Illu-illalu-pillalu-today-episode-june Illalu Pillalu Today Episode April 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. వల్లి ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ టు ఫేక్ అని ప్రిన్సిపల్ అంటున్నాడు. అందులో నిజం ఎంత ఉందో నాకు అర్థం కావడం లేదు అని చందు అంటాడు. ఆ సర్టిఫికెట్ల గురించి మాకు ఎప్పుడో తెలుసు బాబు గారు మీకే తెలియాలని అలా చేసాము అని వాళ్ళ అంటారు. ఇప్పుడు మళ్లీ అక్క స్కూల్కి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటుంది. మీరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి చూడండి అక్కడే ఉంటుంది అని చందు కి నర్మదా చెప్పగానే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్న ప్రేమతో తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది అది చూసిన చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తర్వాత చందు ఫోన్ చేసి వల్లిని అడగ్గానే.. నేను ఇక్కడే స్కూల్లో ఉన్న బావ అని కవరింగ్ చేస్తుంది కానీ చందు కి అడ్డంగా దొరికిపోతుంది. స్కూల్ కి వెళ్లి నీ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి జాబ్ మానేయద్దు పదా అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే మళ్లీ నీ సర్టిఫికెట్ తీసుకురా అని ఎంత చెప్తున్నా సరే వినకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది.. చందు వల్లి ఎంత చెప్పినా వినడు. ప్రేమ ధీరజ్ కు ఎంత దగ్గర వాళ్ళని ప్రయత్నించినా కూడా తను మాత్రం నన్ను మార్చే ప్రయత్నం చేయలేవు అంటూ దూరం పెట్టేస్తాడు.. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అల్లుడు కూతురిని ఎంత బాధ పెడుతున్నాడో అని భాగ్యం ఆనందరావు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు.. ఆ తర్వాత అందరూ కలిసి రామరాజు విషయం తెలిసిపోయింది అని అనగానే వాళ్ళిద్దరూ ఎక్కడ చంపేస్తారు అని భయపడి కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతారు. తర్వాత విషయం తెలియదు అని తెలుసుకొని ఇద్దరు కూడా 10 లక్షల డబ్బులు గురించి మాట్లాడతారు.. ఇక మొత్తానికి నర్మదా ప్రేమలో దెబ్బకి ఆనంద్ రావు భాగ్యం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు.. ఇక రామరాజు కొబ్బరికాయలు వలుస్తూ ఉండగా వేదవతి చెమట తుడుస్తూ ఉంటుంది వీరిద్దరి రొమాంటిక్ సీన్ ఎపిసోడ్కి హైలైట్ గా మారుతుంది.. ఇక ప్రేమ ధీరజులు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. వీరిద్దరిని ఎలాగైనా కలపాలి అని వేదవతి ప్రయత్నాలు చేస్తుంది..
కంట్లో నలక పోతే ఎంత హాయిగా ఉంటుందో ఇప్పుడు మనసులోని అపార్ధాలు తొలగిపోతే అంతే హాయిగా ఉంటుంది కదా అని ప్రేమ అంటుంది.. కానీ ప్రేమ మాటకి ధీరజ్ కంట్లో నలకపోతే హాయిగా ఉంటుంది. అలాగే మనసులోని బాధ పోవాలంటే ఆ వ్యక్తిని దూరం చేయాలి అని అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంతగా నేను ప్రయత్నాలు చేసినా సరే ధీరజ్ నాకు దగ్గర ఎలా కనిపించడం లేదు అని బాధ పడిపోతుంది. ఇక రాత్రి అవ్వగానే శ్రీవల్లి నీ ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒక చోటికి తీసుకొని వెళ్తారు.. నీ డైలాగులతో ఎవరికి నిద్ర లేకుండా చేశావు కదా… ఈ రాత్రి నువ్వు నిద్రపోకుండా ఉండాలి అదే నీకు శిక్ష అని శ్రీవల్లితో అంటారు. మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని శ్రీవల్లి అంటుంది.
ఆ మాట అన్నా రెండు మూడు నిమిషాలకే శ్రీవల్లి కునుకు పాటలు పడుతుంది.. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటారు. శ్రీవల్లి మాత్రం వాళ్ళ దెబ్బలకి మైండ్ బ్లాక్ ఎలా ఫీల్ అవుతుంది.. ఇక నేను నిద్రపోకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని రెండు పుల్లని తీసుకొని వాటిని కళ్ళ మీద పెట్టుకుంటుంది.. అది చూసి నన్ను నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు.. ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అక్కడే నిద్రపోతారు.. మంచి సమయమని శ్రీవల్లి మాస్టర్ ప్లాన్ చేస్తుంది..
