E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామరాజుకు చందు నిజం చెప్తాడా..? అమూల్య దొరికిపోతుందా..? శ్రీవల్లి సర్టిఫికెట్స్ ఫేక్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజుకు చందు నిజం చెప్తాడా..? అమూల్య దొరికిపోతుందా..? శ్రీవల్లి సర్టిఫికెట్స్ ఫేక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. కూల్ డ్రింక్ తాగేసి శ్రీవల్లి అడ్డంగా దొరికిపోతుంది. అది నేను మందు బాటిల్ అనుకున్నాను చెల్లి.. నేను అన్నది  అంతా తూచ్ ఊరికే అన్నాను నన్ను క్షమించేసేయని శ్రీవల్లి ప్రేమని అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం నీకు ఇలా కాదే నీకు ఏదైనా చేస్తేనే అప్పుడు ఉంటుంది అని అంటుంది.. కానీ నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ప్రేమ అనుకుంటుంది.  ముందు ఈ బట్టల నిను ఉతికేసేయని ప్రేమ కండిషన్ పెడుతుంది. అంతో శ్రీవల్లి నువ్వు ఎలా చెప్తే అలానే ఉతికేస్తాను అని అంటుంది. సాగర్ నర్మదని వెతుక్కుంటూ లోపలికి వస్తాడు..

ఏంటి ఇవాళ చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. నర్మదా ఏంటి మల్లెపూలు తీసుకొని వచ్చావా అని అంటుంది.. సైంటిస్ట్ కన్నా గొప్పదానివే అందుకే నువ్వంటే నాకు అంత లవ్వు అని సాగర్ అంటాడు.. ఏంటి తాగొచ్చావా తేడాగా ఉంది అని నర్మదా అడుగుతుంది.. నేనేం తాగి రాలేదు అని అలాగే కుప్పకూలి పడిపోతాడు.. అటు ధీరజ్ తాగేసి లోపలికి వెళ్లి తేడాగా ప్రవర్తిస్తాడు.. తాగిన మత్తులో ప్రేమపై ఉన్న ప్రేమను బయట పెడతాడు. తనకి రాత్రంతా కూడా ఈ రెండు జంటలు రొమాన్స్ తో పెద్ద రప్చే చేస్తారు.. శ్రీవల్లి మాత్రం చందు మౌనంగా ఉన్నాడని బాధపడుతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే చందు అమూల్య విషయం తెలిసి కూడా నేను మా నాన్నకు చెప్పకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను ఎలాగైనా ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పాలి అని అనుకుంటాడు. అయితే అప్పుడే అమూల్య నేను కాలేజీకి వెళ్తున్నాను అని విశ్వం కు హింట్ ఇవ్వడం చూసి షాక్ అవుతాడు.. ఇవాళ ఎలాగైనా సరే నాన్నకు చెప్పాల్సిందేనని చందు ఫిక్స్ అయిపోతాడు. వేదవతిని అమ్మ నాన్న ఎక్కడా అని అడుగుతాడు.. రాత్రి కొంచెం లేట్ అయింది కదరా పేపర్ తెచ్చుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు అని వేదవతి అంటుంది. ఎదురుగా రామరాజు రావడం చూసిన చందు ఎలాగైనా ఈ విషయం చెప్పాలని ముందుకు వెళ్తాడు..

మన ఇంటి పరువు సంబంధించిన విషయం మీ ఒక్కడికే చెప్పాలి అని చందు అంటాడు. ఆ మాట వినగానే రామరాజు ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు.. అవునండి వాడు రాత్రి కూడా ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనుకున్నాడు.. అక్కడి నుంచి వాడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా సరే వాడు వినకుండా నాకు కూడా ఆ విషయం గురించి చెప్పట్లేదు అని వేదవతి అంటుంది.. అమ్మకి కూడా చెప్పని విషయం ఏంట్రా చెప్పు అని అంటాడు. అమూల్య గురించి అని అనగానే ఆ మాట నిద్రలో ఉన్న శ్రీవల్లి విని ఉలిక్కిపడుతుంది.

