E-Paper
Advertisement

పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలేంటో తెలుసా..? అసలు జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుంది..?

పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలేంటో తెలుసా..? అసలు జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుంది..?
Advertisement

Marriage: మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి కావడం లేదా..? ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి సెట్‌ అవ్వడం లేదా..? అసలు పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలేంటో తెలుసా..? పెళ్లి కాకపోవడానికి లేదా ఆలస్యం కావడానికి కారణాలేంటో..? జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే..?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పెళ్లి ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. వ్యక్తిగత జాతకంలో దోషాలు ఒక కారణమైతే.. కుటుంబ నేపథ్యం మరో కారణంగా చెప్తున్నారు పండితులు అసలు పెళ్లి ఆలస్యం కావడానికి పూర్తి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జ్యోతిష్య శాస్త్ర కారణాలు (Astrological Reasons):  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో కొన్ని గ్రహాల స్థితి వల్ల వివాహం ఆలస్యం కావచ్చట. అందులో మొదటిది శని ప్రభావమని పండితులు సూచిస్తున్నారు. సప్తమ స్థానం (ఏడవ ఇల్లు) వివాహానికి సంబంధించింది. ఈ స్థానంపై శని ప్రభావం ఉన్నా లేదా శని సప్తమ స్థానంలో ఉన్నా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందట. ఇక రెండో కారణం కుజ దోషం (Manglik Dosha) ఉండటం.  జాతకంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుందట. ఇది సరైన జోడి కుదరడంలో ఆలస్యానికి కారణం కావచ్చని పండితులు చెప్తున్నారు. ఇక మూడో కారణం గురు గ్రహ బలహీనత. స్త్రీల జాతకంలో వివాహానికి కారకుడైన గురు గ్రహం (Jupiter) బలహీనంగా ఉన్నప్పుడు ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా అవి ఫలించవట. ఇక నాలుగో కారణం శుక్రుడి స్థితి. పురుషుల జాతకంలో శుక్రుడు (Venus) వివాహ కారకుడు. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా లేదా పాప గ్రహాలతో కలిసినా అటువంటి పురుసులకు వివాహం ఆలస్యం అవుతుందని పండితులు సూచిస్తున్నారు.

సామాజిక మరియు వ్యక్తిగత కారణాలు: ప్రస్తుత కాలంలో కొన్ని కారణాలు కూడా వివాహం ఆలస్యం కావడానికి కారణం అవుతున్నాయి. చాలా మంది తాము ఆర్థికంగా స్థిరపడాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకోవడం వల్ల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారట. ఇంకా తమ ఆలోచనలకు, అభిరుచులకు తగ్గ తోడు దొరకకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. అలాగే తోబుట్టువుల చదువు లేదా ఇతర కుటుంబ సమస్యల వల్ల కొందరు పెళ్లిని వెనక్కి నెడతున్నారట.

Advertisement

పరిష్కార మార్గాలు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయో లేదో ఒకసారి నిపుణులతో చూపించుకోవడం మంచిదట. అలాగే పెళ్లి ఆలస్యమయ్యే వారు స్వయంవర పార్వతీ యాగం చేయడం లేదా శుక్ర, గురు గ్రహాలకు శాంతి పూజలు చేయించుకోవాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కోటీశ్వరులు అయ్యే ముందు ఆలాంటి కలలే వస్తాయట – ఇంకా స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×