E-Paper
Advertisement

జులై లో పుట్టారా..? మీకు 28 ఏండ్లు వచ్చాక ఏం జరుగుతుందో తెలుసా

జులై లో పుట్టారా..? మీకు 28 ఏండ్లు వచ్చాక ఏం జరుగుతుందో తెలుసా
Advertisement

Born in July: జులై నెలలో పుట్టారా..? అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..? మీరు ఏ రంగంలో స్థిర పడతారో తెలుసా..?అసలు మీకు 28 ఏండ్లు వచ్చాక మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా…? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం  జూలై నెలలో జన్మించిన వ్యక్తులు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారట. వీరిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. వీరి జీవితం, అదృష్టం మరియు వృత్తి పరమైన అంశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వ్యక్తిత్వం మరియు లక్షణాలు: జులై నెలలో పుట్టిన వారు చాలా సున్నిత మనస్తత్వం కలవారట.  వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారట. ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకునే వ్యక్తితం వీరికి ఉంటుందట. కుటుంబ బాంధవ్యాలు అంటే వీరికి ఎంతో ప్రాణమట. అయితే వీరికి ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుందట. బయటకు చాలా మృదువుగా కనిపించినా, లోపల చాలా దృఢంగా ఉంటారట. అబద్ధాలను అస్సలు సహించలేరట. వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువే ఉంటుందట. ఎవరైనా చేసిన సహాయాన్ని లేదా అపకారాన్ని అంత త్వరగా మర్చిపోరట. వీరు తమకు ఇష్టమైన వారిని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారట.

అదృష్టం ఏ వయసులో కలిసి వస్తుంది?: జూలైలో పుట్టిన వారికి అదృష్టం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుందట. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం వీరికి 24 నుంచి 28 ఏళ్ల మధ్య వీరి జీవితంలో మొదటి పెద్ద మార్పు లేదా మొదటి విజయాన్ని చూస్తారట. 32 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో అసలైన స్థిరత్వం ఏర్పడుతుందట. ఆర్థికంగా ఎదగడం, సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం 32 ఏళ్ల వయసులో ఎక్కువగా ఉంటుందట. వీరికి గోల్డెన్ పీరియడ్ అనేది 35 నుండి 45 ఏళ్ల మధ్య కాలం ఉంటుందట. ఆ టైంలో  వీరు ఏం చేసినా కలిసి వస్తుందట.

Advertisement

ఏ రంగాలు కలిసి వస్తాయి?: జులై నెలలో పుట్టిన వారికి సృజనాత్మకత, సేవా గుణం ఉండటం వల్ల అదే కొవకు చెందిన రంగాలు కలిసి వస్తాయట. ముఖ్యంగా కళలు, మీడియా, నటన, రచన, పెయింటింగ్, సంగీతం వంటి రంగాల్లో వీరు అద్భుతాలు చేయగలరట. ఇతరులను రక్షించే గుణం ఉండటం వల్ల డాక్టర్లుగా, నర్సులుగా లేదా సైకాలజిస్టులుగా మంచి పేరు తెచ్చుకుంటారట. విజ్ఞానాన్ని పంచడంలో వీరు దిట్ట. ప్రొఫెసర్లుగా లేదా మోటివేషనల్ స్పీకర్లుగా రాణిస్తారట. ఇంకా హోటల్ బిజినెస్, కేటరింగ్ లేదా ఫుడ్ ఇండస్ట్రీ వీరికి బాగా కలిసి వస్తుందట. వీరికి ఎన్జీవోలు (NGOs) లేదా రాజకీయాల్లో ప్రజా సేవకు సంబంధించిన పదవులు దక్కే అవకాశం ఉంటుందట.

సూచనలు, పరిహారాలు: వీరికి అదృష్ట రంగులు తెలుపు, సిల్వర్, లేత నీలం, అదృష్ట సంఖ్యలు 2, 7, 9. వీరు అప్పుడప్పుడు కోపం, అప్పుడప్పుడు బాధ కి లోనవుతుంటారట. అందుకోసం  ప్రతిరోజూ ధ్యానం (Meditation) చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందట. సోమవారం రోజు శివుడిని ఆరాధించడం వీరికి చాలా మంచిదట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మే నెలలో పుట్టారా..? మీకు ప్రేమ విషయంలో అదే జరుగుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×