E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పనోళ్లను తీసేసిన రాజేంద్ర.. ఏకలింగం కు షాక్.. ఆస్తులపై రాజేంద్ర కీలక నిర్ణయం..?

Intinti Ramayanam Today Episode: పనోళ్లను తీసేసిన రాజేంద్ర.. ఏకలింగం కు షాక్.. ఆస్తులపై రాజేంద్ర కీలక నిర్ణయం..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆ సమాధిని క్లీన్ చేసి పూలమాల వేస్తారు. నేను పుట్టకపోతే నువ్వు బ్రతికి దానివి కాదమ్మా నన్ను ఎందుకు అమ్మ వదిలేసి పోయావు అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తల్లి సమాధిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరెంతగా ఓదార్చినా కూడా అక్షయ్ మాత్రం నా తల్లి నా ముందర లేదు అని బాధపడుతూ ఉంటాడు.. అమ్మ జ్ఞాపకాలని నేను గుర్తుంచుకునే అవకాశం కూడా లేకపోయింది. పొత్తులలో ఉన్నప్పుడే నువ్వు చనిపోయావు అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తల్లి ఎంతగా బిడ్డని ముద్దుపెట్టుకొని లాలిస్తుందో కదా అనేసి చాలా ఫీల్ అవుతారు..

నువ్వు నాకు మళ్ళీ కనిపిస్తే బాగుంటుందమ్మా అని బాధపడతాడు. ఈ ఊర్లో కూడా మనకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ మీ అమ్మ ఆస్తులు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇన్ని ఆస్తులున్నప్పుడు మరి అక్కడికి ఎందుకు వచ్చారు అని అడగ్గా.. ఇక్కడ నా భార్య ప్రేమని పొందితే ఇప్పుడున్న నా భార్య ప్రేమని పొందలేకపోతున్నానేమోనని అనుకుంటారు. అందుకే ఇక్కడికి రాలేదు అని రాజేంద్ర అంటాడు.. ఇంటికి వెళ్ళగానే అక్కడున్న పనిమనిషి కర్ర వేస్తుంది. పొరపాటు గా వేసిన విషయాన్ని పల్లవి గమనించకుండా ఆమెని తిడుతుంది అలాగే కొడుతుంది కూడా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..తన కుటుంబ సభ్యులతో కలిసిరాజేంద్రప్రసాద్ సొంత ఇంటికి వెళ్లి పోతారు. ఇంటిని చూసి అందరూ చాలా బాగుంది అని అనుకుంటారు. పల్లవి శ్రీయాలు మాత్రం ఈ గొప్ప పెంకుటిల్లు కోసం మనం ఇంత దూరం వచ్చామని అంటారు.. అక్కడున్న పని వాళ్ళ అందరితోనూ రాజేంద్ర ప్రసాద్ చాలా ప్రేమగా మాట్లాడుతాడు. ఇంట్లోకి వెళ్ళగానే పనిమనిషి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లేటప్పుడు పల్లవి కి చెయ్యి తగులుతుంది. కొంచెం కూడా బుద్ధి లేదా అని పల్లవి ఆమెపై సీరియస్ అవుతుంది.. రాజేంద్రప్రసాద్ అక్కడున్న పని వాళ్ళందరినీ మీరు ఇళ్లకు వెళ్లిపోండి మేము వెళ్లేంతవరకు మీరు ఇక్కడికి రావద్దు అని అంటాడు.

పని వాళ్ళని పంపించేస్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని శ్రేయ అడుగుతుంది. ఇంట్లో పనులన్నీ మీకు మీరే చేసుకోవాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. సిటీలో లాగా మిక్సర్లు గ్రైండర్లు ఏవి ఉండవు ఏది కావాలన్నా రుబ్బుకోవాలి అని అంటాడు. ఇంట్లో ఉండే ప్రతిదీ కూడా మీరే శుభ్రంగా ఉంచుకోవాలి అని రాజేంద్రప్రసాద్ కోడళ్ళకి కండిషన్ పెడతారు. ఇక్కడ చుట్టుపక్కల దొరికే వాటితోనే మీరు భోజనం చేసుకొని తినాలి కొత్త కొత్తవి ఏవి ఇక్కడ దొరకవు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారా మావయ్య గారు అని శ్రీయ పల్లవిలు రచ్చ చేస్తారు.

