E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అడ్డంగా బుక్కయిన తిరుపతి.. శ్రీవల్లి పై రివేంజ్.. చందుకు దొరికిపోయిన అమూల్య..

Illu Illalu Pillalu Today Episode: అడ్డంగా బుక్కయిన తిరుపతి.. శ్రీవల్లి పై రివేంజ్.. చందుకు దొరికిపోయిన అమూల్య..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి తలుపు తీయగానే ఎదురుగా నర్మదాప్రేమ కనిపిస్తారు.. పొద్దున్నే లేవగానే వీళ్లకు చిక్కని ఏంట్రా బాబు అనుకుంటుంది శ్రీవల్లి.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా తిరుపతి బాబాయ్ కి నీ ఇంగ్లీష్ మీద డౌట్ ఉందంట అక్క అందుకే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాడు. నువ్వు గడగడ ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడు అని అంటుంది.. శ్రీవల్లి నేను మాట్లాడుతాను ఆగండి అని జానీ జానీ ఎస్ పాపా పాడుతుంది.. ఇదేంటి ఇంగ్లీషులో మాట్లాడమంటే చిన్న పిల్లల రైమ్స్ చెప్తుంది అని వాళ్ళందరూ కూడా అనుకుంటారు.. తర్వాత రోజు విశ్వం ఎలాగైనా సరే అమూల్యను పెళ్లికి ఒప్పించాలని అనుకుంటాడు. దాంతో పార్కుకి వెళ్దామని ఒక లెటర్ ని రాసి పంపిస్తాడు..అది కాస్త ఇల్లంతా చక్కర్లు కొడుతుంది.. మొత్తానికి అందరూ ఒకరికి తెలియకుండా మరొక జంట పార్కుకు వచ్చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మూడు జంటలు ఆ లెటర్ వల్ల ఒకరికి తెలియకుండా మరొకరు పార్క్ కి వస్తారు.. తిరుపతి కూడా తన సౌందర్య లహరి కోసం వెళ్లాలి అనుకొని పార్కుకి వస్తాడు. తిరుపతి నా సౌందర్యలహరి ఎక్కడ ఎక్కడ అంటూ పార్కులో తెగ హడావిడి చేస్తాడు.. విశ్వం ఇలా నువ్వు కట్టుకొని ఉంటే నాకు ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది నీతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నానని అంటాడు.. ముఖానికి ఉన్న చున్నీని అమూల్య తీసేస్తుంది.. ఈ మూడు జంటలు ఇలా పార్కు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ అనుకుంటూనే మాట్లాడుకుంటూ ఉంటారు.. ప్రేమ ధీరజ్ మాత్రం పోట్లాడుకుంటారు.

Advertisement

తిరుపతి నా సౌందర్య లహరి ఎక్కడ ఎక్కడ అంటూ వెతుక్కుంటూ శ్రీవల్లి చందూ దగ్గరికి వస్తాడు. మీకు ఇంట్లో రొమాన్స్ చేయడానికి సరిపోట్లేదా ఇలా పార్క్ కూడా వచ్చారు అని అడుగుతాడు. మాకంటే పెళ్లయింది వచ్చాము మరి నీకు పెళ్లి కాలేదు కదా బాబాయ్ నువ్వు ఎందుకు వచ్చావు అని శ్రీవల్లి అడుగుతుంది. నేను వేరే పర్సనల్ పని మీద వచ్చాను అని తిరుపతి అంటాడు. అలా మూడు జంటల దగ్గరికి వెళ్లిన తిరుపతి షాక్ అవుతాడు. నా సౌందర్యలహరి ఎక్కడుందో వెతుక్కోవాలి వీళ్ళతో నాకేంటి పని అని అనుకుంటాడు.

ఓ మై గాడ్ నా సౌందర్యలహరి ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ ఒక గుబురుగా ఉన్న పొద దగ్గరికి వెళ్తాడు.. అక్కడ అమూల్య లాగా ఫేస్ కనిపించడంతో ఎవరని చూసేందుకు ఆ చెట్టుని పట్టుకుంటాడు. అప్పుడే ఎవరో బాలుతో విసిరి కొట్టడంతో ఎవర్రా నన్ను కొట్టింది అని వెనక్కి తిరిగి చూస్తాడు.. ఆ తర్వాత ఒక అమ్మాయి చున్నీతో కనిపిస్తుంది. సౌందర్యలహరి పాట బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంది. ఆమెను వెతుక్కుంటూ తిరుపతి వెళ్తాడు కానీ మధ్యలోనే ఆమె మాయమైపోతుంది. ఇక మూడు జంటలు కూడా సరదాగా మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చేస్తారు.

Advertisement

చందు శ్రీవల్లిలకు నర్మదా ప్రేమలో కంటపడతారు. చందు ప్రశ్నలకు సాగర్ సెటైర్లకు ఎపిసోడ్ హైలైట్ గా మారుతుంది. మీరు కూడా పార్కు వచ్చారా అని శ్రీవల్లి అడుగుతుంది. ఇక నర్మద కూడా శ్రీవల్లికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజులు కూడా వస్తారు.. మూడు జంటలు కూడా మన మూడు జంటలు ఇక్కడే కలిసాం ఏంటో అని శ్రీవల్లి అనుకుంటుంది.. అటువైపు అమూల్య విశ్వం కనిపించడం చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. మనం ఇక్కడ ఉంటే మావయ్య అత్తయ్య గారికి డౌట్ వస్తుంది తిడతారు మనం వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. కానీ వాళ్ళు పార్క్ వచ్చింది కాసేపు సరదాగా ఉండడానికే కదా మరి హడావిడిగా వెళ్లిపోవడం ఎందుకు అని అంటారు. ఓరి నాయనో వీళ్ళిద్దరూ వీళ్ళ కంటపడితే ఇక సంగతి అంతే అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

Also Read :రోహిణికి క్లాస్ పీకిన శృతి..మీనాను అవమానించిన ప్రభావతి.. కొత్త కారు కొన్న బాలు…

పక్కనే ఉన్న బెలూన్స్ ని తీసుకొని వాళ్ళని కవర్ చేస్తూ ఆడుతున్నట్లు మ్యారేజ్ చేస్తుంది.. ఇక్కడ ఎందుకు మనం అటు వెళ్లి మాట్లాడుకుందాం పదండి అని శ్రీవల్లి అంటుంది. మిగతా ఇద్దరూ వెళ్ళిపోతూ ఉంటే చందు మాత్రం అమూల్య విశ్వంను చూస్తాడు. ఈయన చూసేసారు ఏం అడుగుతాడు ఏం చెప్పాలి అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్లు ఇంటికి వెళ్లి కూడా మళ్ళీ గొడవపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×