E-Paper
Advertisement

Hyderabad Crime: భాగ్యనగరంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 40 తులాల వెండి, ఆపై క్యాష్

Hyderabad Crime:  భాగ్యనగరంలో భారీ చోరీ..  30 తులాల బంగారం,  40 తులాల వెండి, ఆపై క్యాష్
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో నేపాల్ గ్యాంగులు రెచ్చిపోతున్నాయా? ఇటీవల కాలంలో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయా? ఎక్కడ చూసినా నేపాలీలు అధికంగా కనిపిస్తున్నారా? వీరి వల్ల ఇళ్ల దోపిడీలు అధికంగా చోటు చేసుకుంటున్నాయా? తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ సిటీలో చోటు చేసుకుంది.

Advertisement

భాగ్యనగరంలో భారీ చోరీ

Advertisement

హైదరాబాద్ సిటీలో ఈ మధ్యకాలంలో భారీగా దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి వెనుక నేపాలీ గ్యాంగులు ఉన్నట్లు తెలుస్తోంది. మలక్‌పేట్ ఆఫీసర్స్ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా చోరీ జరిగింది. దొంగలు రూ. 50 లక్షల క్యాష్, 30 తులాల బంగారం, 40 తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఈ చోరీ వెనుక నేపాలీ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

దీనిపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులకు, ఆ ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అపార్టుమెంటులోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. చోరీ వెనుక నేపాలీ గ్యాంగ్ ఉన్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించాడు ఇంటి యజమాని.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది. 

30 తులాల బంగారం, 40 తులాల వెండి.. నేపాల్ గ్యాంగ్ పనేనా?

ఇటీవల హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగులు చాలా ఇళ్లలో చోరీలు చేసిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని చాలా అపార్టుమెంట్లలో వారు వాచ్‌మేన్లగా పని చేస్తున్నారు. అంతేకాదు ఇళ్లలో పని మనుషులుగా చేస్తున్నారు. ఇటీవలకాలంలో నేపాలీలు హైదరాబాద్ నగరానికి అధికంగా  వస్తున్నట్లు కొందరు అధికారుల మాట.

తొలుత ఓనర్లతో నమ్మకంగా ఉండడం, ఆ తర్వాత చోరీలకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ సిటీలో ఒక వంతు అపార్టుమెంట్లలో నేపాలీవాళ్లు పని చేస్తున్నట్లు సమాచారం. చాలామంది అపార్టుమెంట్లవాసులు వారినే నియమించుకుంటున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు.

ALSO READ: నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చిబూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

స్థానికులను వాచ్‌మేన్‌గా నియమించుకుంటే రెండు లేదా మూడు నెలలు ఒకసారి ఇంటికి వెళ్లిపోతాడని అంటున్నారు. అందువల్ల నేపాలీలను నియమించుకుంటున్నామని కొందరు చెబుతున్నారు.  వారైతే ఏడాదికి ఒక్కసారి మాత్రమే సొంతూళ్లకు వెళ్తుంటారని అంటున్నారు. పండగల సందర్భంలో ఇళ్లలో చోరీ వెనుక వీరే కారణమని అంటున్నారు. దీనికితోడు బంగారం, వెండి ధరలు మార్కెట్‌లో ఎగిసిపడుతున్నాయి. తులం బంగారం లక్షపైనే పలుకుతోంది. దీంతో దొంగలు వస్తువులపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×