Varanasi: కాశీ వెళ్తున్నారా…? అక్కడికి వెళ్తే ఎక్కడ బస చేయాలో తెలియడం లేదా… వారణిసిలో మన తెలుగు సత్రాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే అలాంటి వారి కోసమే ఈ కథనం. కాశీలో ఉండటానికి ఎన్నో మన తెలుగు సత్రాలు ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాశీలో (వారణాసి) తెలుగు భక్తుల కోసం అనేక సత్రాలు మరియు ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని భోజనం మరియు వసతి సౌకర్యాలను కల్పిస్తాయి. మరికొన్ని వసతి మాత్రమే కల్పింస్తుటాయి. అయితే కాశీ వెళ్లి వసతి కోసం ఇబ్బంది పడకుండా వెళ్లడానికి ముందే అక్కడి తెలుగు సత్రాల గురించి తెలుసుకుని వెళ్లడం ఎంతో ఉత్తమం. అందుకోసమే కాశీలో ఉన్న ప్రముఖ తెలుగు సత్రాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం (Sri Rama Taraka Andhra Ashram): ఇది తెలుగు వారికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆశ్రమం. కేదార్ ఘాట్ సమీపంలో ఉంటుంది. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు అన్న ప్రసాదం లభిస్తుంది. ఏసీ రూమ్స్, నాన్‌ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయట. ఈ ఆశ్రమం అడ్రస్: B-14/92, మానసరోవర్, వారణాసి. ఫోన్‌నెంబర్: 0542-2450418 మీరు కాశీ వెళ్లడానికి పది రోజులు ముందే ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకోవడం ఉత్తమం. ఏదైనా ప్రత్యేక రోజులలో అయితే ఇంకాస్త ముందుగానే బుక్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
శ్రీ కాశీ ఆర్య వైశ్య వాసవి నిత్యాన్న సత్రం (Sri Kasi Arya Vysya Vasavi Satram): ఈ సత్రం ప్రధానంగా ఆర్యవైశ్యులకు కేటాయించబడింది. అర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ సత్రం రెండు చోట్ల ఉందట. పాత భవనం అడ్రస్: 47/195, కెనరా బ్యాంక్ సందు, లక్సా రోడ్, వారణాసి. ఫోన్ నెంబర్: 0542-2400076, 2455087. కొత్త భవనం అడ్రస్: D53/90K, నారాయణ నగర్, గురుబాగ్, వారణాసి. ఫోన్ నెండర్: 0542-2450044. వెబ్‌సైట్: [kasisatram.com](https://www.kasisatram.com) ఈ సత్రంలో కూడా కొద్ది రోజుల ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా నాన్ ఏసీ, ఏపీ రూమ్స్ లభిస్తాయట.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం: ఇది బ్రాహ్మణులకు మాత్రమే వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తుందట. ఇది వారణాసి లోని నారద ఘాట్ సమీపంలో ఉంటుందట. ఈ సత్రంలో కూడా నాన్ ఏసీ, ఏసీ రూమ్స్ లభిస్తాయట. అయితే ఈ సత్రంలో కూడా రూమ్స్ ముందుగానే బుక్ చేసుకుని రావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ సంత్రం ఫోన్ నెంబర్: 8333907785, 8333907790
సైకిల్ స్వామి ఆశ్రమం (Cycle Swamy Ashramam): తెలుగు వారికి సుపరిచితమైన ఆశ్రమం సైకిల్ స్వామి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో కాశీలోనే కాకుండా దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరైనా రూమ్ తీసుకోవచ్చు తక్కువ ఖర్చుతో భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. అయితే రూమ్స్ కావాల్సిన వారు ముందుగానే బుక్ చేసుకోవలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఇది కాశీలోని పాండే హవేలీ ప్రాంతంలో ఉంటుంది. ఆ ఆశ్రమం ఫోన్ నెంబర్: 9795169495, 0542-2450502. ఈ ఆశ్రమంలో కూడా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ లభిస్తాయట.
శ్రీ సాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన ఆంధ్ర సత్రం: ఈ ఆశ్రమంలో కేవలం సౌత్ ఇండియన్స్ కు మాత్రమే రూమ్స్ ఇస్తారు. ఈ ఆశ్రమంలో కూడా నాన్ ఏసీ, ఏసీ రూమ్స్ లభిస్తాయట. ఈ ఆశ్రమం అడ్రస్: నాథు షా D.27/17, బ్రహ్మపురి, వారణాసి. ఫోన్ నెంబర్: 918069266021.
ఇతర ముఖ్యమైన ఆశ్రమాలు:
విశాఖ శ్రీ శారదాపీఠం. ఆశ్రమ ఫోన్ నెంబర్: 0542-2450422.
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర నిత్యాన్నదాన సేవా సమితి. ఇది గురుబాగ్ ప్రాంతంలో ఉంటుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు ఆయా సత్రాలు నిర్వాహకులు అందించినవి మాత్రమే. వివిధ మాద్యమాల ద్వారా సేకరించి బిగ్ టీవీ పాఠకుల కోసం అందించడం జరిగింది. బిగ్ టీవీ సొంతంగా క్రియేటివ్ చేసినవి కాదని పాఠకులు గమనించాలి.