E-Paper
Advertisement

Podarillu Today Episode : తాయారును రెచ్చగొట్టిన గాయత్రి.. నారాయణ దెబ్బకు షాక్.. మహా పై భూషణ్ సీరియస్..

Podarillu Today Episode : తాయారును రెచ్చగొట్టిన గాయత్రి.. నారాయణ దెబ్బకు షాక్.. మహా పై భూషణ్ సీరియస్..
Advertisement

Podarillu Today Episode December 17th: ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తి అయిపోయింది అది గనక ఓకే అయితే నేను మంచి ఇంజనీర్ అవుతాను అని అనుకుంటుంది.. ఈ విషయం ఎలాగైనా నాన్నకు చెప్పి పెళ్లిని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయించాలి అని. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ ఏమైంది అమ్మ ఇంకా ఇలా ఉన్నావు వెళ్లి పడుకోవా అని అడుగుతాడు.. నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అని తన ప్రాజెక్టు గురించి చెప్తుంది. ఆ మాట వినగానే ప్రతాప్ నువ్వు పెళ్లయిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టు అలాంటివి చేసుకోవచ్చు అని అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన లలిత నువ్వు అల్లుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని అంటుంది.. మహా ఎంతగా ఈ పెళ్లి వద్దు అని అంటున్నా సరే వాళ్ళు మాత్రం బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు.. తన పెళ్లి గురించి కలలు కంటున్నా చందుకు ఒక అమ్మాయి కారులో ఎక్కడంతో ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆమె పెళ్లి వద్దు అనగానే షాక్ అవుతాడు. కారుతో భూషణ్ చక్రితో గుద్దడంతో మహా మధ్యలో దూరి చక్రికి సపోర్ట్ చేస్తుంది. భూషణ్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తే సరిపోతుంది అని అంటారు.. భూషణ్ కారు చక్రీ కారును ఢీ కొడుతుంది.. ఏంట్రా ఇడియట్ అసలు రోడ్డు కనిపించట్లేదా నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అని తిడతాడు. చక్రి మాటకు మాట సమాధానం చెప్తాడు.. కారులో ఉన్న మహా ఈ గొడవేంటి అని బయటకు వస్తుంది. చక్రి ఆమెను చూసి నా అదృష్టదేవత ఇక్కడ ఉందా అని సంతోషపడతాడు.. తప్పు మన వైపే ఉంది కాబట్టి మనమే క్షమాపణ చెప్పాలి అని మహా అంటుంది.. ఇండియాలో కొన్ని రూల్స్ ఉంటాయి వాటి ప్రకారమే ఫాలో అవ్వాలని మహా చక్రికి సపోర్ట్ గా మాట్లాడుతుంది. మహా వల్ల గొడవ ఆగిపోతుంది. ఇంటికి మరమ్మతులు చేయాలని నారాయణ కుటుంబం అనుకుంటుంది..

Advertisement

గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ గాయత్రి దగ్గరకొచ్చి మీ బావ వాళ్ళ ఇంటికి మరమ్మతలు చేస్తున్నారంట నీకు తెలియదా ఈ విషయం అని అడుగుతుంది. పోనీలే ఇన్నాళ్లకైనా ఆ బూత్ బంగ్లా కాస్త బాగుపడుతుంది అని అంటుంది. అయితే ఆ ఇంటిని బాగు చేయించేది ఎందుకో తెలుసా నీకు అని గాయత్రిని అడుగుతుంది. మొన్న వెళ్లిన పెళ్లి సంబంధం ఖాయం అయిపోయింది ఇంటిని చూడడానికి వస్తున్నారట అందుకే కాస్త రిపేర్లు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మేస్త్రి కూడా వచ్చేసారట పనులు ప్రారంభిస్తున్నారు అని అనగానే ఆ పెళ్లి సంబంధం ఓకే అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఈ సంబంధం ఎలాగైనా చెడిపోవాలి అని గాయత్రి అంటుంది.

ఆ సంబంధం చెడిపోవాలి అనుకునే బదులు నువ్వే మీ అమ్మకి మీ ప్రేమ గురించి చెప్పొచ్చు కదా అని అంటుంది.. మా అమ్మ నన్ను ఇక చంపేస్తుంది అని గాయత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత తాయారుకు వినిపించేలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు.. ఇద్దరూ కలిసి తాయారుకి అసలు నిజం చెప్పేస్తారు. ఏంటి ఆ ఇంటిని రిపేర్ చేస్తున్నారా ఎలా జరుగుతుంది అసలు కుదరదు కదా అని తాయారు వాళ్ళ అన్నం తీసుకుని అక్కడికి వెళుతుంది.. కారులోంచి బయటకు దిగిన చక్రి ఆ అమ్మాయి తనకి సపోర్ట్ చేస్తున్న విషయాన్ని ఆలోచిస్తూ వస్తాడు.. వీడికి ఏమైంది అని అనుకుంటాడు..