Advertisement

ఆ తర్వాత అందరూ పల్లెటూరు వాతావరణం చూడాలని బయటకు వెళ్లాలని అనుకుంటారు. బయటికి వెళ్తున్న వాళ్ళందరూ అక్కడున్న ప్రకృతిని చూసి చాలా అందంగా ఉంది. ఈ చెట్లు ఇవన్నీ మనసుకి చాలా హాయిగా అనిపిస్తున్నాయి అని కమలంటాడు. ఎప్పుడు సిటీలో తిరగకుండా ఇలా పల్లెటూర్లో ఉండిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది అని కమల్ అక్షయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇక వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉండగానే ఆ ఊరి సర్పంచు ఏకలింగం అక్కడికి వస్తాడు. నీకు రమ్మని చెబుదామని నేనే అనుకున్నాను. కానీ నువ్వే వచ్చావు ఏంటి ఆకలింగం అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా అండి.. ఒకసారి పలకరించి పోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని ఏకలింగం అంటాడు.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదు ఇన్నేళ్ల తర్వాత మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అని ఏకలింగం అంటాడు.

అవును ఏక లింగం.. ఇక్కడ మా ఆస్తులు ఉన్నాయి కదా వాటి గురించి లెక్కలు చూద్దామని అనుకుంటున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అవునండి అలాగే చూసుకుందాం లేండి అని అంటాడు.. ఆ తర్వాత మీకోసం భోజనం తీసుకొచ్చానండి గోదావరి స్పెషల్ ఐటమ్స్ అన్ని చేసుకొని వచ్చాను ఇక్కడ పెట్టండిరా అని వాళ్ళకి భోజనం ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ భోజనం గురించి మాట్లాడుకుంటూ లొట్టలు వేసుకుంటూ అందరూ తింటారు. ఇక మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మాకు అర్థం కావట్లేదు మావయ్య గారు అని పల్లవి శ్రియాలు అడుగుతారు. ఆస్తులు గురించి మీరు ఇంకా మాట్లాడలేదు ఏంటి మావయ్య గారు అని శ్రేయ అంటుంది. ఎప్పుడు చూసినా మీకు ఆస్తులు గురించేనా ఇంకేమీ లేవా మనుషులు, మానవత్వాలు బంధాలు, బంధుత్వాలు అలాంటివి మీకు కనిపించవా అని రాజేంద్రప్రసాద్.

ఇక్కడ ఆస్తులు గురించి మీరు ఏక లింగం గారితో మాట్లాడారు కదా అయితే మాకు ఆస్తులు పంచుతారా అని పల్లవి కూడా అడుగుతుంది. ఆస్తులు అన్నమాట వచ్చింది. కాబట్టి నేను చెబుతున్నాను. మీకు ఆస్తులు అనేవి మీ సొంతం కావు.. మీ వారసులకి అంటే మీకు పుట్టబోయే బిడ్డలకి ఆ ఆస్తిని రాసేసాను అని అంటారు రాజేంద్రప్రసాద్. అలాగే సగం ఆస్తిని ట్రస్ట్ కి రాసిచ్చానని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మీ ఇద్దరు కూడా ఆస్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప పిల్లలు కనాలి అన్న ఆలోచన మీకు లేదు. మాకు పిల్లల్ని చూసుకోవాలన్న సంతోషాన్ని కూడా ఇవ్వట్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు..

Also Read :లక్ష కోసం మనోజ్ ప్లాన్.. పోటీలో పాల్గొంటున్న మీనా, బాలు.. ప్రభావతి, సత్యం దొరికిపోయారే..?

అయితే మేము ఇప్పుడున్న కోట్ల ఆస్తిని చూసుకోవడానికి తప్ప అనుభవించడానికి అవసరం లేదా అని శ్రేయ అంటుంది.. ముందు మీరు పిల్లల్ని కనండి అప్పుడు ఆస్తి మీ పిల్లల పేరు మీద ఆస్తి ఉంటుంది కదా.. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని రాజేంద్రప్రసాద్ కండిషన్ పెడతాడు.. శ్రీయ పల్లవిలు మావయ్య గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వాటిలో మార్పు ఉండదు.. మనం ఎంత చెప్పినా ఆయన మాట వినరు ముందు మన పని మనం చేసుకోవాలి అని పల్లవి శ్రీయాకు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఆ తర్వాత అక్షయ్ అవనీలు కూడా నాన్న చెప్పిన మాట చాలా బాగుంది. అలా అయినా వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మాట్లాడుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×