E-Paper
Advertisement

Road Accident: హైదరాబాద్ మైలార్దేవ్ పల్లిలో కార్ బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు!

Road Accident: హైదరాబాద్ మైలార్దేవ్ పల్లిలో కార్ బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు!
Advertisement

Road Accident: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన ఒక కారు అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న స్వెటర్ల దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో వేగంగా వచ్చిన కారు దుకాణంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది.

అయితే ఈ ప్రమాదంలో దీపక్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులు ప్రభు మహారాజ్, సత్తునాద్‌లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. మరో రెండు రోజులు కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, కారులోని ముగ్గురు వ్యక్తులను పట్టుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. అయితే, కారులో ఉన్న మిగిలిన ముగ్గురు వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతుడి దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పారిపోయిన మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×