E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయ.. నిర్ణయం మార్చుకొని రాజేంద్ర.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయ.. నిర్ణయం మార్చుకొని రాజేంద్ర.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న మీనాక్షిని చూసి ఆమెను ఫాలో అవుతుంది. బలే దొరికింది.. అసలు ఇలా దొరుకుతుందని అనుకోలేదు ఎలాగైనా దీన్ని ఈరోజు చంపేయాలి అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. తన మనుషులకి మీనాక్షి గురించి చెప్తుంది. ఆరాధ్య అమ్మమ్మ ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్లిందని పార్వతిని అడుగుతుంది.. పార్వతి నాకేం తెలుసు అని అంటుంది.. శ్రియ దగ్గరికి వెళ్లిన ఆరాధ్య అమ్మమ్మ ఎక్కడ అని అడిగితే ఏమో నాకు తెలీదు అని అంటుంది. అవని వాళ్ళ అమ్మ కోసం వెతకడానికి బయటకు వెళ్తారు. ఆ రౌడీలు మీనాక్షిని చంపబోతుంటే.. అసలు కాపాడుతారు ఆ రౌడీలని అరెస్ట్ చేస్తారు..

ఇప్పుడు అక్కడికి వచ్చిన అక్షయ్ అవని ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లాలి అనుకున్నావ్ అమ్మ ఇంట్లో చెప్పకుండా అని అవని అడుగుతుంది..మీనాక్షి నావల్ల మీ ఇంట్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు అందుకే నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకున్నాను అని అంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉంటారు.. మీనాక్షి ఇంటికొచ్చిన తర్వాత అందరూ తల ఒక మాట మాట్లాడతారు.. ఆ తర్వాత లాయర్ వచ్చి మీ ఆస్తి మీకు తిరిగి వచ్చేసిందని చెప్తారు.. మళ్లీ శ్రేయ ఆస్తి గురించి రచ్చ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… శ్రీయ ఆస్తి వచ్చేసింది కదా ఇంక ఎవరు ఆస్తి వాళ్ళకి ఇస్తారా అని అడుగుతుంది. ఆస్తి గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అలాగే పని కూడా మావయ్య గారి మాటకి ఎదురు చెప్పే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అంటుంది.. పతికి ఆస్తి పత్రాలు ఇచ్చి దేవుడి దగ్గర పెట్టమని రాజేంద్రప్రసాద్ అంటాడు. పార్వతి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మన గదిలో పెట్టు అని అంటాడు. శ్రీయ మాత్రం ఆస్తి కోసం పెద్ద రచ్చ చేస్తుంది.. కానీ ఆస్తి ఎవరికి దక్కదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్లీ మళ్లీ అదే పంచాయతీ పెడుతున్నారు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. పార్వతికి డాక్యుమెంట్స్ ఇచ్చి వాటిని లోపల పెట్టమని చెప్తాడు.

ఈ ఆస్తిని ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇక భానుమతి ఆస్తి అవని అక్షయ్ పేర్లమీద మీ మామయ్య రాసిచ్చేలా ఉన్నాడు అని అంటుంది. శ్రియ లోపలికి స్వీకరిని తీసుకుని వెళ్లి క్లాస్ పీకుతుంది. ఆస్తి రాకముందంటే ఇరుకింట్లో అడ్జస్ట్ అయి ఉన్నాము. ఇప్పుడు ఆస్తి వచ్చిన తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉంటూ అడ్జస్ట్ అయ్యి బతకవలసిన అవసరం ఏంటి అని అడుగుతుంది..

Advertisement

ఇప్పుడేంటి నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని శ్రీకర్ అంటాడు. ఒక మాట కూడా నువ్వు మీ నాన్నని అడగాలని అనిపించట్లేదా అని అంటాడు.. ఇప్పుడే కదా వచ్చింది కొద్దిరోజులు ఆగి అడుగుదాం లే అనేసి శ్రీకర్ అంటాడు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ కూల్ గా కూర్చొని డాక్యుమెంట్స్ ని చూస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన అక్షయ్ ఏం చేస్తున్నారు నాన్న అని అడుగుతాడు.. మా బిజినెస్ పార్ట్నర్ ఒకతను కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నాడు అని చెప్పాడు కదా.. అతను ఒక ఫైల్ ఇచ్చారు ఆ కొటేషన్ చూడమని నాకు చెప్పారు అని అంటాడు..

