E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ మాటకు ప్రేమ షాక్.. శ్రీవల్లి కొత్త డ్రామా.. అమూల్యకు పెళ్లి ఫిక్స్..?

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ మాటకు ప్రేమ షాక్.. శ్రీవల్లి కొత్త డ్రామా.. అమూల్యకు పెళ్లి ఫిక్స్..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమవల్ల అమూల్యను తన కుటుంబ సభ్యులు తిట్టారని వేదవతి బాధపడుతూ ఉంటుంది. మాకు పెంపకం గురించి నేర్పిస్తున్నారా అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కూతుర్ని అన్ని మాటలు అనేటప్పుడు మీ నాన్న ఒకసారి ఆలోచించలేదా? ఎవరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెంపకం గురించి మాకు మీ నాన్న చెప్తున్నాడా మరి నీ పెంపకం ఎలాంటిది అని వేదవతి సీరియస్ అవుతుంది. వేదవతి మాట్లాడిన ప్రేమ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శ్రీవల్లి ఇంట్లో జరుగుతున్న గొడవలు కి చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ నర్మదా ఇద్దరు కూడా దూరంగా ఉండడంతో నా సంతోషానికి అవధులు ఉండవు. ఈ సంతోషమైనా క్షణాలను తన కుటుంబ సభ్యులతో గడపాలని అనుకుంటుంది. శ్రీవల్లి పక్కకు వెళ్లి డాన్సులు వేస్తుంది. ఆ తర్వాత తనని ఎవరూ చూడకుండా ఇంట్లోంచి బయటికి వెళుతుంది. అప్పుడు అక్కడ ఆనందరావు భాగ్యం కూడా గుంటనక్క లాగా దాక్కొని ఉంటారు. ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి తెలుసుకున్న వాళ్లు మనకు కావాల్సిన ఇది కదా చాలా సంతోషంగా ఉంది అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. అక్కడే ఉన్న ధీరజ్ ని చూసి ప్రేమ తన కన్నీరుని ఒప్పుకోలేక అతనితో మాట్లాడుతుంది. ఎవరన్నా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు కానీ అత్త అంత మాట అనే లోపల నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. నా జీవితం ఎప్పుడూ బాగుండాలని కోరుకునే అత్త ఇలా చేయడం నాకు నచ్చలేదు అని ప్రేమ బాధపడుతుంది. కానీ ధీరజ్ మాత్రం అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి అని అంటాడు. ప్రేమ ఎంత చెప్పినా కానీ ధీరజ్ మాత్రం వినడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.. నువ్వు చేసిన పనికి మీ నాన్నని నేను ఎన్ని మాటలు అనాలి అని ధీర అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ వెళ్తుంది..

Advertisement

ఇక శ్రీవల్లి మాత్రం ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని తనకు అడ్వాంటేజ్ గా ఉన్నాయని సంతోషంగా ఉంటుంది.. వల్లే ఇదంతా జరిగింది. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను గురించి తెలుసుకోవాలంటే మా ఈ కొత్త సీరియల్ ని చూడాలి అంటూ తన ఒక డైలాగ్ చెప్తుంది.. డైరెక్టర్ శ్రీవల్లి గురించి మీకు ఎవరికి తెలియదు. ఒక్కొక్కరికి తగ్గట్లుగా ఒక్కొక్క పాటను ప్లే చేస్తాను మీరు వినండి అంటూ అక్కడ ఎవరికీ తగ్గట్లు సంబంధించిన పాటని ప్లే చేస్తుంది.. చాలా సంతోషంగా ఉన్న శ్రీవల్లి ఈ గొడవలు వల్ల నేను ఎటు వెళ్లడానికి ఉండదు ఇంట్లోనే ఉంటాను అని అంటుంది..

తర్వాత నర్మదా ప్రేమని ఎందుకు దూరం పెట్టాలి తను చేసిన తప్పేంటి అని అనుకుంటుంది.. అయితే ప్రేమ ఏం చేసినా తను తెలియక చేసింది అని ఆలోచించినా నర్మదా ప్రేమతో మాట్లాడాలి అని వెళుతుంది. ప్రేమ నర్మదని చూడకుండా ఉంటుంది. నర్మదా అక్కడ చాప వేసి ఇక్కడికి రా అని చెప్పేసి తీసుకెళ్లి తనతో కలిసి పడుకుంటుంది.. హేమ మాత్రం ఇంట్లో వాళ్ళందరూ అన్న విషయం గురించి తెలుసుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మొత్తానికి ఇద్దరూ కలిసిపోతారు.

