E-Paper
Advertisement

గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
Advertisement

Illu Illalu Pillalu Prema: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు( Illu Illalu Pillalu) సీరియల్ కూడా ఒకటి. ప్రముఖ నటుడు ప్రభాకర్ ,ఆమని ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పలువురు నటీనటులు కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రేమ(Prema) ధీరజ్ (Dheeraj)జంటకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే తాజాగా ఈ సీరియల్ లో ప్రేమ పాత్రలో నటిస్తున్న నటి లావణ్యకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకుంటున్న ప్రేమ..

ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ నుంచి లావణ్య తప్పుకోబోతున్నట్టు సమాచారం. లావణ్య (Lavanya) నటిస్తున్న ప్రేమ పాత్ర ఈ సీరియల్ లో చాలా కీలకంగా ఉండబోతోంది. తన పాత్రకు కూడా చాలా మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకోబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ప్రేమ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏమిటి? ఈమెకు ఏదైనా మరో మంచి ప్రాజెక్టులో అవకాశం వచ్చిందా? అని అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

తల్లి కాబోతున్న నటి లావణ్య..

Advertisement

ఇకపోతే ఈ సీరియల్ నుంచి ప్రేమ అలియాస్ లావణ్య తప్పుకోవడానికి కారణం లేకపోలేదు ఈమెకు ఇదివరకే పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ప్రేమ తల్లి కాబోతున్నారని, ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్(Pregnant) అవడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు లావణ్య తల్లి కాబోతున్న విషయాన్ని ఎక్కడ అభిమానులతో పంచుకోలేదు కానీ ఈ వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. ప్రేమ తల్లి కాబోతున్న విషయం తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియచేయగా, ఇకపై సీరియల్స్ లో ప్రేమ కనిపించని నేపథ్యంలో కాస్త విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు.

శత్రువులుగా ప్రేమ, ధీరజ్..

Advertisement

మరి ప్రేమ తల్లి కాబోతుంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ విషయంపై ఆమె స్పందించాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రేమ ధీరజ్ జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శత్రువులుగా ఉన్న వీరిద్దరూ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకుని ఓకే ఇంట్లో నిత్యం గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రేమ ధీరజ్ మధ్య ప్రేమ చిగురిస్తోంది. ఇలా వీరిద్దరి మధ్య క్యూట్ ప్రేమ కథ మొదలైన సమయంలో ప్రేమ పాత్ర నుంచి లావణ్య తప్పుకుంటున్నారనే విషయం తెలిసిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాత్ర నుంచి లావణ్య తప్పకుంటే ప్రేమ పాత్రలో ఎవరు నటిస్తారు? ఏంటీ? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి పాన్ ఇండియా స్టార్… మహాకాళిలో ప్రభాస్ ?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×