Advertisement

ఓరి నా మొగుడు రాత్రి చిలకకు చెప్పినట్లు చెప్పాను కానీ ఇప్పుడు మళ్లీ మొదలెట్టేసావా నా కొంప కూల్చేలా ఉన్నావే అని పరుగెత్తుకుంటూ వస్తుంది.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన అమూల్యం తీసుకొని శ్రీవల్లి అదే మావయ్య గారు అక్కడ పోకిరిలు ఉంటారు కదా.. అమూల్యని ఇబ్బంది పెట్టకుండా రోజు కాలేజీలో ఆయనే డ్రాప్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని మీకు చెప్పాలని అనుకున్నాడు అని అంటుంది. మీరు ఒకటేసారి హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఉన్నారే ఇదే విషయం అని చెప్పండి అని శ్రీవల్లి అంటుంది.. ఇప్పుడు వాళ్లకు నిజం చెప్పి వాళ్ళని చంపేస్తారా ఏంటి అని శ్రీవల్లి చందు ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ మాట వినగానే చందు అవును నాన్న అమూల్యని రోజు నేనే కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు.

దానికి రామరాజు నువ్వు చాలా మంచి వాడివి రా ఈ ఇంటి పెద్ద కొడుకు అని నిరూపించుకున్నావు. అలాగే నువ్వు వెళ్లి రోజు అమూల్య నువ్వు కాలేజీలో డ్రాప్ చేసి తీసుకురా అనేసి అంటాడు. ఇక ఒక గండం గడిచింది అని శ్రీవల్లి అమ్మయ్య నిప్పులు కుంపటి మీద నుంచి సీటు కాస్త తప్పుకున్నట్లు ప్రశాంతంగా ఉంది అని లోపలికి వస్తుంది.. అప్పుడే ఎదురుగా వచ్చిన నర్మదా ప్రేమలు నువ్వు మావయ్య గారికి ఇచ్చిన మాటని తప్పేసావు అని అంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ వంశంలోని చివరి వారసుల లాంటి మా మీద మీకు అనుమానమా ఏం మాట తప్పని అంటుంది.

నీ ఎం ఏ సర్టిఫికెట్ గురించి మామయ్యతో చెప్పావు ఇంతవరకు సర్టిఫికెట్ రాలేదు అదేంటక్క అని అడుగుతుంది ప్రేమ.. ఆ సర్టిఫికెట్ రావడానికి కాస్త టైం పడుతున్నట్టు ఉంది అందుకే ఇంకా రాలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇంతకీ సర్టిఫికెట్ రావడానికి ఎక్కువ సమయం పట్టదు కదా నువ్వు ఎం ఏ చదివావా లేదా అని అడుగుతారు.. అదే మాట ఎం ఏ బీభత్సంగా చదివేస్తేను అని శ్రీవల్లి అంటుంది.. అవునమ్మా మరి నీ ఎం ఏ సర్టిఫికెట్ ఏది అని రామరాజు అడుగుతాడు.. వాళ్లు చెప్పినట్లు నాకు కూడా అనుమానం వస్తుంది.. ఓ నిజంగానే ఎంఏ చదివావా లేదా? మరి సర్టిఫికెట్ ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ఇంగ్లీష్ లో మాట్లాడమంటే యా యా అనడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు…

Also Read : పల్లవికి దిమ్మతిరిగే షాక్.. తిరిగి వచ్చిన ఆస్తి.. శ్రీయకు అవని స్ట్రాంగ్ వార్నింగ్..

ఇక నిజంగానే నువ్వు ఎం ఏ చేసావో లేదో చెప్పు అని రామరాజు అడుగుతాడు అప్పుడే భాగ్యం ఆనందరావు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. అమ్మాయి ఎంఏ సర్టిఫికెట్స్ అని రామరాజు చేతికి ఇస్తారు. అయినా తీసుకెళ్లి ప్రేమ చేతిలో పెడతాడు.. అవును మావయ్య ఇవి సర్టిఫికెట్లను మీరు మీకు తెలిసిన ప్రిన్సిపల్ ఒక ఆయన ఉన్నారు కదా ఆయన కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ గురించి అడగండి మీకోసం వెంటనే ఒప్పుకుంటారు అని ప్రేమ సలహా ఇస్తుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి భాగ్యం దొరికిపోతామేమో అని కొత్త నాటకం మొదలుపెడతారు.. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×