Advertisement

ఉదయం శ్రీవల్లి దేవుడికి పెద్ద లడ్డు పెట్టి నా కోరిక తీర్చవు నువ్వు ఉన్నవు స్వామి అంటూ దండం పెట్టుకుంటుంది.. అయితే బయటికి వచ్చి చూడగానే నర్మదా ప్రేమలిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ మై గాడ్ ఏంటి వైపరీత్యం అంటూ శ్రీవల్లి షాక్ అవుతుంది.. నిన్నటి వరకు ఇంతగా కొట్లాడుకున్నారు కానీ ఇప్పుడు కలిసిపోయారేంటి అని దేవుడి దగ్గరికి వెళ్లి నువ్వు లేవు దేవుడా అని ఆ లడ్డును తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది.. శ్రీవల్లి దేవుడు లేడు అంటూ చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతుంది..

నర్మదా మీ అన్నయ్య అమూల్యని ట్రాప్ చేశాడు అని అనుకున్నాము అని అంటుంది.. లేదు అక్క మా అన్నయ్య ప్రేమించలేదు అమూల్యని మా అన్నయ్యని ప్రేమించింది.. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అక్క మా అన్నయ్యకు అమూల్య మీద ఎటువంటి ఫీలింగ్ లేదు.. అమూల్య చేసింది తప్పే అనుకుంటే మరి మీ అన్నయ్య చేసింది తప్పు కదా అని ప్రేమతో అంటుంది.. నర్మదా మీ అన్నయ్య ట్రాక్ చేసి అమూల్యని పెళ్లి చేసుకొని నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను.. నేను ఇదంతా ట్రాప్ అని ప్రూవ్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని ప్రేమను నర్మదా అడుగుతుంది.

అవసరం లేదక్కా ఇదంతా నాకు అర్థం అయిపోయింది అని ప్రేమ అంటుంది. ఎందుకు భయపడుతున్నావు ప్రేమ నేను ప్రూవ్ చేసి నీవు అసలు నిజాలు ఏంటో తెలుసుకుంటే మంచిది కదా అని అంటుంది. ప్రేమ నేను చెప్పేది విను ప్రేమ అని ఎంతగా నర్మదా బ్రతిమిలాడిన కూడా ప్రేమ వినదు. ఇంట్లో జరుగుతున్న గొడవలు కి నేనే కారణం అంటున్నారు ఇకమీదట ఏ గొడవలకి నేను కారణం కాకూడదు అక్క అనేసి ప్రేమా వెళ్లిపోతుంది.. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీవల్లి వింటుంది.. వీళ్ళిద్దరూ కలిసిపోలేదన్నమాట అమ్మయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని దేవుడి దగ్గర నుంచి తీసిన లడ్డుని తీసుకెళ్లి మళ్ళీ దేవుడి దగ్గర పెడుతుంది.. నువ్వు ఉన్నావ్ నా తప్పుల్ని క్షమిస్తావు అనేసి అంటుంది..

Also Read : తండ్రి ఆస్తి కోసం పల్లవి ప్లాన్.. దొరికిపోయిన ఏకలింగం.. అవని నెక్స్ట్ ఏం చేస్తుంది..?

నిన్న అన్నందుకు నన్ను క్షమించు దేవుడా వాళ్ళని ఎప్పుడూ అలానే కొట్టుకు చచ్చేలా చెయ్యి.. నా ఇష్టమైన దేవుడివి కదా నాకు నచ్చినట్లే చెయ్యి దేవుడా అని ప్రార్థిస్తుంది.. రామ రాజు అందర్నీ పిలవమని వేదవతి తో అంటాడు.. మీ నాన్న మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాడు అందుకే పిలిచాడు అని వేదవతి అంటుంది. సాగర్ అడిగితే రామరాజు చాలా కోపంగా ఉంటాడు.. ఇంట్లో ముగ్గురు మొగాళ్ళు ఉన్నారు కానీ ఎవరూ కూడా చెల్లెల్ని పట్టించుకోవట్లేదు అని రామరాజు సీరియస్ అవుతాడు. మీ ఇంట్లో ఒక చెల్లెలు ఉంది దాన్ని ఎలా చూసుకోవాలి. కాలేజీకి వెళ్తుంది అని అన్నగా ఒక్కరు కూడా బాధ్యతగా లేరు.. మీ గొడవలు నీవే కానీ చెల్లెలు గురించి ఆలోచించే బాధ్యత ఒక్కరి కూడా లేదు అని రామరాజు క్లాస్ పీకుతాడు.. అమూల్య జీవితం ఎటువంటి సమస్యలు పడకూడదని నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నామని అంటాడు. అమూల్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము.. మాట వినగానే అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో ధీరజ్ ప్రేమను మాత్రం మళ్లీ గొడవపడతారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×