E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. శ్రీవల్లి ఇలా ఇరుక్కుందేంటి..? భాగ్యం కు కొత్త టెన్షన్.. సాగర్ కు క్లాస్..

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. శ్రీవల్లి ఇలా ఇరుక్కుందేంటి..? భాగ్యం కు కొత్త టెన్షన్.. సాగర్ కు క్లాస్..

Illu Illalu Pillalu Today Episode December 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే చందు అమూల్య విషయం తెలిసి కూడా నేను మా నాన్నకు చెప్పకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను ఎలాగైనా ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పాలి అని అనుకుంటాడు. అయితే అప్పుడే అమూల్య నేను కాలేజీకి వెళ్తున్నాను అని విశ్వం కు హింట్ ఇవ్వడం చూసి షాక్ అవుతాడు.. ఇవాళ ఎలాగైనా సరే నాన్నకు చెప్పాల్సిందేనని చందు ఫిక్స్ అయిపోతాడు. వేదవతిని అమ్మ నాన్న ఎక్కడా అని అడుగుతాడు.. రాత్రి కొంచెం లేట్ అయింది కదరా పేపర్ తెచ్చుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు అని వేదవతి అంటుంది. ఎదురుగా రామరాజు రావడం చూసిన చందు ఎలాగైనా ఈ విషయం చెప్పాలని ముందుకు వెళ్తాడు.. మన ఇంటి పరువు సంబంధించిన విషయం మీ ఒక్కడికే చెప్పాలి అని చందు అంటాడు. ఇందులో అడ్డుపడిన శ్రీవల్లి ఆ విషయాన్ని చందు చెప్పకుండా ఆపుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి లోపలికి రాగానే నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఇంకా సర్టిఫికెట్లు రాలేదేంటి అని అడుగుతారు.. రామరాజు కూడా అదే విషయాన్ని శ్రీవల్లితో అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లిని ఏంఏ సర్టిఫికెట్ ఎక్కడ అని అడుగుతుంది ప్రేమ.. ఆ సర్టిఫికెట్ రావడానికి కాస్త టైం పడుతున్నట్టు ఉంది అందుకే ఇంకా రాలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇంతకీ సర్టిఫికెట్ రావడానికి ఎక్కువ సమయం పట్టదు కదా నువ్వు ఎం ఏ చదివావా లేదా అని అడుగుతారు.. అదే మాట ఎంఏ బీభత్సంగా చదివేస్తేను అని శ్రీవల్లి అంటుంది.. అవునమ్మా మరి నీ ఎం ఏ సర్టిఫికెట్ ఏది అని రామరాజు అడుగుతాడు.. వాళ్లు చెప్పినట్లు నాకు కూడా అనుమానం వస్తుంది.. ఓ నిజంగానే ఎంఏ చదివావా లేదా? మరి సర్టిఫికెట్ ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ఇంగ్లీష్ లో మాట్లాడమంటే యా యా అనడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. భాగ్యం వచ్చి సర్టిఫికెట్లు ఇవిగోండి అన్నయ్యగారు అని చేతికిస్తుంది. ఆ సర్టిఫికెట్ల గురించి తెలుసుకోమని ప్రేమకు చెప్తాడు రామరాజు. అయితే అవి చూసిన ప్రేమ మీకు ఒక ప్రిన్సిపల్ గారు తెలుసు కదా మామయ్య గారు అని అంటుంది.

అవునమ్మా.. ఆయన నాకు బాగా తెలుసు అని రామరాజు అంటాడు.. అయితే మీరు వల్ల అక్క గురించి చెప్పండి ఆ స్కూల్లో జాబ్ ఉందేమో అడగండి అని అంటాడు.. రామరాజు అవును అమ్మ నువ్వు చెప్పింది నిజమే. నేను వెంటనే ఫోన్ చేసి అతన్ని కనుక్కుంటాను అని అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి తుమ్ముతుంది. అయ్యో తుమ్ము మంచిది కాదు మావయ్య గారు అని అంటుంది. భాగ్యం కూడా కూతురు ఏదంటే అది అంటుంది. కానీ నర్మద మాత్రం ఇది చాలా మంచి సమయం ఇది పోతే మళ్ళీ ఆ సమయం రాదు అని అంటుంది. రామరాజు వెంటనే ఫోన్ చేసి ప్రిన్సిపల్ కి తన కోడలు గురించి చెప్తాడు.. సరి ఆమెను ఇంటర్వ్యూకు రండి అని ప్రిన్సిపాల్ పిలుస్తాడు. అయితే కచ్చితంగా వల్లి అక్కకి ఉద్యోగం వస్తుంది కంగ్రాట్స్ అక్క అని ఇద్దరు చెప్తారు. నీ చదువు గురించి బయట పెట్టించాలని కాదు.. నిన్ను ఉద్యోగానికి పంపించాలని మేము ఇదంతా చేసాము అని నర్మదా ప్రేమ అంటారు.. భాగ్యం ఆనందరావును అడ్డంగా ఇరికించారని శ్రీవల్లి తరిమి తరిమి కొడుతుంది..