Advertisement

ఇంటికి మరమ్మత్తులు చేస్తే పెళ్లి సంబంధం ఓకే అయిపోతుంది కదా మనము అసలే అన్నయ్యని పెద్ద బిల్డర్ లాగా బిల్డప్ ఇచ్చేసాము అని అంటారు.. నేనేమీ గొప్పలు చెప్పుకోలేదు అన్నయ్యకి పెళ్లి సంబంధం కుదురుతుంది అని చెప్పాను అంతే అని చక్రి అంటాడు. చక్రి కేశవ ఇద్దరూ గొడవకు దిగుతారు. ఆ ఇంటికి మరమ్మతులు చేస్తుంటే తాయారు తన అన్నతో కలిసి వస్తుంది. ఎవరింటికి ఎవరు రిపేరు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది.. కేసు కోర్టులో ఉండగానే మీరు ఇలాంటి పనులు చేయకూడదని మీకు తెలియదా మీ నాన్ననే బుద్ధిగా ఉంటే మీకు అన్ని తెలుసు వచ్చేది అని తాయారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది..

తాయారు మాటలు విన్న నారాయణ కోపంతో రగిలిపోతాడు.. ఎలాగైనా సరే తాయారుకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. మీరు అసలు మనుషులేనా మిమ్మల్ని చంపేసి నా పిల్లలకి పెళ్లి చేస్తాను అని నారాయణ అంటాడు. చంపేస్తాను మీరు ఇంటిని పడేసి కొత్త ఇంటిని కట్టుకొని పెళ్లి చేసుకోండి రా అనేసి అంటాడు. కేసు కోర్టులో ఉండగానే ఇలాంటి పనులు చేయకూడదు అని మీకు తెలియదా? అసలే వీడు తాగుబోతు సచ్చినోడు చెల్లి అని కూడా చూడడు పద వెళ్లిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. కోర్టులో కేసు ఒక కొలిక్కి వచ్చేంత వరకు మేము ఈ ఇంటికి ఎటువంటి మరమ్మతులు చేయమని మాధవ్ మాటిస్తాడు.

ఇంటికొచ్చిన భూషణ్ కోపంతో రగిలిపోతూ ఇంట్లో వస్తువులని పడేస్తూ ఉంటాడు.. నువ్వు పెళ్లికి ముందే ఇంత కోపంగా ఉంటే అమ్మాయిని నీకు ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు అని అంటాడు.. అయితే పెళ్లి కోసం అని నాకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలా, చూసావా ఎలా మాట్లాడిందో అని భూషణ్ మహా పై సీరియస్ అవుతాడు.. చూసావా నువ్వు చేసిన పనికి నేను సారీ చెప్పాలి వెళ్లి సారీ చెప్పు అని ఆది అంటాడు. కానీ నేను సారీ చెప్పను అని మహా అంటుంది. చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది అని ఆది అంటాడు.. నువ్వెందుకు చెప్పాలి నీకేం అవసరం నేనేం తప్పు మాట్లాడలేదు కదా అని మహా అంటుంది. హారిక మనల్ని ఇప్పుడు లోపలికి రమ్మని పిలిచే పరిస్థితి లో కూడా వాళ్ళు లేరు మనమే వెళ్లాలి అని అంటుంది.. లోపలికి వెళ్ళగానే ఆది భూషణ్కి సారీ చెప్తాడు.

Also Read :రామరాజుకు చందు నిజం చెప్తాడా..? అమూల్య దొరికిపోతుందా..? శ్రీవల్లి సర్టిఫికెట్స్ ఫేక్..

నేను తప్పు చేసిన సరే నా భార్యగా నువ్వు రైట్ అని చెప్పాలి అని అంటాడు. ఇక్కడ మీ భార్య ఎవరు అని మహా అడుగుతుంది. భూషణ్ ఏం చెప్పినా దానికి ఆది మాత్రం తను అంతే నువ్వు గారాబంగా పెరిగింది అని అంటాడు. చక్రి మాత్రం పొద్దున చూసిన అమ్మాయిని పదే పదే తలుచుకుంటూ తనలో తానే సిగ్గు పడిపోతూ ఉంటాడు.. కన్నా ఏంటి సిగ్గుపడుతున్నావు అని ఆడుకుంటాడు. ఆ తర్వాత చక్రీకి తన కారు ఓనర్ ఫోన్ చేసి డ్రైవర్ జాబ్ గురించి చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×