Mowgli 2025 Movie Review : రోషన్ కనకాల హీరోగా చేస్తున్న రెండో మూవీకే ఇంత క్రేజ్ రావడానికి కారణం.. నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ డైరెక్షన్ ఒక కారణం అయితే.. పబ్లిక్ స్టార్‌గా పేరున్న బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటించడం మరో కారణం. అలాగే.. బాలయ్య అఖండ 2 మూవీ వచ్చినా.. కేవలం ఒక్క రోజు తేడాతో రిలీజ్ కావడంతో కూడా ఈ సినిమాపై అందరి కళ్లు పడ్డాయి. మరి ఈ మూవీ అంతటి హైప్‌ను అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం…
మురళి కృష్ణ / మోగ్లీ / కిట్టు (రోషన్ కనకాల) SI అవ్వాలని అనుకునే ఓ ఆనాథ. అడవుల్లోనే ఉంటూ.. ప్రభాస్ బంటి (హర్ష) తో కలిసి సినిమా షూటింగ్స్‌కి చేసే కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఓ సారి ఓ సినిమా షూటింగ్ బృందం అడవుల్లోకి వస్తుంది. అందులో జాస్మిన్ (సాక్షి మడోల్కర్) సైడ్ డ్యాన్సర్. మూగ, చెవుడు అయిన జాస్మిన్‌ను మోగ్లీ ఇష్టపడుతాడు. ఓ కారణంతో జాస్మిన్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అలాంటి టైంలో క్రిష్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) ఎలాగైనా.. జాస్మిన్‌ను వాడుకోవాలని చూస్తాడు. ఇలాంటి సందర్భంలో జాస్మిన్‌ను మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? దానికి ప్రభాస్ బంటి ఎలా హెల్ప్ చేశాడు? చివరికి మోగ్లీ – జాస్మిన్ ప్రేమ గెలిచిందా? ఈ కథకు కర్మ సిద్ధాంతానికి ఉన్న లింక్ ఏంటి అనేది సినిమాలో డైరెక్టర్ సందీప్ రాజ్ చూపించాడు.
సందీప్ రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన కలర్ ఫోటో సినిమా చూసే ఉంటారు కదా.. అచ్చం అలాంటి కథతోనే.. కొన్ని మార్పులు చేసి ఈ మౌగ్లీ సినిమా చేశాడు. అయితే, దాంట్లో కర్మ సిద్దాంతం అనే ఒక్క దాన్ని జోడించి… ఓ వర్గం ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ కలర్ ఫోటోలో హీరో – హీరోయిన్ మధ్య జెన్యూన్ లవ్ ఉంటుంది. ఇక్కడ మౌగ్లీలో అదే ఉంటుంది. అక్కడ పోలీస్ పాత్రలో సునీల్ ఉండి.. వారి లవ్‌ను డిస్ట్రర్బ్ చేస్తాడు. ఇక్కడ పోలీస్ పాత్రలో బండి సరోజ్ కుమార్ కూడా అదే చేస్తాడు. అయితే కొంచెం మార్పులు చేశాడు.
మోగ్లీ సినిమా చూస్తున్నంత సేపు.. ఒక కలర్ ఫోటో అనే కాదు.. జయం, వాన లాంటి సినిమాలు కూడా మన కళ్ల ముందు అలా వచ్చి వెళ్తాయి. దీంతో పాటు పాత్రలను డైరెక్ట్ పరిచయం చేశాడు. కానీ, వాటిని సరిగ్గా డీల్ చేయలేదు. హీరో పాత్ర చూడటానికి బక్కపలచగా ఉండి… అతి బలమైన వాళ్లను కూడా ఈజీగా కొట్టేస్తాడు. అది కాస్త కన్వీన్సింగ్ ఉండదు. టెక్నిక్స్ వాడి కొట్టినట్టు చూపిస్తే కవర్ అయ్యేదేమో. హీరోయిన్ చెవిటి, మూగ పెట్టాడు. జెన్యూన్ లవ్ అని సింబాలిక్‌గా చెప్పడానికి అలా పెట్టినా.. కథకు అది ఎంత వరకు యూజ్ అయిందో అర్థం కాలేదు. ఇక బండి సరోజ్ కుమార్ పాత్రకు విలనీజాన్ని టూ మచ్‌గా ఉంది. ఏదైనా ఓ స్టేజ్ వరకు పర్లేదు. అది దాటితే చిరకు వస్తుంది. అలాంటిదే సరోజ్ పాత్రకు జరిగింది.
ఇక కథ చాలా ఓల్డ్ స్టైల్‌లో ఉన్నా.. కథనం విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నాడా అంటే.. అదీ కనిపించదు. ఫస్టాఫ్ మొత్తం అలా సాగిపోతుందే తప్పా… చూడాలనే అనిపించే సీన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇంటర్వెల్ పర్లేదు.
ఇంటర్వెల్ తర్వాత.. కాస్త స్పీడ్ పెంచినట్టు అనిపించినా… దాన్ని కంటీన్యూ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. అయితే, ఫ్రెండ్షిప్ బాండింగ్ విషయంలో ఎమోషన్‌ను కనెక్ట్ చేయడం వరకు పర్లేదు. కానీ, ఆ వెంటనే హర్ష – సరోజ్ మధ్య వచ్చే సీన్ మళ్లీ ఎందుకో కనెక్ట్ అవ్వదు. అలాగే క్లైమాక్స్ డిఫరెంట్ అని చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. కానీ, అది అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అయితే.. ఆ క్లైమాక్స్ ఆధ్యాత్మికతగా చూపించడం వల్ల కొంత మంది కన్వీన్స్ అవ్వొచ్చు.
ఇక ఫర్పామెన్స్ గురించి అంటే.. రోషన్ కనకాల ది బెస్ట్ ఇచ్చాడు. చెవిటి, మూగ పాత్రలో నటించిన సాక్షి మడోల్కర్‌కి మంచి మార్కులే పడుతాయి. బండి సరోజ్ యాక్టింగ్ బాగున్నా… ఆ అతి వల్ల చిరాకు తెప్పిస్తుంది. హర్ష కూడా సెటిల్డ్ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కృష్ణ భగవాన్ సినిమా ఎంట్రీలో ఓ సారి.. ఎండ్ కార్డ్ పడేసారి ఓ సారి కనిపించాడు. మరింత వాడుకుంటే కాస్త కామెడీ పండేది.
కాల భైరవ మ్యూజిక్ గురించి అంటే.. పెద్దగా మార్క్ అయితే ఏం లేదు. జస్ట్ పర్లేదు. కెమెరా పనితనం మాత్రం అద్బుతంగా ఉంది. ఎడిటింగ్‌కి ఇంకాస్త పని పడాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు.
హీరో & హీరోయిన్ & విలన్ ఫర్ఫామెన్స్
సెకండాఫ్‌లో కొంత వరకు
కెమెరా
ఫస్టాఫ్
పాత కథ, కథనం
మ్యూజిక్
ఎడిటింగ్
మొత్తంగా… మోగ్లీ ప్రేమకథ.. ఆమె మౌనం.. వీడి మారణహోమం!… మొత్తంగా ప్రేక్షకుడికి సహన పరీక్ష.