E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యం పై రామారాజుకు అనుమానం.. రచ్చ చేసిన కామాక్షి.. ఆస్తి సాగర్ గొడవ..

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యం పై రామారాజుకు అనుమానం.. రచ్చ చేసిన కామాక్షి.. ఆస్తి సాగర్ గొడవ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 30th:ఆటపాటలతో రామరాజు ఇంట ఫంక్షన్ అంతా సందడిగా కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరికి వారే అన్నట్లుగా ఫ్యామిలీ పార్టీ సాంగ్ కి డాన్స్ వేస్తారు. అటువైపు చక్కగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలో ఆనందరావు నాకు మందు కావాలని తిరుపతిని అడగడంతో తిరుపతి ఆనందరావు ఇద్దరు కలిసి మందు కొడతారు. ధీరజ్ భాస్కర్ నీ పక్కకు తీసుకొని వెళ్లి సంతకం పెట్టించుకునే ప్రయత్నం చేస్తాడు.

అడ్డంగా దొరికిపోయిన భాగ్యం..

అందరూ డాన్సులు వేస్తుండగా శ్రీవల్లి కూడా ఆపుకోలేక డాన్సులు వేయడానికి అక్కడికి వస్తుంది. శ్రీవల్లి డాన్స్ వేస్తుండగా చూసిన వేదవతి నువ్వేంటే ఇలా ఎగురుతున్నావు కడుపులో బిడ్డలకు అంత మంచిది కాదు అని అంటుంది. అవునమ్మా వల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని రామరాజు అంటాడు.. ఇదంతా చూస్తున్న ఆనందరావు సడన్గా అక్కడికి ఎంట్రీ ఇచ్చి బావగారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఏంటి బావగారు ఆ విషయమని రామరాజు అడుగుతుండగా మా అమ్మడు కడుపు అని అనగానే భాగ్యం అక్కడికొచ్చి ఆనందమని బలవంతంగా పక్కకు తీసుకొని వెళ్తుంది.. ఆయన ఏదో చెప్తున్నాడు కదమ్మా చెప్పనివ్వు అని రామరాజు అంటాడు. అయ్యో అడ్డంగా బుక్ అయిపోయాయని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇక కామాక్షికి తన భర్తతో సంతకాలు చేయించుకుంటున్నాడు ధీరజ్ అని చెప్తుంది.. దాంతో కామాక్షి పెద్ద రంగమే చేస్తుంది..

ధీరజ్ కు ఘోర అవమానం..

Advertisement

ఏంట్రా నేను సంతకాలు పెట్టద్దు అని మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను కదా మళ్లీ ఇప్పుడు దొంగతనంగా సంతకాలు పెట్టించుకుంటున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? అని కామాక్షి ధీరజ్ ని అడుగుతుంది. మీకు పెట్టొద్దని ఎంత చెప్పినా కూడా మీరు వినరు ఏంటి అని కామాక్షి ఆ పేపర్లను తీసుకొని రామరాజు దగ్గరికి అరుస్తూ వెళుతుంది. వీడు సొంతంగా కారు కొనుక్కోవాలని అనుకున్నాడు. దానికి మా ఆయన షూరిటీ సంతకాలు కావాలని వచ్చాడు. దానికి నేను వద్దని చెప్పినా ఇప్పుడు ఫంక్షన్ అని పిలిపించి ఇలా దొంగతనంగా సంతకాలు చేయించుకుంటున్నాడు అని కామాక్షి అంటుంది. మా ఆయన్ని దొంగ గింగ అంటే బాగోదు అని ప్రేమ కూడా ధీరజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అమూల్య విషయంలో నువ్వు చేసినప్పుడే నీకు ఏదో ఒకటి చేయాలి కానీ ఇంక నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అని కామాక్షి ధీరజ్ ప్రేమని అవమానించేలా మాట్లాడుతుంది.

నాన్న డబ్బులు నాకొద్దు..

వాడు ఆత్మవిమానం ఉన్నవాడు కాబట్టి వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తానన్న వద్దు అని చిన్న సంతకం కోసం మీ ఆయనను అడిగాడు. ఏదో కోట్లు వాడికి రాసిచ్చినట్లు అంతగా తెగ ఫీల్ అయిపోతున్నావు ఏంటి అని వేదవతి కామాక్షి చెంప పగలగొడుతుంది.. ఫంక్షన్ కని పిలిపించి మమ్మల్ని అవమానిస్తారా ఇంకెప్పుడు ఇంటికి రాను అని కామాక్షి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. నాన్న కష్టార్జితం నాకు రూపాయి కూడా వద్దు. ఆయనలాగే నేను కూడా కష్టపడి పైకి రావాలి అన్నది నా కోరిక అని ధీరజ్అ నగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు.

రామరాజు ఇంట ప్రసాద్ రావు ఆస్తి చిచ్చు..

Advertisement

పక్కనే ఉన్న సాగర్ ని ప్రసాద్ రావు రెచ్చగొడతాడు. అది ఏంట్రా ఆయన ఆస్తి ఏంట్రా ఆయన కొడుకులుగా మనకు ఆస్తిలో వాటా ఉంటుంది. కేవలం రెండు లక్షల కోసం నువ్విలా వాళ్లతో వేళ్ళతో సంతకాలు చేయించుకోవడం ఏంట్రా నీ వాటాన్ని నువ్వు తీసుకొని ఏకంగా కార్ షోరూమ్ నే పెట్టు అని సాగర్ మాట్లాడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు? ఆస్తులు గురించి ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని రామరాజు అంటాడు. తప్పేముంది రామరాజు బావగారు ఏ రోజుకైనా మీరు ఆస్తులు ఇవ్వాల్సిందే కదా.. దాంట్లో మాట్లాడటంలో ఎటువంటి తప్పు లేదు కదా.. అని ప్రసాద్ రావు అనగానే నర్మదా నువ్వెందుకు కల్పించుకుంటున్నావు నాన్న అని అడుగుతుంది..

భాగ్యం పై నర్మదకు అనుమానం..

ఏంటి ఆస్తుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ నాన్న అని నర్మదా అడుగుతుంది. నా తమ్ముడికి సపోర్టుగా నేను నిలిచాను.. నాకు సపోర్ట్ గా మా మామగారు నిలిచారు ఇందులో తప్పేముంది నువ్వేం మాట్లాడద్దు నర్మదా అనేసి సాగర్ అంటాడు. ఇక ఆనంద్ రావు భాగ్యం మెల్లగా గొడవల నుంచి బయటకు వచ్చేస్తారు. రామరాజుకి నిజం చెప్పబోతున్న ఆనంద్ రావు మోహన నీళ్లు కొట్టి లేపుతుంది భాగ్యం.. బాబాయ్ గారు ఏదో చెప్పాలనుకుంటే నువ్వెందుకు ఆపుతున్నావు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అని నర్మదకు అనుమానం మొదలవుతుంది.. మా అమ్మాయి ఫంక్షన్ ఇలా అయిపోయిందని బాధగా ఉందమ్మా అందుకే మేము వెళ్ళిపోతున్నాము అని భాగ్యం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే వెళ్ళిపోతుంది.. నర్మద మాత్రం వీళ్ళిద్దరూ ఏదో చేశారు అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ధీరజ్ ఇంట్లో జరిగిన గొడవకి తానే కారణమని బాధపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: నువ్వు నీ మొగుడిని రెచ్చగొట్టావ్.. బావ నా కాళ్ళు పట్టుకోవాలి.. పుట్టింటికి వెళ్లిన ప్రణతి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×