ఇక ధీరజ్ ఉదయం లేవగానే ఎదురుగా ప్రేమ ఆయుధాలను పట్టుకొని దెయ్యం పట్టిన దానిలాగా కూర్చుంటుంది.. నువ్వు రాత్రి నాకు ముద్దు ఎందుకు పెట్టావ్ రా నువ్వు తాగిన తర్వాత చేస్తావా అని అడుగుతుంది.. తాగిన మత్తులో చేశానే నిజంగా చేయలేదు అని అంటాడు ధీరజ్. కానీ ప్రేమ మాత్రం నాకు నువ్వు ముద్దు ఎందుకు పెట్టావో అసలు నిజం చెప్పు అని అడుగుతుంది.. అయితే ధీరజ్ మాత్రం ఎంత చెప్పినా సరే ప్రేమ వినకుండా తనని ఇబ్బంది పెట్టేస్తుంది. నీ మనసులో ఏదో ఒక ఇంటెన్షన్ లేకపోతే నువ్వు ఎందుకు నాకు ముద్దు పెడతావు అని ప్రేమ అడుగుతుంది.

ఆ తర్వాత రామరాజు బయట కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకొని వస్తాడు. షర్ట్ ఏం బాగోలేదు రా వెళ్లి వేరేది వేసుకురారా అనేసి రామరాజు అంటాడు.. నువ్వేమన్నా ఏసీల కూర్చొని పని చేస్తున్నావా ఇలా ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్లడానికి అని రామరాజు అనగానే సాగర్ షాప్ అవుతాడు. మనం చేస్తున్న పని ఏంటి? మన వేసుకునే డ్రెస్ ఏంటి? కొంచమైనా ఆలోచించాలి కదా అని సాగర్ నీ తిడతాడు. వీడికి ఈ మధ్య సోకులు ఎక్కువయ్యాయి అని అంటాడు రామరాజు . మధ్యలో వేదవతి వచ్చి సాగర్ ని ఏమీ అనొద్దు అన్న కూడా రామరాజు వెళ్లి వేరే బట్టలు వేసుకొని రా పో అనేసి అంటాడు.. చేతకాని వెధవ ఒక్క పని కూడా సరిగ్గా చేయడు అని అనగానే సాగర్ లోపలికి వెళ్లి బట్టలు వేసుకొని వస్తాడు.. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు నువ్వు వెళ్లి వెంటనే ఈ రెండు లక్షల డబ్బులని ఆయనకు మర్చిపోకుండా ఇవ్వాలి అని కచ్చితంగా చెబుతాడు.

సాగర్ డబ్బులు తీసుకుని వెళుతూ ఉండగా శ్రీవల్లి సాగర్ ని ఆపుతుంది. నర్మద వల్ల తను ఇరికించడం గుర్తుచేసుకొని సాగర్ ని ఎలాగైనా సరే రెచ్చగొట్టాలని అనుకుంటుంది.. రైస్ మిల్లులో మూటలు మోసే పని అని బాధపడుతున్నావా? మూటల్ మోసే పని అని మీ మావయ్య గారు అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఆ మాట ఇంకా కన్నా తండ్రి అంటే మీరు ఎలా తట్టుకుంటారు మరిది గారు అని శ్రీవల్లి కావాలని సాగర్ నీ రెచ్చగొడుతుంది. వెళ్తున్న సాగర్ తో చిన్న మాటంటేనే నువ్వు ఇంత బాధ పడిపోతున్నావు నర్మద మనసులో మా బాధ గురించి తెలిస్తే నువ్వు ఎంత బాధ పడిపోతావు అని అంటుంది.

Also Read : ఆస్తి కోసం శ్రీయ.. నిర్ణయం మార్చుకొని రాజేంద్ర.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

నర్మదా మనసులో బాధ ఏంటి వదిన అని అడుగుతాడు సాగర్.. వద్దులేండి మరిది గారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేయడం నా ఉద్దేశం కాదు.. మరిది గారు అని కావాలని పుల్లలు పెట్టేస్తుంది శ్రీవల్లి. ఏం లేదు మరిది గారు తన భర్త రైస్ మిల్లులో మూటలు మోసే పని చేస్తున్నాడని పాపం నర్మద కూడా చాలా బాధపడిపోతుంది అని అంటుంది శ్రీవల్లి. నర్మదా అలాంటిది కాదు అసలు ఫీల్ అవ్వదు అని సాగర్ చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Big Stories

×