ఆ తర్వాత అవని కాఫీ తెచ్చి రాజేంద్ర ప్రసాద్ ఇస్తుంది.. అతను కాఫీ తాగుతూ ఉండగా కొందరు వ్యక్తులు అక్కడికి వస్తారు.. వాళ్లు శ్రీయ కోసం వచ్చామని చెప్తారు.. అవని శ్రీయని పిలుస్తుంది.రండి నేను మీ కోసమే వెయిట్ చేస్తున్నానని శ్రీయ అంటుంది.. వీళ్ళు ఎవరు అని అడుగుతారు ఆగండి నేను మా ఆయన్ని తీసుకొని వస్తాను అని శ్రియ అంటుంది.. లోపలికి వెళ్లి శ్రియా శ్రీకర్ తో రియల్ ఎస్టేట్ వాళ్లు వచ్చారని చెప్తుంది.. ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని శ్రీకర్ అడుగుతాడు. వాళ్లు ఒక వెంచర్ ని స్టార్ట్ చేస్తున్నారు.. ఆ వెంచర్ కి కొన్ని ప్లాట్స్ చాలా బాగున్నాయి.. అందులో ఒక ఫ్లాట్ నాకు బాగా నచ్చింది. దాన్ని నేను బుక్ చేసుకున్నాను దాని విలువ రెండు కోట్లు ఉంటుంది అని శ్రేయ అంటుంది..

ఇప్పుడు అంత పెద్ద ఫ్లాట్ మనకెందుకు శ్రీయా అని శ్రీకర్ అడుగుతాడు. ఆ ప్లాటు చాలా బాగుంది మనము ఇప్పుడు ఒక సగం కట్టాలని అన్నారు… మనమేమీ ఊరికే అడగనక్కర్లేదు మనకు రావాల్సిన ఆస్తిలో ఒక కోటి రూపాయలు అని అంటుంది.. విషయం గురించి మీ నాన్నని అడుగు అని శ్రీయా అంటుంది.. ఆ మాట వినగానే శ్రీకర్ నాన్న ఒప్పుకోడేమో అని అంటాడు.. కానీ శ్రియ మాత్రం మీ నాన్నని కచ్చితంగా ఒప్పించు నువ్వే అని అంటుంది. మొత్తానికి శ్రీకర్ని బయటకు తీసుకొస్తుంది..

రియల్ ఎస్టేట్ వాళ్లు వచ్చారు నాన్న నాకు ఒక కోటి రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు శ్రీకర్. ఆస్తి వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ గుర్తుకు వచ్చాయా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే రాజేంద్రప్రసాద్ ఎంత అడిగినా సరే నేను ఇప్పుడు ఆస్తి ఇవ్వడం కుదరదు అని అంటాడు. మాట వినగానే శ్రీకర్ మీరు అక్షయ అన్నయ్యకు వదినకు అడిగితే ఇస్తారు కదా.. మాకు ఎందుకు ఇవ్వరు మీరేం ఊరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇస్తే చాలు అని అంటాడు.. ఏంటి ఆస్తిలో వాటా ఇప్పుడు అడుగుతున్నావా ఇప్పుడు ఇవ్వనని చెప్పాను కదా అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.

Also Read : ప్రభావతిని ఆడుకున్న శృతి.. బాలును అవమానించిన మౌనిక.. రవిని కొట్టిన శృతి…

మాట వినగానే శ్రీకర్ ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావ్ ఈ వయసులో నీకు డబ్బు పిచ్చి అవసరమా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు మీ నాన్నను పట్టుకొని అంత మాట అంటావా అని పార్వతి శ్రీకర్ చంప పగలగొడుతుంది.. ఆ తర్వాత నీ నోటికి వచ్చినట్టు ఆస్తికోసం మాటలు అంటావా మీ నాన్న పట్టుకొని ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు అని పార్వతి శ్రీకర్ చెంప పగలగొట్టడంతో పాటుగా దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తుంది.. శ్రీకర్ ఇంకొద్ది రోజుల్లో ఆస్తి పంచక పోతే ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు. ఈ విషయాన్ని జైల్లో ఉన్న తన తండ్రితో చెప్తుంది పల్లవి. అవనికి ఆస్తి గురించి తెలియదు కదా ఆస్తిని ఎలాగైనా సరే మనమే సొంతం చేసుకోవాలని అంటుంది.. రాజేంద్రప్రసాద్ కూల్ గా ఉండడం చూసి పార్వతీ భానుమతి ఇద్దరూ కూడా ఏంటి మీరు ఇంత కూల్ గా ఉన్నారు ఆస్తి పంచొచ్చు కదా అని అంటారు. దాని గురించి నేను తర్వాత మాట్లాడుతానని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Big Stories

Advertisement
×