ఇదే మంచి సమయం ప్రేమ దగ్గర ఉన్న ఆ ఫోన్ నొక్కేసి నా వాయిస్ ని డిలీట్ చేసేయాలి అని అనుకుంటుంది.. వాటి వల్లే కదా నన్ను అడ్డుపెట్టుకొని ఆడుకుంటున్నారు.. ఇంట్లో నుంచి నన్ను పంపేయడం అంత సులువు కాదు అని ఆ ఫోన్ ని కొట్టేస్తుంది శ్రీవల్లి.. ఫోన్ తన చేతికి రావడంతో శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. మొత్తానికి తన అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ వీడియోలని ఆడియోని డిలీట్ చేసేస్తుంది.. ఇక తిరుపతి ఉదయం లేవగానే అందరు పెళ్లిలకి తోరణాలు కట్టడమే నా బతుకు పనైపోయింది నా పెళ్ళికి ఎవరి తోరణాలు కడతారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ధీర చెప్పిన మాటలు విని తిరుపతి ఒకసారిగా షాక్ అయిపోతాడు..
ప్రేమ కంగారుపడుతూ నర్మద దగ్గరికి వస్తుంది. ఇక ఆ వాయిస్ నోటు డిలీట్ అయిపోయింది. నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ ప్రేమా ఎలా డిలీట్ అయిపోయింది ఏం పని చేశావు నువ్వు అని నర్మదా అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వల్లి చాలా సంతోషంగా కనిపించడం చూసి ఇద్దరు సీరియస్ అవుతారు. అదేంటి చెల్లెలు పండగపూట చిచ్చుబుడ్డి లాగా బాగా వెలిగి పోవాల్సింది ఇలా దుస్తుమని ఆరిపోయారేంటి అని అడుగుతుంది.. ఇంట్లో ఉన్న వాయిస్ రికార్డింగ్ నువ్వే డిలీట్ చేసావ్ కదా అని శ్రీవల్లిని అడుగుతారు.. మీకు తెలిసిపోయిందా మీరు కనిపెట్టేసినందుకు నాకు బాగా సిగ్గేస్తుంది అని అంటుంది. ఆ వాయిస్ రికార్డ్ ని అడ్డుపెట్టుకొని నన్ను ఆడుకున్నారు ఇప్పుడు మీరు ఏం చేసినా నేను భయపడను అని శ్రీవల్లి అంటుంది..
ఆ వాయిస్ నోట్ ని అడ్డుపెట్టుకొని నన్ను ఆడుకున్నారు. ఇప్పుడు మీరు ఉరిమి చూసిన ఏం చేసినా శ్రీవల్లి తగ్గేదే లేదు అంటూ డైలాగులు మీద డైలాగులు కొడుతుంది.. చీపురు పుల్ల లాంటి మీకే అన్ని తెలివితేటలుంటే బొద్దుగా ఉంటాను నాకెన్ని తెలివితేటలు ఉండాలి చెల్లాయిలు అని వల్లి అంటుంది. వాయిస్ రికార్డ్ ని అడ్డుపెట్టుకొని నాతో ఏం ఆడుకుంటారో అని కంగారు పడ్డాను. ఇప్పుడు భయపెట్టండి చూద్దామని వాళ్ళిద్దరితో చాలెంజ్ చేస్తుంది శ్రీవల్లి.. కావాలని వాళ్ళిద్దరి దగ్గర శ్రీవల్లి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఇవన్నీ బండారం ఇవాళ బయట పెడదామని అనుకున్నాము. కానీ ఆ వాయిస్ రికార్డు లేదు ఇప్పుడు ఏం చేయాలి..
Also Read :పల్లవి పై చక్రధర్ సీరియస్.. అవనికి నిజం చెప్పిన చక్రధర్.. గ్రాండ్ గా సీతారాముల కళ్యాణం..
ఆ వాయిస్ రికార్డు కేవలం వల్లిని భయపెట్టడానికి మాత్రమే.. వల్లి ఎంతట వల్లి నిజం చెప్పడానికి వేరే ప్లాన్ వేశాను అని నర్మదా చెప్తూ ఉండగా చందు అక్కడికి వస్తాడు. నర్మదా ఎమ్ ఏ సర్టిఫికేట్ ఫేక్ అని నీకు ఎలా తెలుసు నర్మదా అని అడుగుతాడు.. అంతే కాదు బావగారు అమూల్యను ఆ విశ్వం ని ప్రేమించమని చెప్పింది.. సాగర్ ఉద్యోగం గురించి బయటపడడానికి కారణం ఎవరు అన్నది వల్లికి తెలుసు అని అనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. అయితే ఏంటి నర్మద నువ్వు చెప్పేది అని అనగానే వల్లి అక్కకు తెలుసు బావగారు అని మళ్ళీ మాట మార్చి చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో వల్లి ప్రేమని అడ్డంగా ఇరికిస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..