E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని అడ్డంగా ఇరికించిన నర్మద.. టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి.. ధీరజ్ వల్ల గొడవలు..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని అడ్డంగా ఇరికించిన నర్మద.. టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి.. ధీరజ్ వల్ల గొడవలు..

Illu Illalu Pillalu Today Episode December 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ విఆర్వో ఎక్సామ్ రాసినట్లు ఇలాగే శ్రీవల్లి పాయసం చేసే అందరికీ తెలిసిన చేసింది కదా మనం కూడా ఆ శ్రీవల్లి ని ఇరికించేందుకు పాయసం చేసి అందరికీ చెబుదాం అని అంటుంది నర్మదా.. ప్రేమ నర్మద ఇద్దరూ కూడా వంటగదిలో మాట్లాడుకోవడం విన్న శ్రీవల్లి గదిలోకి వెళ్లి తలపేసుకొని కంగారు పడుతూ ఉంటుంది.. ఓయమ్మో, ఓరి నాయనో వీళ్లు మంచితనానికి మారుపేరు అనుకున్న కానీ నా మీద ఇలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నన్ను ఇరికించేందుకు ప్లాన్ చేశారు అని భయపడుతుంది. అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా పాయసం తీసుకుని వచ్చి మావయ్య గారు అత్తయ్య గారు రండి అని అందరిని పిలుస్తారు. శ్రీవల్లి తలుపు తెరుచుకొని గుంట నక్కలాగా తొంగి చూస్తూ ఉంటుంది.. జ్వరం వచ్చిందని ఏదో నాటకం ఆడుతుంది.. ఈ నాటకమని తెలుసుకున్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా దొంగ డాక్టర్ని తీసుకుని వచ్చి ఆ నాటకానికి తెర తీస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లికి జ్వరం వచ్చిన విషయాన్ని నర్మదా, ప్రేమ ఇంట్లో చెప్తారు.. అయ్యో వల్లీకి జ్వరం వచ్చిందా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి.. మేము ఆల్రెడీ డాక్టర్ కి ఫోన్ చేసాము. చాలా పెద్ద పేరున డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పాము ఆయన త్వరగా నే వచ్చేస్తాడు అని అంటారు.. అప్పుడే ఇంట్లోకి ఒక డాక్టర్ రాగానే ఆ డాక్టర్ తో తిరుపతి కామెడీ చేస్తాడు.. ఆ డాక్టర్ నీ ప్రేమ నర్మదలు వల్లి రూమ్ లోకి తీసుకొని వెళ్తారు.. ఈ డాక్టర్ని తేడాగా ఉన్నారు అని వల్లి అంటుంది. ప్రేమ నర్మదలు ఇద్దరూ శ్రీవల్లిని ఆడేసుకుంటారు. మొత్తానికి నిజం చెప్పేసేసి వల్లి బయటపడుతుంది..

వీడు నిజంగానే డాక్టరేనా? ఏంటి కుక్కల డాక్టర్స్ లాగా అలా చూస్తున్నాడు అని అడుగుతుంది శ్రీవల్లి. అతను నిజంగానే డాక్టర్ కాదు మేము నాటకం ఆడించాము అని ఉంటారు నర్మదా ప్రేమలు.. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు కదా వెళ్ళు అనేసి అంటారు.. హెలికాప్టర్ లోను లేదా, విమానంలోనూ నన్ను నరకానికి పంపించాలని అనుకుంటున్నారు కదా వెళ్లక చస్తానా అని శ్రీవల్లి అనుకుంటుంది.. ఇక శ్రీవల్లిని ప్రేమ నర్మద ఇద్దరు కలిసి దగ్గరుండి ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తారు.

అక్క నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్ళు లేదంటే నువ్వు మావయ్యకి ఏం చెప్పాలో అది నిర్ణయించుకొని అంటారు. ప్రిన్సిపల్ రూమ్ నువ్వు వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వు అని లోపలికి పంపిస్తారు. అక్కడ శ్రీవల్లి సర్టిఫికెట్లు తీసిన ప్రిన్సిపల్ లోడలోడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తాడు.. అయితే శ్రీవల్లి వీడేంటి గడగడ మాట్లాడేస్తున్నాడు కాస్త గ్యాప్ ఇవ్వరా నీ దుంప తెగ అనేసి తిట్టుకుంటుంది.. అయితే అతను మీ గురించి చెప్పండి అని అడుగుతాడు. భాగ్యం ఆనందరావుని కిటికీలోంచి చూసిన శ్రీవల్లి సంతోషంగా ఉంటుంది.

ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం తీసుకొచ్చిన ఒక ఇంగ్లీష్ టీచర్ ఆ ఇంటర్వ్యూ గురించి అన్ని చెప్తాడు.. ఆ తర్వాత ప్రేమ నర్మదలను అటెండర్ లోపలికి రమ్మని పిలుస్తాడు.. ఏంటి సర్ చెప్పండి అని అడుగుతారు. ఈమె ఇంగ్లీష్ టీచర్గా అప్పాయింటెడ్ అని అనగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. మీరు ఇంటర్వ్యూ చేయకుండా అపాయింట్ చేస్తున్నారా ఏంటి అని అడుగుతారు. ఇంటర్వ్యూ చేయకుండా ఎలా అపాయింట్ చేస్తాను. నేను ఒక ప్రిన్సిపాల్ ని టీచర్స్ ని తీసుకునే ముందర ఫ్లూయన్స్ ని అలాగే వాళ్ళ స్కిల్స్ ని చెక్ చేశా కదా తీసుకుంటాను అని అంటారు. ఆ మాట వినగానే శ్రీవల్లి సంతోషంతో పొంగిపోతుంది..

టీచర్ మీరు ఇవ్వాల్టి నుంచి క్లాసెస్ తీసుకోవచ్చు అని అంటారు ప్రిన్సిపాల్. . అక్కడ శ్రీవల్లి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడానికి కారణం ఏంటో ఆలోచిస్తూ ఉంటుంది. నర్మదా ప్రేమలు శ్రీవల్లికి జాబ్ ఎలా వచ్చింది అబ్బా అని షాక్ అవుతూ ఉంటారు. అక్కడ ఎదురుగా ఆనందరావు, భాగ్యం కనిపించడంతో ఇదా నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడానికి అసలు కారణమని అనుకుంటారు. బయటికి రాగానే నువ్వు ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్స్ అక్క. నువ్విలా చీటింగ్ చేసి సెలెక్ట్ అయ్యావు మీ అమ్మానాన్నలని చూసాను నేను అని నర్మదా అంటుంది.

నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకుండా ఉంటే ఈరోజు మాత్రమే అనేవాళ్ళు.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా సెలెక్ట్ అయ్యి ఇంగ్లీష్ చెప్పలేక స్టూడెంట్స్ కి క్లాసులు తీసుకోలేక, నువ్వు ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తావు అని అంటారు.. ఆ మాట వినగానే శ్రీవల్లికి గుండెల్లో గుబులు పుడుతుంది.. ఇక తర్వాత రోడ్డుపైన తిరుపతి డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. అది చూసిన ధీరజ్ మామ ఏంటి పిచ్చోళ్ళకు రోడ్డు మీద డాన్స్ వేస్తున్నాడు అని అతని అడుగుతాడు. ఈ భూ ప్రపంచం లో నా ప్రేమ చాలా గొప్పది అని అతను డైలాగులు వేస్తాడు. అప్పుడే అక్కడ అమూల్యను చూసిన ధీరజ్ ఈ టైంలో తను కాలేజీలో ఉండాలి కదా.. ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది ఫాలో అయ్యి తెలుసుకోవాలి అని అమూల్యని ధీరజ్ ఫాలో అవుతాడు.

Also Read :పనోళ్లను తీసేసిన రాజేంద్ర.. ఏకలింగం కు షాక్.. ఆస్తులపై రాజేంద్ర కీలక నిర్ణయం..?

అమూల్య వెనకాల వెళ్లిన ధీరజ్ విశ్వంతో అమూల్య మాట్లాడటం చూసి షాక్ అవుతాడు.. అమూల్య కి మాయమాటలు చెప్పి వాడే ఏదో ఒకటి చేసినట్లు ఉన్నాడు. ఎలాగైనా సరే వీడి ఈరోజు అంతు చూడాలి అని ధీరజ్ అనుకుంటాడు.. వీడి సంగతి ఈరోజు ఎలాగైనా తేల్చేస్తాను అని ధీరజ్ కోపంగా వెళుతూ ఉంటాడు. అయితే అమూల్య విశ్వం ఇద్దరు బండిపై వెళ్తారు. ఇందులో ఒక వ్యాన్ రావడంతో వాళ్ళిద్దరూ కనిపించకుండా వెళ్ళిపోతారు. శ్రీవల్లి క్లాసు కు వెళ్లి అక్కడ నానా తంటాలు పడుతుంది.. ఇంగ్లీష్ బుక్ చూసి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Big Stories

×