొద్ది రోజుల క్రితమే ప్రసారం అయినా కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటుల గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు.. మనం ఇప్పుడు ఇందులో నటిస్తున్న మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ యాక్టర్స్ వీళ్లే.. 

మధ్యతరగతి కుటుంబంలో ఓ తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే స్టోరీ తో ఈ సీరియల్ వచ్చింది. తన పిల్లలు ఎప్పటికీ తన మాటను కాదనకుండా ఉండడంతో పాటుగా భవిష్యత్తులో ముందుకు సాగాలని ఎన్నో కలలు కన్నె తండ్రి, కొడుకుల అనుబందాన్ని ఎంతోచక్కగా చూపించారు.. ఇందులో నటించిన వారి విషయానికొస్తే..

రామరాజు.. 

Advertisement

బుల్లితెర హీరో ఈటీవీ ప్రభాకర్ ఈ సీరియల్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటించాడు. ఆయన పాత్ర పేరే రామరాజు. ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఈటీవీలో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసుల్లో నటుడుగా మంచి ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలు చేసి మళ్లీ సీరియల్స్లలోకి రీఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

వేదవతి.. 

ఈ సీరియల్ లో వేదవతి పాత్రలో నటించింది సినీ నటి ఆమని.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన జోడి కట్టిన ఈమె ప్రస్తుతం సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సీరియల్లో రామరాజు భార్యగా ఈమె నటిస్తుంది..

నర్మదా.. 

Advertisement

ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ లో రామరాజు రెండవ కోడలు పాత్రలో నర్మదా నటించింది. ఆమె అసలు పేరు అన్షు రెడ్డి.. బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్షు.. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సాగర్.. 

ఈ సీరియల్లో రామరాజు రెండు కొడుకు పాత్రలో సాగర్ నటించారు. సాగర్ అసలు పేరు రపీక్ష.. ఈయన కూడా తెలుగులో ఎన్నో సీరియల్స్ నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 శ్రీవల్లి.. 

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు ఇంటి పెద్ద కోడలు పాత్రలో శ్రీవల్లి నటించిన. ఇంటి పెద్దగా పెత్తనం చెలాయించాలని కోరికతో అందరినీ ఇరికేస్తూ తాను మాత్రం మంచిది అని అనిపించుకుంటూ వస్తుంది. ఈ పాత్రలో నటించింది త్రివేణి యాదవ్.. ఈమె గతంలో తెలుగులో అనేక సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 చందు.. 

ఈ సీరియల్లో రామరాజు పెద్ద కొడుకు పాత్రలో చందు నటించారు. చందు అసలు పేరు ప్రశాంత్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో ఈయన నటించారు..

ధీరజ్…

రామరాజు మాటని అస్సలు లెక్క చేయనివాడు ధీరజ్.. ఈ సీరియల్లో మూడవ కొడుకునే ధీరజ్. తండ్రి అన్న మాటలకి పౌరుషానికి పోయి తన కాళ్ళ మీద తానే నిలబడాలని ఉద్యోగం చేస్తూ భార్యని పోషించుకుంటాడు. ఈ పాత్రలో నటించిన వ్యక్తి అసలు పేరు నితిన్.

ప్రేమ.. 

రామరాజు మూడవ కోడలు పాత్రలో ప్రేమ నటించింది. ఈమె కన్నడ ముద్దుగుమ్మ. ఈమె అసలు పేరు లావణ్య. ప్రస్తుతం తెలుగులో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తుంది..

ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్లు ఇవే. ఇందులో కేవలం కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం..

ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీ.. 

నా అన్న వాళ్ళు ఎవరూ లేని రామరాజు ప్రేమతో వేదవతికి దగ్గరవుతాడు.. వేదవతి ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రామరాజు తన కుటుంబం తనలాగే ఇబ్బందులు పడకూడదని కష్టపడి పని చేసి పైకి వచ్చాడు.. ఒక్కో పనితో రైస్ మిల్లుకు ఓనర్ గా మారాడు. తన పిల్లలు తన మాట వింటూ రైస్ మిల్ ని చూసుకోవాలని ఆయన కోరిక. కానీ పిల్లలు మాత్రం తండ్రి చెప్పినట్లు వినలేము మాకు నచ్చినట్లు మేము ఉంటామని అనుకుంటారు. కొడుకుల నిర్ణయాలకు ఏకీభవించని తండ్రిగా రామరాజు మిగిలిపోతాడు. ఈ సీరియల్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ది ఒక్కో సన్నివేశం హైలైట్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం రామరాజు తన పిల్లలకు బాధ్యతలను అప్పగించే పనిలో ఉన్నారు. రామరాజు మాటని ఆయన పిల్లలు వింటారా? లేదా అతని మనసుని నొప్పిస్తారా అన్నది సీరియల్ స్టోరీ..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×